AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yagya Benefits: యాగం చేయడం వెనుక ఆధ్యాత్మిక కారణమే కాదు.. శాస్త్రీయ ప్రయోజనాలు కూడా ఉన్నాయి.. ఏవి ఏమిటంటే

Yagya Benefits:యజ్ఞం లేదా యాగం ఒక విశిష్టమైన హిందూ సంప్రదాయం. పురాణకాలం నుంచి భారతదేశంలో ఈ యజ్ఞ క్రతువుని నిర్వహిస్తూనే ఉన్నారు. ఆ దేవతలను తృప్తి పరచడానికి కొన్ని వస్తువులను అగ్నికి ఆహుతి ఇవ్వడమే..

Yagya Benefits: యాగం చేయడం వెనుక ఆధ్యాత్మిక కారణమే కాదు.. శాస్త్రీయ ప్రయోజనాలు కూడా ఉన్నాయి.. ఏవి ఏమిటంటే
Yagya Benefits
Surya Kala
|

Updated on: Mar 11, 2022 | 9:42 AM

Share

Yagya Benefits:యజ్ఞం లేదా యాగం ఒక విశిష్టమైన హిందూ సంప్రదాయం. పురాణకాలం నుంచి భారతదేశంలో ఈ యజ్ఞ క్రతువుని నిర్వహిస్తూనే ఉన్నారు. ఆ దేవతలను తృప్తి పరచడానికి కొన్ని వస్తువులను అగ్నికి ఆహుతి ఇవ్వడమే యజ్ఞము. ఈ యజ్ఞాన్ని యాగం, క్రతువు, హవనం అని కూడా అనవచ్చు. ఈ యజ్ఞానికి అనుబంధంగా అనేక నియమ, సంప్రదాయాలు ఉన్నాయి. ఈ యజ్ఞ యాగాలను మన పూర్వీకులు నిర్వహించడం వెనుక అనేక శాస్త్రీయ కారణాలు ఉన్నాయని చాలామందికి తెలియదు. ప్రస్తుతం కాలంలో ఎక్కువమంది శారీరక, మానసిక, ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ..  మనశ్శాంతి కోసం అనేక ప్రాంతాలకు తిరుగుతున్నారు. అయితే ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, యోగా, శారీరక శ్రమ,  ఆరోగ్యకరమైన జీవనశైలి వంటి అనేక అంశాలు ఆరోగ్యకరమైన జీవితానికి చాలా సహాయకారిగా ఉంటాయి. అయితే మరొక ఎంపిక (Yagya Benefits ) యాగం. ఈ యాగం చేసే సమయంలో మంత్రాలను పఠించడం వల్ల ప్రకంపనలు పుడతాయి.  ఆ సమయంలో శరీరంలోని చక్రాలను శుభ్రపరిచే సానుకూల శక్తిని విడుదల అవుతుంది. ఈరోజు యాగం వల్ల కలిగే ఇతర ప్రయోజనాలను తెలుసుకుందాం.

  1. మానసిక ఆరోగ్యం: ప్రస్తుతం ప్రజల జీవనశైలి శారీరక, మానసిక సమస్యలకు కారణమవుతోంది. ఈ రోజుల్లో మానసిక ఒత్తిడి సర్వసాధారణమైపోయింది. అటువంటి పరిస్థితిలో, యాగం మీకు మానసిక ప్రశాంతతను అందించడానికి పనిచేస్తుంది. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. మనస్సును ప్రశాంతపరుస్తుంది. యాగం నుండి వెలువడే పొగ వల్ల శరీరం, మనస్సు శుద్ధి అవుతాయి. దీంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది.
  2. గాలిని శుద్ధి : మనం పీల్చే గాలి శుభ్రంగా, స్వచ్ఛంగా ఉండటం చాలా ముఖ్యం. పెరుగుతున్న కాలుష్యం కారణంగా చాలా మంది ప్రజలు అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. వైద్యుని సలహాలు తీసుకోవడం, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడమే కాకుండా, యజ్ఞయాగాదులను నిర్వహించడం వలన ఇంటి గాలి కూడా శుద్ధి చేసుకుంటుంది. యజ్ఞం నుంచి వెలువడే హవనం.. కలుషితమైన గాలిని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. ఇది పర్యావరణంలో ఉండే ప్రమాదకరమైన బ్యాక్టీరియాను తొలగిస్తుంది. పర్యావరణంలో ఉన్న ప్రమాదకరమైన బ్యాక్టీరియాను తొలగించడానికి పని చేసే వివిధ రకాల పదార్థాలను యాగంలో ఉపయోగిస్తారు. ఇందులో గంథం చెక్క, మామిడి చెక్క, నెయ్యి మొదలైనవి ఉన్నాయి.
  3. ఊపిరితిత్తులకు మేలు: యజ్ఞం వలన వెలువడే పొగ.. మెదడు, ఊపిరితిత్తులు, శ్వాస సమస్యలు తొలగిపోతాయి. దీంతో శ్వాసకోశ వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది.
  4. యజ్ఞం మతపరమైన అనుబంధం: మత విశ్వాసాల ప్రకారం, యాగం ఇంట్లో సానుకూల శక్తిని నింపుతుంది. ఇది ప్రతికూలతను తొలగిస్తుంది. అంతేకాదు ఇంటి పరిసరాలను కూడా శుద్ధి చేస్తుంది. ఒక వ్యక్తి రాశిచక్రంలో గ్రహాల సంచారం చెడుగా ఉంటే, అప్పుడు యాగం చేయవచ్చు. దీంతో జాతక దోషాలకు పరిహారం లభిస్తుంది.

Note: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం, మతపరమైన నమ్మకం, విశ్వాసం ఆధారంగా ఇవ్వబడింది.) 

Also Read: ABHA Health Card: రూ.5 లక్షల ఉచిత ఆరోగ్య భీమా.. కేంద్రం అందిస్తున్న ABHA హెల్త్ కార్డును ఎలా పొందాలంటే..