Women’s World Cup: దుమ్మురేపిన న్యూజిలాండ్ అమ్మాయిలు.. భారత జట్టుపై ఘన విజయం..
Women's World Cup: ఐసీసీ మహిళా వన్డే వరల్డ్‌కప్ - 2022 (ICC Women ODI World Cup)లో న్యూజిలాండ్ అమ్మాయిలు విజయ పరంపరను కొనసాగిస్తున్నారు. సోమవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయాన్ని అందుకున్న న్యూజిలాండ్ మహిళా జట్టు, తాజాగా గురువారం (నేడు) భారత్‌తో...
Women’s World Cup: ఐసీసీ మహిళా వన్డే వరల్డ్‌కప్ – 2022 (ICC Women ODI World Cup)లో న్యూజిలాండ్ అమ్మాయిలు విజయ పరంపరను కొనసాగిస్తున్నారు. సోమవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయాన్ని అందుకున్న న్యూజిలాండ్ మహిళా జట్టు, తాజాగా గురువారం (నేడు) భారత్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ (India Women Vs New Zealand Women) విజయాన్ని దక్కించుకుంది. న్యూజిలాండ్‌లోని సెడాన్ పార్కు వేదికగా జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 62 పరుగల తేడాతో గెలిచింది.
టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ తొలుత తడబడినా తర్వాత అమీలియా కెర్ (50), అమీ సాటర్తవైట్ (75), మార్టిన్ (41) పరుగులతో రాణించడంతో న్యూజిలాండ్ స్కోర్ భారీగా పెరిగింది. దీంతో నీర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. ఇక టీమిండియా బౌలర్ట విషయానికొస్తే పూజా 34 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసుకోగా, రాజేశ్వరి జైక్వాండ్ రెండు వికెట్లు, జుల్హాన్ గోస్వామీ ఒక వికెట్ తీసుకుంది.
న్యూజిలాండ్ ఇచ్చిన 261 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురు దెబ్బలు తగిలాయి. హర్మన్ ప్రీత్ కౌర్ (71), మిథాలీ రాజ్ (31), యస్తికా భాటియా (28) తప్ప మిగతా ఎవరూ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. దీంతో టీమిండియా ఓటమి చవి చూడాల్సి వచ్చింది.
Also Read: Viral Photo: ఈ ఫోటోలో వివిధ జంతువులు ఉన్నాయి.. ఒంటె ఎక్కడుందో వెంటనే చెప్పేస్తే మీరు గ్రేట్ అబ్బా…
Akshay Kumar: ఫైటింగ్‌లో ఇరగదీస్తాడు.. కామెడీతో నవ్విస్తాడు.. వైరల్ అవుతున్న అక్షయ్ స్టిల్స్…
AP Inter exams 2022: ఇంటర్ ప్రాక్టికల్స్‌పై ఇచ్చిన ఆ ఉత్తర్వులను కొట్టేసిన ఏపీ హైకోర్టు!