- Telugu News Photo Gallery Political photos Yogi adityanath student life interested in mathematics before politics
Yogi Adityanath: రెండో సారి సీఎం కాబోతున్న యోగి.. ఆయన లెక్కలు ఎప్పుడు తప్పలేదు..!
Yogi Adityanath: ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ విధానసభ ఎన్నికల ఫలితాల కోసం దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇప్పుడు అందరి దృష్టి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌పైనే ఉంది. ఆయన లెక్కలు ఎప్పుడు అంచనా తప్పలేదు.
Updated on: Mar 10, 2022 | 12:02 PM

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. యోగి ఆదిత్యానాథ్ మళ్లీ ఆ రాష్ట్ర సీఎం కాబోతున్నారు. ఆయన లెక్కలు ఎప్పుడు అంచనా తప్పలేదు. విద్యార్థి దశ నుంచే ఆయనకి గణితంపై పట్టు ఉండేది. అంతేకాదు యోగి గోరఖ్‌పూర్‌లోని ప్రసిద్ధ గోరఖ్‌నాథ్ ఆలయానికి అధ్యక్షుడు. చాలా మంచి వక్త. తన ప్రసంగంతో ఎవరినైనా ఆకట్టుకునే సత్తా కలవాడు. చాలా చిన్న వయస్సులోనే సామాజిక సేవ వైపునకు నడిచాడు. ఆయన విద్యార్థి జీవితం ఎలా ఉండేదో తెలుసుకుందాం.

యోగి ఆదిత్యనాథ్ 5 జూన్ 1972న ఉత్తరాఖండ్‌లోని పౌరీ గర్వాల్ జిల్లాలోని యమకేశ్వర్ తహసీల్‌లోని పంచూర్ గ్రామంలో జన్మించారు. అప్పట్లో ఆ భాగం ఉత్తరప్రదేశ్‌లో మాత్రమే ఉండేది. యోగి ఆదిత్యనాథ్ గర్వాలీ రాజపుత్రుడు. అతని తండ్రి పేరు ఆనంద్ సింగ్ బిష్త్. తల్లి పేరు సావిత్రి దేవి. యోగి ఆదిత్యనాథ్ అసలు పేరు అజయ్ సింగ్ బిష్త్.

యోగి తన విద్యను 1977లో తెహ్రీ గద్వాల్‌లోని గజానీ స్కూల్ నుంచి ప్రారంభించారు. ఆయన 1989లో రిషికేశ్‌లోని భారత్ మందిర్ ఇంటర్ కాలేజ్ నుంచి 12వ తరగతి ఉత్తీర్ణత సాధించారు. 1992లో హేమవతి నందన్ బహుగుణ గద్వాల్ విశ్వవిద్యాలయం నుంచి గణితశాస్త్రంలో B.Sc చేశారు.

యోగి1993లో గోరఖ్‌పూర్‌కు వచ్చారు. ఇక్కడ గోరఖ్‌నాథ్ ఆలయానికి చెందిన మహంత్ అవిధానత్‌జీని కలిశారు. యోగీజీ అవిధానత్‌జీ నుంచి దీక్షను స్వీకరించి 1994లో సాధువుగా మారారు. దీని కారణంగా అతని పేరు అజయ్ సింగ్ బిష్త్ నుంచి యోగి ఆదిత్యనాథ్‌గా మారింది.

1998లో యోగి తొలిసారిగా భారతీయ జనతా పార్టీ టికెట్‌పై గోరఖ్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 26 ఏళ్ల వయసులో 12వ లోక్‌సభ ఎన్నికల్లో అతి పిన్న వయస్కుడైన ఎంపీగా నిలిచారు.1999 లోక్‌సభ ఎన్నికల్లో తిరిగి ఎంపీగా ఎన్నికయ్యారు.

యోగి ఆదిత్యనాథ్ హిందూ యువ వాహిని వ్యవస్థాపకుడు కూడా. ఇది హిందూ యువకుల సామాజిక, సాంస్కృతిక, జాతీయవాద సమూహం. 19 మార్చి 2017న అతను ఉత్తరప్రదేశ్ 21వ ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు రెండోసారి సీఎం కాబోతున్నారు.



