Maruti Holi Offers 2022: కారు కొనుగోలుదార్లకు బంపరాఫర్! మారుతీ కార్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటన..
Maruti Suzuki offers biggest discounts on this Holi 2022: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకీ ఇండియా తాజాగా తన కార్లపై హోళీ పండుగ సందర్భంగా అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది.
Updated on: Mar 10, 2022 | 10:21 AM

Maruti Suzuki offers biggest discounts on this Holi 2022: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకీ ఇండియా తాజాగా తన కార్లపై హోళీ పండుగ సందర్భంగా అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. కొత్తగా కారు కొనుగోలు చేసేవారికి భారీ తగ్గింపులతో మారుతీ బ్రాండ్ కార్లను అందిస్తోంది. ఆ వివరాలు మీకోసం..

మారుతి నెక్సా రేంజ్‌పై రూ. 10,000 ఎక్స్చేంజ్ బోనస్‌తోపాటు రూ. 2,000 కార్పొరేట్ బోనస్‌తో మారుతి ఇగ్నిని అందించడానికి ముందుకొస్తోంది. అంతేకాదు కారు మాన్యువల్ వేరియంట్‌పై రూ.20,000 తగ్గింపు కూడా ఇస్తుంది. ఐతే ఏఎమ్‌టీ వేరియంట్‌పై మాత్రం ఎటువంటి తగ్గింపులు లేవు.

ఇక మారుతి సియాజ్‌పై ఏకంగా రూ. 10,000 (మాన్యువల్ వేరియంట్‌పై)ల తగ్గింపును ప్రకటించింది. సెడాన్‌కు సంబంధించిన అన్ని వేరియంట్లపై రూ. 25,000 ఎక్స్చేంజ్ బోనస్, అలాగే రూ. 5,000 కార్పొరేట్ డిస్కౌంట్‌ను ప్రకటించింది.

మారుతి సుజుకి ఎస్-క్రాస్ లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ మోడల్ కారు రూ. 15,000 (సిగ్మా, డెల్టా, ఆల్ఫా ట్రిమ్‌లపై)ల తగ్గింపుతో అందుబాటులో ఉంది. జీటా ట్రిమ్‌పై రూ. 20,000ల క్యాష్ డిస్కౌంట్ ప్రకటించింది. అన్ని ట్రిమ్ స్థాయిల్లో ఎస్‌యూవీపై రూ. 25,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 5,000 కార్పొరేట్ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది.

మారుతి బాలెనో ఫేస్‌లిఫ్ట్‌పై మాత్రం ప్రస్తుతం ఎటువంటి డిస్కౌంట్లు లేవు. అప్‌డేట్ వర్షన్‌లో ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ మోడల్ కారు ఇటీవలే మార్కెట్లోకొచ్చింది. పాత మోడల్‌కు సంబంధించిన స్టాక్ ఉన్నట్లైతే, వీటికి డీలర్ లెవెల్ డిస్కౌంట్ ఉంటుంది. అలాగే XL6పై కూడా ఎలాంటి డిస్కౌంట్లు అందుబాటులో లేవు.

మారుతి నెక్సా లైనప్ కొన్ని కొత్త మార్పులతో త్వరలో మార్కెట్లోకిరానుంది. ఇండియన్ మార్కెట్లో ఓల్డ్ ఎస్-క్రాస్ మోడల్ స్థానంలో న్యూ మిడ్-సైజ్ ఎస్‌యూవీని విడుదల చేయడానికి మారుతి సుజుకీ ప్రస్తుతం ప్లాన్ చేస్తోంది.




