- Telugu News Photo Gallery Political photos Comedian becomes Chief Minister Know Interesting facts about Bhagwant Bhagwant Mann new Chief Minister of Punjab photos
కమెడియన్ బన్‌గయా సీఎం.. పంజాబ్ కాబోయే ముఖ్యమంత్రి భగవంత్ గురించి ఆసక్తికర విషయాలు
కమెడియన్ బన్‌గయా CM. నవ్విస్తూ కెరీర్ మొదలుపెట్టిన స్టేజ్ పెర్‌ఫార్మర్- పొలిటికల్ స్టేజ్ మీదకు చీపురు పట్టుకుని దూసుకువచ్చారు భగవంత్ మాన్.
Updated on: Mar 10, 2022 | 3:48 PM

కమెడియన్ బన్‌గయా CM. నవ్విస్తూ కెరీర్ మొదలుపెట్టిన స్టేజ్ పెర్‌ఫార్మర్- పొలిటికల్ స్టేజ్ మీదకు చీపురు పట్టుకుని దూసుకువచ్చారు భగవంత్ మాన్.

పంజాబ్‌లో అకాలీలను, బీజేపీని, కాంగ్రెస్‌ను ఊడ్చిపడేసిన ఆమ్‌ఆద్మీలో ముందునిలబడిన వ్యక్తి భగవంత్ మాన్. ఎల్లో టర్బన్ కట్టుకుని లోక్‌సభలో పంజాబ్ వాణి బలంగా వినిపించిన కేజ్రీవాల్ నమ్మినబంటు ఈయన.

మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన భగవంత్ మాన్- ఇవాళ్టి విజయోత్సవ ర్యాలీలో తన తల్లితో కలసి ఎమోషనల్‌గా కనిపించడం ఆయన నేపథ్యాన్ని చాటిచెబుతోంది.

సంప్రదాయ రాజకీయ నాయకులకు భిన్నంగా సామాన్యుల పార్టీ నుంచి వచ్చి సైలెంట్‌గా CM అవుతున్న భగవంత్ మాన్- పంజాబ్ ప్రజల సమ్మాన్ కోసం పనిచేస్తామంటున్నారు.

రాజకీయాల్లోకి రాకముందు భగవంత్ మాన్ ఒకప్పుడు కమెడియన్. ఒక టీవీ ఛానెల్ షోలో భగవంత్ మాన్ స్టేజీ జోకులు చెబుతుంటే, నవజ్యోత్ సిద్ధూ పగలబడి నవ్వి మార్కులు వేశారు.

ఇప్పుడు పంజాబ్ ప్రజలు కూడా భగవంత్ మాన్‌కు, ఆయన పార్టీ ఆమ్‌ఆద్మీకి అదేవిధంగా మార్కులు వేశారు. ఈ ఎన్నికల్లో సిద్ధూ, ఆయన పార్టీ ఓడిపోతే, భగవంత్ మాన్, ఆయన పార్టీ- ధమాకా విజయం సాధించారు.

48 ఏళ్ల భగవంత్ మాన్- పంజాబ్‌లోని సంగ్రూర్ జిల్లా సతోజ్‌లో పుట్టారు. కాలేజీ రోజుల నుంచి యూత్ కామెడీ ఫెస్టివల్స్‌లో పాల్గొనేవాడు. జుగ్నూ ఖేండా హైతో మొదలుపెట్టి- జుగ్నూ మస్త్ మస్త్ వంటి షోలతో పేరుతెచ్చుకున్నారు.

ఇక స్టార్‌ప్లస్‌లో వచ్చిన "గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్"తో ఒక వెలుగు వెలిగారు.2014లో ఆమ్‌ఆద్మీలో చేరడం భగవంత్ మాన్ కెరీర్‌లో మరో మలుపు. అప్పటినుంచి రెండుసార్లు సంగ్రూర్ నుంచి గెలిచి, లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

ఆయన మందుకొట్టి రావడం వివాదాదస్పదమైంది. దీంతో తాను ఇక మద్యం తాగనంటూ కేజ్రీవాల్ సమక్షంలో ప్రతిజ్ఞ చేశారు.భగవంత్ మాన్‌ను ఈసారి ప్రజల ఓటింగ్ ద్వారా CM అభ్యర్థిగా ఆమ్‌ఆద్మీ అధినేత కేజ్రీవాల్ ప్రకటించడం కీలకంగా మారింది.

కాంగ్రెస్, బీజేపీలకన్నా భిన్నంగా ప్రజల్లోకి వెళ్లడం, అవినీతి మరక లేకపోవడం ఆమ్‌ఆద్మీకి కలసి వచ్చింది. ఢిల్లీ తరహాలో నిజాయితీ పాలన అందిస్తామన్న కేజ్రీవాల్ భరోసాకు భగవంత్ మాన్ ఒక ప్రతిరూపంగా నిలిచారు.

తన తొలి ప్రయారిటీ ఉద్యోగాలే అంటున్నారు భగవంత్ మాన్. తాను పంజాబీలందరికీ ముఖ్యమంత్రిగా సేవలు అందిస్తానని హామీ ఇస్తున్నారు. ఏళ్లతరబడి పాతుకుపోయిన పెద్దపార్టీలకు భిన్నంగా పంజాబ్‌లో సరికొత్త పాలన అందించడం ఇప్పుడు భగవంత్ మాన్ చేతుల్లో ఉంది.

పంజాబ్ కింగ్, జుగ్నూ వంటి పేర్లతో పంజాబీలకు పరిచయమైన ఈ నాయకుడు- ఇప్పుడు తన మార్క్‌ను కొత్త పేరును తెచ్చుకుంటాడని ఆమ్‌ఆద్మీ ఆశిస్తోంది.




