- Telugu News Photo Gallery How did the name plastic surgery come about do you know the history behind it
Knowledge: ప్లాస్టిక్ సర్జరీ అనే పేరు ఎలా వచ్చింది.. దాని వెనకున్న చరిత్ర ఏంటో తెలుసా..?
Knowledge Photos: ప్లాస్టిక్ సర్జరీ పేరు వినే ఉంటారు కానీ సర్జరీ సమయంలో ప్లాస్టిక్ వినియోగించరు. వాస్తవానికి ఇది బ్రెస్ట్ ఇంప్లాంట్స్‌తో సంబంధం కలిగి ఉంది.
Updated on: Mar 10, 2022 | 10:59 AM

ప్లాస్టిక్ సర్జరీ పేరు వినే ఉంటారు కానీ సర్జరీ సమయంలో ప్లాస్టిక్ వినియోగించరు. వాస్తవానికి ఇది బ్రెస్ట్ ఇంప్లాంట్స్‌తో సంబంధం కలిగి ఉంది. 'ప్లాస్టిక్ సర్జరీ' అనే పదాన్ని మొదటిసారిగా 1837లో ది లాన్సెట్ అనే మెడికల్ జర్నల్‌లో ఉపయోగించారు.

మెంటల్ ఫ్లోస్ నివేదికలో ఒహియోకు చెందిన ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ బ్రియాన్ డోర్నర్ మాట్లాడుతూ.. బ్రెస్ట్ ఇంప్లాంట్ అనే సర్జరీలో ప్లాస్టిక్ వాడుతారు. కానీ అన్ని సర్జీరీలలో ప్లాస్టిక్ వాడరు. అయితే ఈ ఒక్క సర్జరీ వల్ల అందరు దీనిని ప్లాస్టిక్ సర్జరీ అని పిలుస్తున్నారు. కానీ దీనికి అసలు కారణం వేరే ఉంది.

నిజానికి బ్రెస్ట్ ఇంప్లాంట్లు సిలికాన్ షెల్స్‌తో తయారు చేస్తారు. ఇవి సిలికాన్ జెల్‌తో నిండి ఉంటాయి. కానీ సిలికాన్ కూడా ఒక రకమైన ప్లాస్టిక్. రబ్బరు, ప్లాస్టిక్ కలపడం ద్వారా సిలికాన్ తయారు చేస్తారు.

ప్లాస్టిక్ లాటిన్ పదం ప్లాస్టికస్ నుంచి ఉద్భవించిందని చెబుతారు. అంటే శరీరానికి సరిపోయేలా ఏదైనా పరిమాణాన్ని మార్చడం అని అర్థం. 17వ శతాబ్దంలో ఈ పదాన్ని ఎక్కువగా ఉపయోగించడం ప్రారంభించారు.

ప్లాస్టిక్ సర్జరీ ద్వారా శరీర భాగాలని కావలసిన రీతిలో మార్చుకోవచ్చు. అయితే ఇటీవల ప్లాస్టిక్ సర్జరీ చేయించుకునే వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది. ఆశ్చర్యకరంగా ఇందులో పురుషులు కూడా ఎక్కువే ఉన్నారు.



