Health Tips: గోళ్లు కొరికే అలవాటు మానుకోలేకపోతున్నారా.. ఇలా చేస్తే బెటర్..!

Health Tips: కొంతమంది తరచూ గోళ్లు కొరుకుతుంటారు. ఒక్కోసారి వారికి తెలియకుండానే చేతివేళ్లు నోటి దగ్గరికి వెళుతుంటాయి. వాస్తవానికి గోళ్లు కొరికే అలవాటు సాధారణంగా

Health Tips: గోళ్లు కొరికే అలవాటు మానుకోలేకపోతున్నారా.. ఇలా చేస్తే బెటర్..!
Biting Nails
Follow us
uppula Raju

|

Updated on: Mar 10, 2022 | 1:36 PM

Health Tips: కొంతమంది తరచూ గోళ్లు కొరుకుతుంటారు. ఒక్కోసారి వారికి తెలియకుండానే చేతివేళ్లు నోటి దగ్గరికి వెళుతుంటాయి. వాస్తవానికి గోళ్లు కొరికే అలవాటు సాధారణంగా చిన్నతనం నుంచి మొదలవుతుంది. ఈ అలవాటు కొన్నిసార్లు ఆందోళన లేదా ఒత్తిడి వల్ల కూడా వస్తుంది. దీనిని విస్మరించకుంటే యుక్తవయస్సు నుంచి వృద్ధాప్యం వరకు కొనసాగుతుంది. అయితే ఏ వయసు వారైనా గోళ్లు కొరకడం అనేది చాలా చెడ్డ అలవాటు. అంతేకాదు ఆరోగ్యానికి హానికరం కూడా. మీ పళ్లతో తరచుగా గోళ్లను కొరికితే గోళ్ల చుట్టూ ఉన్న చర్మంలో నొప్పి వస్తుంది. గోళ్లు పెరిగే కణజాలం దెబ్బతింటుంది. గోళ్లు కొరికే అలవాటు వల్ల చేతుల మురికి పొట్ట లోపలికి వెళ్లి ఇన్ఫెక్షన్స్ బారిన పడే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ అలవాటును వదిలించుకోవడానికి ఇంట్లోనే పాటించే కొన్ని చిట్కాలు ఉన్నాయి. వీటిని పాటిస్తే ఈ అలవాటుని త్వరగా మానుకోవచ్చు.

1) మీ గోళ్లను చిన్నగా కట్ చేయండి. గోళ్లు పొట్టిగా ఉంటే నోటికి అందకుండా ఉంటాయి. అయితే గోర్లు త్వరగా పెరుగుతాయి. కాబట్టి తరచుగా కట్ చేస్తూ ఉండాలి. ఇలా చేస్తే గోళ్లు కొరకడంపై ధ్యాస ఉండదు.

2) గోళ్లు కొరికే అలవాటును నివారించడానికి గోళ్లపై నెయిల్‌పెయింట్‌ను వేయవచ్చు. అప్పుడు మీరు గోళ్లని కొరికినప్పుడు దాని చెడు రుచి మిమ్మల్ని అలా చేయకుండా ఆపుతుంది.

3) గోళ్లు కొరకకుండా ఉండాలంటే కొన్ని రోజులు చేతి రుమాలుని వేళ్లకి చుట్టండి. అప్పుడు మీరు ఈ అలవాటు గురించి మరిచిపోయి వేరే పనిమీదకి ధ్యాస మళ్లిస్తారు.

4. అన్నింటికంటే ముఖ్యం గోళ్లు కొరకడం చాలా చెడ్డ అలవాటు. అందరి ముందు చాలా అసహ్యంగా ఉంటుంది. అందుకే మీరు మీ మనస్సుని మళ్లించండి. తద్వారా కొద్దిరోజుల్లోనే గోళ్లు కొరకడం మానేస్తారు.

గమనిక : అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.

Womens World Cup 2022: పూజా వస్త్రాకర్ మెరుపు ఫీల్డింగ్.. షాక్ నుంచి తేరుకోని బ్యాట్స్‌మెన్..

Yogi Adityanath: రెండో సారి సీఎం కాబోతున్న యోగి.. ఆయన లెక్కలు ఎప్పుడు తప్పలేదు..!

Sreesanth: బౌన్సర్ నుంచి డ్యాన్సర్ వరకు శ్రీశాంత్ కెరీర్‌లో అన్ని వివాదాలే..!

ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?