Zodiac Signs: మార్చి 27 నుంచి ఈ 3 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!

Zodiac Signs: జ్యోతిష్యం ప్రకారం.. అత్యంత శుభప్రదంగా భావించే బృహస్పతి 32 రోజుల తర్వాత ఉదయించబోతున్నాడు. బృహస్పతి ఉదయించడంతో ఈ 3 రాశుల వారికి బలమైన

Zodiac Signs: మార్చి 27 నుంచి ఈ 3 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
Zodiac Signs
Follow us
uppula Raju

|

Updated on: Mar 11, 2022 | 8:45 AM

Zodiac Signs: జ్యోతిష్యం ప్రకారం.. అత్యంత శుభప్రదంగా భావించే బృహస్పతి 32 రోజుల తర్వాత ఉదయించబోతున్నాడు. బృహస్పతి ఉదయించడంతో ఈ 3 రాశుల వారికి బలమైన ప్రయోజనాలను అందిస్తుంది. దేవగురు బృహస్పతి 23 ఫిబ్రవరి 2022న అస్తమించాడు. ఇప్పుడు 27 మార్చి 2022న ఉదయించబోతున్నాడు. దీనివల్ల ఈ 3 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. ప్రతి పనిలో విజయం సాధిస్తారు. అయితే ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. అందులో మొదటగా కన్యారాశి గురించి చెప్పాలి. బృహస్పతి ఉదయించడం వల్ల కన్యా రాశి వారికి అనేక అవకాశాలు లభిస్తాయి. వారు కొత్త ఉద్యోగం లేదా పెద్ద ఒప్పందాన్ని పొందవచ్చు. ప్రమోషన్-ఇంక్రిమెంట్ అందుబాటులో ఉంటుంది. పూర్తి డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నిలిచిపోయిన పనులు కూడా ఇప్పుడిప్పుడే ప్రారంభం కానున్నాయి. ఈ సమయంలో శ్రీమహావిష్ణువును పూజించడం వల్ల మరిన్ని ప్రయోజనాలు చేకూరుతాయి.

తులారాశి బృహస్పతి ఉదయించడం వల్ల తులారాశి వారికి మేలు జరుగుతుంది. ప్రతి పనిలో విజయం సాధిస్తారు. బాధ్యతలు కూడా పెరుగుతాయి. ఇది మీకు గౌరవం, మర్యాదని తెస్తుంది. ప్రజలు నిన్ను స్తుతిస్తారు. మీరు ఉద్యోగాలు మార్చుకునే అవకాశం ఉంటుంది. అయితే ఏ పనిలోనైనా తొందరపాటు మానుకుంటే మంచిది.

మకర రాశి కుజుడు ఉదయించడం వల్ల మకర రాశి వారికి అనేక ప్రయోజనాలు ఉంటాయి. కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. మీరు పదవి ప్రతిష్ట పొందుతారు. ధనం లాభదాయకంగా ఉంటుంది. పాత పనులు పూర్తవుతాయి. జీవిత భాగస్వామి సలహాలకు ప్రాధాన్యత ఇస్తూ జాగ్రత్త వహించండి. అంతా మంచి జరుగుతుంది.

గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం జ్యోతిష్యం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. సాధారణ పాఠకులని ఉద్దేశించి రాయడం జరిగింది.

ఈ జీవులు కళ్లు తెరిచే నిద్రపోతాయా.. శాస్త్రవేత్తల అధ్యయనంలో షాకింగ్‌ విషయాలు..

Cricketers: ఇతర మతాల అమ్మాయిలను ప్రేమించి పెళ్లిచేసుకున్న భారత క్రికెటర్లు వీరే..!

Farmers News: రైతులకు గుడ్‌న్యూస్‌.. త్వరలో వారికోసం చౌకగా ఈ సేవలు..!