Womens World Cup 2022: పూజా వస్త్రాకర్ మెరుపు ఫీల్డింగ్.. షాక్ నుంచి తేరుకోని బ్యాట్స్‌మెన్..
Womens World Cup 2022: ఐసిసి మహిళల ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఇబ్బందుల్లో పడింది. అప్పుడు పూజా వస్త్రాకర్ హాఫ్ సెంచరీతో అదరగొట్టింది.
Womens World Cup 2022: ఐసిసి మహిళల ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఇబ్బందుల్లో పడింది. అప్పుడు పూజా వస్త్రాకర్ హాఫ్ సెంచరీతో అదరగొట్టింది. తర్వాత ఇప్పుడు న్యూజిలాండ్‌పై మరోసారి తళుక్కుమంది. ఇప్పుడు ఆమె బౌలింగ్ చేయలేదు.. క్యాచ్ పట్టలేదు కానీ భారీ వికెట్ సాధించింది. మెరుపు ఫీల్డింగ్‌తో న్యూజిలాండ్ ఓపెనర్ సుజీ బేట్స్‌ను రనౌట్ చేసింది. కొద్దిసేపు సుజీబేట్స్‌కి ఏం జరిగిందో కూడా అర్థం కాకుండా చేసింది. వాస్తవానికి బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో సుజీ బేట్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచింది. మంచి ఫామ్‌లో ఉంది. కానీ ఆరంభంలోనే పూజా ఆమెని పెవిలియన్ పంపించడం విశేషం. న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సుజీ బేట్స్, సోఫియా డివైన్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించేందుకు వచ్చారు. మ్యాచ్ మూడో ఓవర్లో సుజీ బేట్స్‌ను రనౌట్ చేయడం ద్వారా పూజా భారత్‌కు తొలి విజయాన్ని అందించింది. ఈ ఓవర్‌లో ఝులన్ గోస్వామి బౌలింగ్ చేస్తోంది. సుజీ బేట్స్ కేవలం 5 పరుగులు మాత్రమే చేసింది. బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో సుజీ బేట్స్ అజేయంగా 79 పరుగులు చేసింది. చివరి వరకు క్రీజులో ఉండి జట్టుని విజయతీరాలకు చేర్చింది. ఆమె భారత్‌పై కూడా మంచి ఫామ్‌లో ఉంది. ఇలాంటి పరిస్థితిలో ఆమె ముందుగానే ఔటవ్వడం చాలా మంచిది. టీమ్ అవసరాలకి అనుగుణంగా పూజా వస్త్రాకర్ తన పాత్రను చక్కగా పోషించింది.
సుజీ బేట్స్ ఔటైనా న్యూజిలాండ్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 260 రన్స్ సాధించింది. భారత్ ముందు 262 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. కివీస్ బ్యాటర్లు అమీ సత్తర్‌వైట్ (75), అమెలియా కెర్ (50) హాఫ్ సెంచరీలు చేయగా.. కెటీ మార్టిన్(41), సోఫీ డివైన్(35) రాణించారు. భారత బౌలర్లలో పూజా వస్త్రాకర్ 4 వికెట్లు తీయగా.. రాజేశ్వరి గైక్వాడ్ 2, ఝులన్ గోస్వామి ఓ వికెట్ తీశారు.
Move away everyone.#TeamIndia have the first wicket Suzie bates is run out with a brilliant direct hit from Pooja Vastrakar.#CWC22 #NZvIND #CricketTwitter #Cricket pic.twitter.com/vC7fmvsG7j
— Asli BCCI Women (@AsliBCCIWomen) March 10, 2022