Chicken Nuggets: 22 ఏళ్లుగా అన్ని పూటలా చికన్ ముక్కలే.. ఆ యువతి ఆహారపు అలవాట్లు తెలిస్తే షాకే
Chicken Nuggets: సోషల్ మీడియా(Socila Media) ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన అనంతరం ప్రపంచంలో ఎక్కడ ఏమి జరిగినా వెంటనే అందరికీ తెలుస్తోంది. విభిన్న ఆహారపు అలవాట్లు, సంప్రదాలు ఇలా అన్ని విషయాలు..
Chicken Nuggets: సోషల్ మీడియా(Socila Media) ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన అనంతరం ప్రపంచంలో ఎక్కడ ఏమి జరిగినా వెంటనే అందరికీ తెలుస్తోంది. విభిన్న ఆహారపు అలవాట్లు, సంప్రదాలు ఇలా అన్ని విషయాలు తెలుస్తున్నాయి. అయితే కొంతమంది ఆహారపుఁ అలవాట్లు విచిత్రంగా ఉండడమే కాదు..షాక్ కలిగించేలా కూడా ఉంటున్నాయి. కొన్ని సంవత్సరాలుగా ఇసుకమాత్రమే తినే బామ్మ(Sand eating woman).. ఇలా వ్యక్తుల విచిత్రవారి ఆహార అలవాట్లు, భిన్న జీవనశైలి ప్రపంచానికి పరిచయం అవుతుంది. ఓ సినిమాలో హీరో .. హీరోయిన్‌ని కామెంట్ చేస్తాడు గుర్తుందా…”ఫ్యామిలీ మొత్తం ఉప్మా తిని బతికేస్తున్నారు” అని అది సినిమాలో సరదాకి అన్న డైలాగే అయినా… ఇక్కడ ఓ యువతి అది నిజం చేసింది. కాకపోతే ఈమె తినేది ఉప్మా కాదండోయ్… చికెన్.. గత 22 ఏళ్ల నుంచి ఈమె కేవలం చికెన్ మాత్రమే తింటుంది. వినడానికి షాకింగ్‌గా ఉన్నా ఇది నిజం. తన రోజువారి డైట్‌లో చికెన్ నగ్గెట్స్, చికెన్ ఫ్రై, పొటాటో చిప్స్ ఇవే ఉంటాయట. పండ్లు, కూరగాయలు అస్సలు పడవట.
బ్రిటన్‌కు చెందిన 25 ఏళ్ల ఓ యువతి పండ్లు, కూరగాయలు తినకపోయినా చాలా ఆరోగ్యంగా ఉందట. ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఆ యువతికి రాలేదట. అసలు తను పండ్లు, కూరగాయలు తిన్న జ్ఞాపకమే లేదంటోంది. వాటిని తినాలని కూడా ఆమెకు లేదట. వాటిని తింటే.. తనకు ఏదోలా అవుతుందట. తనకు మూడేళ్ల వయసునుంచే పండ్లకు, కూరగాయలకూ దూరంగా ఉంటూ వచ్చిందట. కేవలం చికెన్‌తో చేసిన వంటకాలు, పొటాటో చిప్స్, ఫ్రై పదార్థాలను మాత్రమే తీసుకుంటుందట ఈ అమ్మాయి. ఉదయం లేవగానే తను అందరిలా బ్రేక్‌ఫాస్ట్ చేయదట… మధ్యాహ్నానికి లంచ్ మాత్రం పొటాటో చిప్స్ తింటుందట. రాత్రి డిన్నర్‌లో 8 చికెన్ నగ్గెట్స్, చికెన్ ఫ్రై మాత్రమే తింటుందట. ఇదండీ… ఈమె చికెన్ కథ.. దీనిపై ఏంటో ఈ వింత అలవాట్లు… అంటున్నారు నెటిజన్లు… నిజమేకదండీ..!
Also Read: Chanakya Niti: కొన్ని విషయాలు క్షణికానందాన్ని ఇస్తాయి.. వాటిని చూసి పొంగిపోకూడదు అంటున్న చాణక్య