Spinalonga Island: ప్రపంచంలోనే ఇది అత్యంత నిర్జన ప్రదేశం.. కానీ ఒకప్పుడు కుష్టు రోగుల స్వర్గధామం..!
Spinalonga Island: చాలామంది కుష్టు వ్యాధి అనేది దేవుడు ఇచ్చిన శాపంగా భావిస్తారు. శతాబ్దాలుగా కుష్టు రోగులను సమాజం నుంచి వేరుచేసే ఆచారం ఉంది. నేటికీ చాలా
Spinalonga Island: చాలామంది కుష్టు వ్యాధి అనేది దేవుడు ఇచ్చిన శాపంగా భావిస్తారు. శతాబ్దాలుగా కుష్టు రోగులను సమాజం నుంచి వేరుచేసే ఆచారం ఉంది. నేటికీ చాలా మంది కుష్టు రోగులు దేశంలో ఆశ్రమాలను నిర్వహిస్తున్నారు. భారతదేశంలోనే కాదు అనేక పాశ్చాత్య దేశాలలో కూడా కుష్టు రోగుల పరిస్థితి దారుణంగా ఉంది. అయితే యూరోపియన్ దేశం గ్రీస్‌లో కుష్టు రోగుల కోసం ఒక ద్వీపాన్నే కేటాయించారు. అవును మీరు విన్నది నిజమే.. మీకు స్పినాలోంగా అనే ద్వీపం గురించి తెలియదు. ఇది గ్రీస్‌లోనే అతిపెద్ద ద్వీపం. క్రీట్ సమీపంలో గల్ఫ్ ఆఫ్ మిరాబెల్లో ముఖద్వారం వద్ద మధ్యధరా సముద్రం దగ్గరలో ఉంటుంది. నేటికి స్పినాలోంగా ద్వీపంలో ఎవరూ నివసించడం లేదు. చాలా తక్కువ మంది మాత్రమే అక్కడికి వచ్చి వెళ్తుంటారు. ఈ ద్వీపం ప్లాకా క్రీట్ గ్రామం నుంచి కొంచెం దూరంలో ఉంటుంది. కానీ ప్రజలెవ్వరు ఇక్కడికి వెళ్లరు.
ఈ ప్రదేశాన్ని వెనిస్ రాజు మొదటిసారిగా ఇక్కడ సైనిక స్థావరంగా మార్చాడు. తరువాత టర్కీ ఒట్టోమన్ సామ్రాజ్యం ఇక్కడ కోటలను నిర్మించింది. అయితే1904 సంవత్సరంలో క్రీట్ నివాసులు టర్క్‌లను తమ దేశం నుంచి తరిమికొట్టారు. ఆ తర్వాత స్పినాలోంగా కుష్టు రోగులకు స్వర్గధామంగా మారింది.1957 వరకు ఈ కుష్టు రోగుల కేంద్రంగా కొనసాగింది.1957లో ఒక బ్రిటీష్ నిపుణుడు ఇక్కడి పరిస్థితిని చూసి ప్రపంచానికి చెప్పాడు.
ఆ తర్వాత ఇక్కడున్న వారందరినీ చికిత్స కోసం తీసుకెళ్లి కుష్ఠువ్యాధి ఆశ్రమాన్ని మూసివేశారు. కుష్టు వ్యాధిగ్రస్తులు ఇక్కడి నుంచి వెళ్లిపోవడంతో స్పినాలోంగా ద్వీపం నిర్మానుష్యంగా మారింది. ఇప్పుడు ఇక్కడ ఎవరూ నివసించడం లేదు. స్పినాలోంగా ద్వీపంలో కుష్టు రోగుల చికిత్సకు ఎలాంటి ఏర్పాట్లు ఉండేవి కావు. ఈ వ్యాధికి 1904 సంవత్సరంలో చికిత్స కనుగొన్నప్పటికీ గ్రీకు ప్రభుత్వం స్పినాలోంగాలో నివసించే ప్రజలకు చికిత్స చేయడానికి ప్రయత్నించలేదు.