Dog Viral Video: ఆలయంలో వింత సంఘటన.. భక్తులను ఆశీర్వదిస్తున్న శునకం.. దైవలీలే అంటున్న భక్తులు..
మనుషులతో పాటు పశుపక్ష్యాదులను కూడా గౌరవించడం భారతీయ సనాతన ధర్మంలో ఒక భాగం. భారతీయులు ప్రకృతిని దేవతగా భావించి ఆరాధిస్తారు. ప్రతీ ప్రాణిలోనూ దైవత్వాన్ని చూడటం భారతీయుల గొప్పదనం. అందుకే మన దేశంలో ఆలయాలు, పండుగలు చాలా ఎక్కువ.
మనుషులతో పాటు పశుపక్ష్యాదులను కూడా గౌరవించడం భారతీయ సనాతన ధర్మంలో ఒక భాగం. భారతీయులు ప్రకృతిని దేవతగా భావించి ఆరాధిస్తారు. ప్రతీ ప్రాణిలోనూ దైవత్వాన్ని చూడటం భారతీయుల గొప్పదనం. అందుకే మన దేశంలో ఆలయాలు, పండుగలు చాలా ఎక్కువ. ఆవుల్ని గోమాతలుగా పూజిస్తాం. కుక్కలు, పిల్లులు ఇలా ప్రతీదీ భారతీయుల దృష్టిలో పరమాత్మ అంశలే. అందుకే భారతీయ సంప్రదాయాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఈ క్రమంలో మన గుళ్లు, పవిత్ర ప్రార్థనా స్థలాల దగ్గర అప్పుడప్పుడూ మూగజీవాలు కూడా దర్శనమిస్తూ ఉంటాయి. తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. ఇందులో ఒక కుక్క ఒక ఆలయ ద్వారం దగ్గర ఎత్తయిన అరుగుపైన కూర్చుని ఉంది. గుడిలోకి వెళ్లి దైవదర్శనానికి వచ్చిన భక్తులను ఆశీర్వదిస్తుంది. వారికి షేక్‌హ్యాండ్ ఇచ్చి పలకరిస్తోంది. ఈ శునకం అరుగుపైన కూర్చుని తన ముందు కాళ్లలో ఒకదానిని పైకి లేపి భక్తుల తలపై ఉంచి దీవిస్తోంది. ఇది చూస్తుంటే నిజంగా అది ఆశీర్వాదం ఇస్తున్నట్లే అనిపిస్తోంది. కొందరు దానితో కరచాలనం చేసినప్పుడు అది కూడా తన కాలును చాచి షేక్ ఫీట్ ఇస్తోంది. కాగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లోని ఓ రిపోర్ట్ ప్రకారం ఈ వీడియో మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో ఉన్న సిద్ధివినాయక దేవాలయంలో జరిగిన సంఘటనగా తెలుస్తోంది. ఒక వ్యక్తి తన ఫేస్‌బుక్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేశాడు. దాంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. కుక్కను చూసి జనాలు కాస్త భయపడినా… చాలా మంది దాని ముందు తలవంచుకుని దేవుడి స్వరూపుడంటూ నమస్కరిస్తున్నారు. కుక్క కూడా ఇలాగే ప్రజలను ఆశీర్వదిస్తూ ఎంతో ప్రేమగా అందరితో కరచాలనం చేస్తోంది. ఎవరికీ హాని కలిగించడంలేదు. ఈ వీడియో చూస్తున్న నెటిజన్లు కుక్కపై ప్రేమను కురిపించారు. “అది గణపతి బప్పా ద్వారపాలకుడు” అని ఒకరు అంటే . “కుక్కలు చాలా అందమైనవి, మనం వాటికి విలువ ఇవ్వాలి” అని మరో యూజర్ స్పందించారు. ఇంకొకరు “కుక్కను దేవదూతగా చేసిన భగవంతుని లీల అద్భుతం” అని అన్నారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Sitara Ghattamaneni: మహేశ్ తనయ క్యూట్ స్టిల్స్.. అప్పుడే యాక్టింగ్ మొదలెట్టిందా..!
Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్ ఇంత అందమా..! మెస్మరైజ్ చేస్తున్న ప్రగ్యా లేటెస్ట్ ఫొటోస్..
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

