ఈ జీవులు కళ్లు తెరిచే నిద్రపోతాయా.. శాస్త్రవేత్తల అధ్యయనంలో షాకింగ్‌ విషయాలు..

Sharks Sleep: షార్క్‌లు కళ్లు తెరిచి నిద్రపోతాయా అనేదానిపై చాలా మంది శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తున్నారు. ఇతర క్షీరదాల మాదిరిగానే సొరచేపలు నిద్రపోవని శాస్త్రవేత్తలకు

ఈ జీవులు కళ్లు తెరిచే నిద్రపోతాయా.. శాస్త్రవేత్తల అధ్యయనంలో షాకింగ్‌ విషయాలు..
Sharks Sleep
uppula Raju

|

Mar 11, 2022 | 8:42 AM

Sharks Sleep: షార్క్‌లు కళ్లు తెరిచి నిద్రపోతాయా అనేదానిపై చాలా మంది శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తున్నారు. ఇతర క్షీరదాల మాదిరిగానే సొరచేపలు నిద్రపోవని శాస్త్రవేత్తలకు ముందే తెలుసు. కానీ కొన్నిసార్లు అవి రెండు కళ్ళు తెరిచి నిద్రపోతాయని కనుగొన్నారు. మెల్‌బోర్న్‌లోని లా ట్రోబ్ విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్, న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ విశ్వవిద్యాలయంలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెరైన్ సైన్సెస్ సంయుక్తంగా జరిపిన ఒక అధ్యయనంలో సొరచేపల నిద్ర విధానాలు ఇతర క్షీరదాల కంటే గణనీయంగా భిన్నంగా ఉన్నాయని తెలుసుకున్నారు. కొన్ని రకాల సొరచేపలు నిద్రలో కూడా నిరంతరం ఈత కొడుతాయి. అయితే అది విశ్రాంతి తీసుకుంటుందా లేదా నిద్రపోతుందా అనేది తెలుసుకోవడం కష్టమని చెబుతున్నారు. అధ్యయనం సమయంలో ఈశాన్య న్యూజిలాండ్‌లోని హౌరాకి గల్ఫ్ నుంచి ఏడు డ్రాఫ్ట్‌బోర్డ్ సొరచేపలు తీసుకువచ్చారు. బహిరంగ అక్వేరియంలో ఉంచిన తర్వాత వాటిని నిశితంగా పరిశీలించి కెమెరాలో రికార్డ్ చేశారు.

ఈత కొడుతూ విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు షార్క్ కళ్లు ఎప్పుడూ తెరిచి ఉండటాన్ని బృందం గమనించింది. కొన్ని సొరచేపలు ఐదు నిమిషాల కంటే ఎక్కువసేపు కళ్ళు మూసుకుని క్రియారహితంగా ఉన్నాయని గమనించారు. అయితే ఇది నిద్రను సూచిస్తుందని తెలిపారు. అయినప్పటికీ వాటి కళ్ళు దాదాపు 38 శాతం వరకు తెరుచుకునే ఉంటాయన్నారు. నిద్రలో కళ్ళు మూసుకోవడం పగటిపూట చాలా సాధారణమని శాస్త్రవేత్తలు గుర్తించారు.

వాస్తవానికి చేపలకు కనురెప్పలు ఉండవు కాబట్టి అవి ఎప్పుడు చూసినా కళ్లు తెరిచే ఉన్నట్టు కనిపిస్తాయి. అయితే అవి కూడా ఎంతో కొంత సేపు నిద్రపోతాయి. కొన్ని చేపలు పగటివేళ నిద్రిస్తే మరికొన్ని రాత్రివేళల్లో నిద్రిస్తాయి. నిద్రపోయే సమయం రాగానే సముద్రంలో ఉండే చేపలు నీటిలోతుల్లో ఉండే గుహల్లోకి, పగడపు లోయల్లోకీ వెళ్లి బంకమన్నులాంటి పదార్థాన్ని పూతగా తమ దేహాలపై ఏర్పాటుచేసుకుని తమ ఉనికిని ఇతర ప్రాణులు కనిపెట్టకుండా జాగ్రత్తగా నిద్రపోతాయి. చేపలు నిద్రించేపుడు వాటి జీవ ప్రక్రియలు కొంతమేర నెమ్మదించడంతో అవి అంత చురుగ్గా ఉండవు. అంతే కానీ అవి తమ స్పృహను పూర్తిగా కోల్పోవు. నిద్రించే చేపలపై పరిశోధనల మూలంగా తేలిందేమంటే అవి నిద్రలో కూడా ఈదుతూనే ఉంటాయి.

Cricketers: ఇతర మతాల అమ్మాయిలను ప్రేమించి పెళ్లిచేసుకున్న భారత క్రికెటర్లు వీరే..!

Farmers News: రైతులకు గుడ్‌న్యూస్‌.. త్వరలో వారికోసం చౌకగా ఈ సేవలు..!

Viral Video: చిలిపి పని చేసిన పెళ్లికూతురు.. నోరెళ్లబెట్టిన పెళ్లి కొడుకు.. వైరల్‌ అవుతున్న వీడియో..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu