AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: బుడ్డోడు చాలా షార్ప్‌.. వాళ్ల అమ్మని ఇట్టే గుర్తుపట్టేశాడు.. భలే గమ్మత్తైన వీడియో..

Viral Video: సోషల్‌ మీడియాలో తరచుగా కొన్ని వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఈ వీడియోల్లో కొన్ని నవ్వుతూ, చక్కిలిగింతలు పెడితే మరికొన్ని చాలా క్యూట్‌గా ఉంటాయి.

Viral Video: బుడ్డోడు చాలా షార్ప్‌.. వాళ్ల అమ్మని ఇట్టే గుర్తుపట్టేశాడు.. భలే గమ్మత్తైన వీడియో..
Viral
uppula Raju
|

Updated on: Mar 10, 2022 | 8:12 PM

Share

Viral Video: సోషల్‌ మీడియాలో తరచుగా కొన్ని వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఈ వీడియోల్లో కొన్ని నవ్వుతూ, చక్కిలిగింతలు పెడితే మరికొన్ని చాలా క్యూట్‌గా ఉంటాయి. ప్రస్తుతానికి అలాంటి ఒక అందమైన వీడియో ఇంటర్నెట్ ప్రపంచంలో వైరల్ అవుతోంది. ఇది చూస్తే మీ ముఖంలో కూడా చిరునవ్వు వికసిస్తుంది. ఈ వీడియో ఒక తల్లి-కొడుకులకి సంబంధించినది. ఇందులో ఒక చిన్న పిల్లవాడు తన తల్లిని చాలామందిలో ఉన్నా గుర్తుపట్టేస్తాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో జనాల హృదయాలను కొల్లగొడుతోంది. ప్రజలు చాలా ఇష్టపడుతున్నారు. తల్లీ కొడుకుల క్యూటెస్ట్ వీడియో ఇదేనని యూజర్లు ప్రశంసిస్తున్నారు. వైరల్‌గా మారిన వీడియోలో పసుపు చీర కట్టుకున్న చాలా మంది మహిళలు ముసుగు కప్పుకొని ఒక గదిలో కూర్చోవడం చూడవచ్చు. అప్పుడే ఒక మహిళ చిన్న పిల్లవాడితో గదిలోకి ప్రవేశిస్తుంది. వాస్తవానికి ఈ చిన్నపిల్లవాడు తన తల్లికోసం ఈ గదికి వస్తాడు. కానీ వెంటనే అక్కడ చాలా మంది మహిళలను చూసేసరికి షాక్‌ అవుతాడు. మొదట తల్లి ఎవరో కనిపెట్టలేక కన్‌ఫ్యూజ్ అవుతాడు. కానీ తర్వాత జరిగింది చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. పిల్లవాడు తన తల్లిని ముసుగులో ఉన్నా కూడా గుర్తుపట్టి ఒడిలోకి చేరుకోవడం మనం గమనించవచ్చు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో అంతకంతకూ వైరల్ అవుతోంది.

తల్లీ కొడుకుల ఈ అందమైన వీడియో Instagramలో పోస్ట్ చేశారు. మూడు రోజుల క్రితం అప్‌లోడ్ చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇప్పటి వరకు 4 లక్షల 34 వేల మందికి పైగా లైక్ చేశారు. ఈ సంఖ్య నిరంతరం పెరుగుతోంది. చాలామంది తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. ఒక నెటిజన్‌ ఇప్పటివరకు తల్లీ కొడుకుల అందమైన వీడియో ఇదే అన్నాడు. మరొకరు తల్లి, కొడుకుల మధ్య అనుబంధం ఒకేలా ఉంటుందని చెప్పారు. ఓవరాల్‌గా ఈ వీడియో ప్రజల హృదయాలను గెలుచుకుంది. మీరు కూడా ఈ వీడియో చూస్తే మీ స్పందనని తెలియజేయండి.

View this post on Instagram

A post shared by SFT (@status.fan.tranding)

Womens World Cup 2022: పూజా వస్త్రాకర్ మెరుపు ఫీల్డింగ్.. షాక్ నుంచి తేరుకోని బ్యాట్స్‌మెన్..

Health Tips: గోళ్లు కొరికే అలవాటు మానుకోలేకపోతున్నారా.. ఇలా చేస్తే బెటర్..!

Spinalonga Island: ప్రపంచంలోనే ఇది అత్యంత నిర్జన ప్రదేశం.. కానీ ఒకప్పుడు కుష్టు రోగుల స్వర్గధామం..!