AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: ఆ పాటతోనే నన్ను గుర్తుపెట్టుకుంటున్నారు.. సమంత ఆసక్తికర వ్యాఖ్యలు..

Samantha: గత కొన్ని రోజులుగా ఏదో ఒక అంశంతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు నటి సమంత. ఫ్యామిలీ మ్యాన్‌ - 2 (Family man 2) వెబ్‌ సిరీస్‌తో ఒక్కసారి నేషనల్ ఆడియన్స్‌కు చేరువైన సామ్‌ తన అద్భుత నటతో మెస్మరైజ్ చేశారు...

Samantha: ఆ పాటతోనే నన్ను గుర్తుపెట్టుకుంటున్నారు.. సమంత ఆసక్తికర వ్యాఖ్యలు..
Samantha
Narender Vaitla
|

Updated on: Mar 11, 2022 | 3:18 PM

Share

Samantha: గత కొన్ని రోజులుగా ఏదో ఒక అంశంతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు నటి సమంత. ఫ్యామిలీ మ్యాన్‌ – 2 (Family man 2) వెబ్‌ సిరీస్‌తో ఒక్కసారి నేషనల్ ఆడియన్స్‌కు చేరువైన సామ్‌ తన అద్భుత నటతో మెస్మరైజ్ చేశారు. ఈ సినిమాతో ఒక్కసారిగా పాన్‌ ఇండియా క్రేజ్‌ను దక్కించుకున్న సామ్‌. తాజాగా పుష్ప (Pushpa) సినిమాలో స్పెషల్‌ సాంగ్‌తో మరోసారి ఆల్‌ ఇండియా లెవల్‌లో సమంత పేరు ఒక్కసారిగా మారుమోగింది. ఎంతలా అంటే పుష్ప విజయంలో ఈ పాటకు కూడా ఒక అంశంగా మారిందని సినీ క్రిటిక్స్‌ తెలపడం గమనార్హం. సినిమాలకు దూరంగా ఉంటున్న సమయంలో వచ్చిన ఈ ఐటెం సాంగ్‌తో సమంత మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇలా తన కెరీర్‌ను మరోసారి మలుపు తిప్పిన ‘ఊ అంటవా మావా’ పాటపై సమంత తాజాగా స్పందించారు.

ఇటీవల ముంబయిలో జరిగిన క్రిటిక్స్‌ ఛాయిస్‌ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో సమంత పాల్గొంది. ఈ సందర్భంగా మీడియాలో మాట్లాడిన సామ్‌.. ‘నాపై అభిమానులు చూపిస్తున్న ప్రేమాభిమానాలు మాటల్లో చెప్పలేను. పుష్పలోని ‘ఊ అంటావా’ పాట పాన్‌ ఇండియా లెవల్‌లో ఈ రేంజ్‌ విజయాన్ని అందుకుంటుందని ఊహించలేదు. తెలుగు ప్రేక్షకులే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్‌ అంతా నేను ఇప్పటి వరకు చేసిన సినిమాలను మర్చిపోయారు. ‘ఊ అంటావా’ పాటతోనే నన్ను గుర్తు పెట్టుకుంటున్నారు’ అంటూ చెప్పుకొచ్చింది సామ్‌.

ఇదిలా ఉంటే క్రిటిక్స్‌ ఛాయిస్‌ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి హాజరైన సమంత హాట్‌ లుక్‌లో రెడ్‌ కార్పెట్‌పై హొయలొలికించారు. ప్రస్తుతం సమంతకు సంబంధించిన ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

Also Read: AP DME Jobs 2022: పది/ఇంటర్‌ అర్హతతో.. ఏపీ డైరెక్టరేట్ ఆఫ్‌ మెడికల్ ఎడ్యుకేషన్‌లో ఉద్యోగాలు..

EPFO: పీఎఫ్ ఖాతాదారులకి గమనిక.. ఆ నెంబర్ల గురించి సమాచారం తెలుసుకోండి..!

Kamal Haasan: పదేళ్లలో దుమ్ము దులిపేశారు.. కేజ్రీవాల్‌కు కంగ్రాట్స్‌ చెప్పిన కమల్ హాసన్