Cricketers: ఇతర మతాల అమ్మాయిలను ప్రేమించి పెళ్లిచేసుకున్న భారత క్రికెటర్లు వీరే..!
Cricketers: భారత్‌లో క్రికెట్‌ని చాలామంది ఇష్టపడుతారు. ఇండియన్స్ క్రికెట్‌లో వివిధ రకాల మతాలకి చెందిన ఆటగాళ్లు ఉన్నారు. ఇందులో కొంతమంది వివిధ రకాల మతాలకి చెందిన
Cricketers: భారత్‌లో క్రికెట్‌ని చాలామంది ఇష్టపడుతారు. ఇండియన్స్ క్రికెట్‌లో వివిధ రకాల మతాలకి చెందిన ఆటగాళ్లు ఉన్నారు. ఇందులో కొంతమంది వివిధ రకాల మతాలకి చెందిన అమ్మాయిలను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అలాంటి క్రికెటర్ల గురించి తెలుసుకుందాం. అందులో ముఖ్యంగా చెప్పాలంటే భారత మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ గురించి చెప్పాలి. ఇతడు ఒక హిందూ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. జహీర్ ఖాన్ బాలీవుడ్ నటి సాగరిక ఘట్గేని 2017లో వివాహం చేసుకున్నాడు. సాగరిక ఘట్గే బాలీవుడ్ చిత్రం ‘చక్ దే ఇండియా’లో నటించింది. తర్వాత డాషింగ్ బ్యాట్స్‌మెన్ యువరాజ్ సింగ్ కూడా ఈ లిస్టులో చేరాడు. భారత క్రికెట్‌కు యువరాజ్ సింగ్ గొప్ప సేవలందించాడు. 2007 T20 ప్రపంచకప్, 2011 క్రికెట్ ప్రపంచకప్‌ను భారత్‌కు అందజేయడంలో యువరాజ్ సింగ్ ముఖ్యమైన పాత్ర పోషించాడు. యువరాజ్ సింగ్ మతానికి అతీతంగా ఎదిగాడు. సిక్కు మతానికి చెందిన వాడైనా క్రిస్టియన్ అమ్మాయి నటి హాజెల్ కీచ్‌ను వివాహం చేసుకున్నాడు.
2002లో ఇంగ్లండ్‌లో జరిగిన నాట్‌వెస్ట్ ట్రోఫీని భారత్ గెలుచుకోవడంలో మహమ్మద్ కైఫ్ కీలక పాత్ర పోషించాడు. కానీ మొహమ్మద్ కైఫ్ కెరీర్ ఎక్కువ కాలం కొనసాగలేదు. కానీ అతను ఒక హిందూ అమ్మాయిని ప్రేమించాడు. మహ్మద్ కైఫ్ 2011లో పూజా యాదవ్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. భారత క్రికెట్ చరిత్రలో మాజీ వెటరన్ కెప్టెన్ మన్సూర్ అలీఖాన్ పటౌడీ, బాలీవుడ్ నటి షర్మిలా ఠాగూర్‌ల జోడీ చాలా ప్రత్యేకమైనది. మన్సూర్ అలీ మతం ముసుగును విడదీసి హిందూ-బెంగాలీ అమ్మాయి షర్మిలా ఠాగూర్‌ను తన జీవిత భాగస్వామిగా చేసుకున్నాడు.
భారత క్రికెట్ జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ దినేష్ కార్తీక్‌కు తొలి పెళ్లితోనే ఎదురుదెబ్బ తగిలింది. తన మొదటి భార్య నికితా నుంచి విడాకులు తీసుకున్న తర్వాత క్రైస్తవ మతానికి చెందిన స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పల్లికల్‌ను పెళ్లి చేసుకున్నాడు. దినేష్ కార్తీక్, దీపికా పల్లికల్ 2015 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ మొదటి వివాహం నౌరీన్ అనే అమ్మాయిని చేసుకున్నప్పటికీ 1996 సంవత్సరంలో విడాకులు తీసుకున్నారు.
ఆ తర్వాత బాలీవుడ్ నటి సంగీతా బిజ్లానీని అజారుద్దీన్ రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే వీరి సంబంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. భారత క్రికెట్ మాజీ ఫాస్ట్ బౌలర్ అజిత్ అగార్కర్ మరాఠీ కుటుంబానికి చెందినవాడు. అయితే అతను ఒక ముస్లిం యువతితో ప్రేమలో పడ్డాడు. 2007లో మాజీ ఫాస్ట్ బౌలర్ అజిత్ అగార్కర్ తన స్నేహితుడి సోదరి ఫాతిమాను వివాహం చేసుకున్నాడు.