Farmers News: రైతులకు గుడ్‌న్యూస్.. త్వరలో వారికోసం చౌకగా ఈ సేవలు..!
Farmers News: త్వరలో వ్యవసాయ రంగంలోకి డ్రోన్‌లను తీసుకొచ్చేందుకు ప్రభుత్వంలోని మూడు విభాగాలు కృషి చేస్తున్నాయని కేంద్ర వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ప్లాంట్
Farmers News: త్వరలో వ్యవసాయ రంగంలోకి డ్రోన్‌లను తీసుకొచ్చేందుకు ప్రభుత్వంలోని మూడు విభాగాలు కృషి చేస్తున్నాయని కేంద్ర వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ప్లాంట్ ప్రొటెక్షన్ క్వారంటైన్ అండ్ స్టోరేజీ డైరెక్టర్ (DPPQS ) ఆధ్వర్యంలోని సెంట్రల్ ఇన్‌సెక్టిసైడ్ బోర్డు, రిజిస్ట్రేషన్ కమిటీ (CIB&RC) డ్రోన్‌లను పరీక్షించడానికి అనుమతి కోసం ఎనిమిది పంట సంరక్షణ కంపెనీల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. క్రాప్‌లైఫ్ ఇండియా థింక్‌ఏజీ నిర్వహించిన ఇండస్ట్రీ రౌండ్‌టేబుల్ వర్చువల్ సమావేశంలో పాల్గొన్న వ్యవసాయ అధికారులు డ్రోన్‌లని రైతులకు తక్కువ ధరకు అందించాలని చర్చించారు. డ్రోన్‌లు మెరుగైన ఉత్పత్తికి సహాయపడుతాయని తెలిపారు. డ్రోన్‌లపై పాలసీ ఫ్రేమ్‌వర్క్ సిద్ధంగా ఉందని, వ్యవసాయ రంగంలో డ్రోన్‌లను ప్రోత్సహించేందుకు ఇదే సరైన సమయమని ఇండస్ట్రీ బాడీ క్రాప్‌లైఫ్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) అసితవ్ సేన్ పేర్కొన్నారు. డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ స్మిత్ షా మాట్లాడుతూ.. ఇది దేశీయ డ్రోన్ తయారీ పరిశ్రమ వృద్ధికి సహాయపడుతుందన్నారు. ఇంజిన్‌లు, బ్యాటరీలతో సహా డ్రోన్‌లోని ముఖ్యమైన భాగాలను ఎటువంటి పరిమితి లేకుండా దిగుమతి చేసుకోవచ్చన్నారు.
రైతులకు సహాయపడే లక్ష్యంతో పంట పొలాల్లో పురుగుల మందులు పిచికారీ చేసేందుకు మోడీ సర్కార్ కిసాన్ డ్రోన్ (Kisan Drones) కార్యక్రమం ప్రారంభించిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా పంట పొలాల్లో పురుగుల మందులు సులువుగా పిచికారీ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. రాబోయే రెండేళ్లలో గరుడ ఏరోస్పెస్ కింద లక్ష మేడ్ ఇన్ ఇండియా డ్రోన్లను తయారు చేయాలనే ప్రతిపాదన ఉంది. అంతేకాదు ఇది యువతకు కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించనుంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశ వ్యాప్తంగా రైతులకు డిజిటల్, హైటెక్ టెక్నాలజీని అందించడానికి కేంద్రం కిసాన్ డ్రోన్లు, రసాయన రహిత సహజ వ్యవసాయం, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుందని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతామాన్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా తెలిపారు.