AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Inter exams 2022: ఇంటర్ ప్రాక్టికల్స్‌పై ఇచ్చిన ఆ ఉత్తర్వులను కొట్టేసిన ఏపీ హైకోర్టు!

రేపటి నుంచి (మార్చి 11) నుంచి ప్రారంభంకానున్న ఆంధ్రప్రదేశ్ 2021-22 ఇంటర్మీడియట్ సెకండియర్‌ ప్రాక్టికల్ పరీక్షల (AP Inter Practical exam dates)కు సంబంధించి ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది..

AP Inter exams 2022: ఇంటర్ ప్రాక్టికల్స్‌పై ఇచ్చిన ఆ ఉత్తర్వులను కొట్టేసిన ఏపీ హైకోర్టు!
Inter Exams
Srilakshmi C
|

Updated on: Mar 10, 2022 | 12:52 PM

Share

AP High Court struck down orders to conduct intermediate practical exams under jumbling system: రేపటి నుంచి (మార్చి 11) నుంచి ప్రారంభంకానున్న ఆంధ్రప్రదేశ్ 2021-22 ఇంటర్మీడియట్ సెకండియర్‌ ప్రాక్టికల్ పరీక్షల (AP Inter Practical exam dates)కు సంబంధించి ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ఇంటర్‌ బోర్డు జంబ్లింగ్ విధానంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించాలని ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు నేడు (మార్చి 10) కొట్టేసింది. ఈ ఏడాది జరిగే ఇంటర్‌ ప్రాక్టికల్ పరీక్షలు గతంలో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం నిర్వహించాలని, ఏ కాలేజీ విద్యార్ధులకు ఆ కాలేజీలోనే ప్రాక్టికల్స్‌ నిర్వహించాలని హైకోర్టు ఇంటర్‌ బోర్డును ఆదేశించింది. ఇక ప్రాక్టికల్స్‌ కు సంబంధించిన హాల్ టికెట్లు ఇప్పటికే విడుదలయ్యాయి. ప్రాక్టికల్ పరీక్షలు మార్చి 11 నుంచి 31 వరకు జరగనున్నాయి. కాగా ఇంటర్‌ థియరీ పబ్లిక్‌ పరీక్షలు ఏప్రిల్ 22 నుంచి మే 12వ తేదీ వరకూ జరగనున్నాయి. ఫస్టియర్ పరీక్షలు ఏప్రిల్ 22, 25, 27, 29, మే 2, 6, 9, 11 తేదీల్లో జరగనుండగా.. సెకండియర్ పరీక్షలు ఏప్రిల్ 23, 26, 28, 30, మే 05, 07, 10, 12 తేదీల్లో నిర్వహించనున్నారు. ఏప్రిల్ 7 నుంచి ప్రారంభం కావల్సిన ఈ పరీక్షలు..జేఈఈ మెయిన్స్ (JEE mains)పరీక్ష తేదీల కారణంగా వాయిదా పడ్డాయి. నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా ప్రాక్టికల్‌ పరీక్షలు పూర్తి అయిన తర్వాత థియరీ పరీక్షలు ప్రారంభం అవుతాయి. ఇంటర్మీడియట్ విద్యార్ధుల రోల్ నెంబర్‌ లేదా ఆధార్ కార్డు నెంబర్‌తో కూడా హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాగా ఏప్రిల్ 22 నుంచి మే 12 వరకు జరిగే థియరీ పరీక్షలకు హాల్ టికెట్లు వేరుగా ఉంటాయి. అవి త్వరలో విడుదల కానున్నట్లు ఏపీ ఇంటర్‌ బోర్డు విద్యార్ధులకు సూచించింది.

Also Read:

AP Gov jobs 2022: ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా 66,309 ప్రభుత్వ ఉద్యోగాలు.. త్వరలోనే..