Russia Ukraine War Updates: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను సమీపిస్తున్న రష్యా సేనలు.. టాప్-9 న్యూస్ అప్‌డేట్స్

Russia Ukraine War News Updates: రష్యా-ఉక్రెయిన్​ మధ్య చర్చలు కొలిక్కి రాలేదు. దీంతో 16వ రోజు ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి.

Russia Ukraine War Updates: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను సమీపిస్తున్న రష్యా సేనలు.. టాప్-9 న్యూస్ అప్‌డేట్స్
Russia Ukraine War
Janardhan Veluru

|

Mar 11, 2022 | 2:52 PM

Russia Ukraine War News Updates: రష్యా-ఉక్రెయిన్​ మధ్య చర్చలు కొలిక్కి రాలేదు. దీంతో 16వ రోజు ఉక్రెయిన్‌పై రష్యా సేనల దాడులు కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ను రష్యన్‌ సైన్యం సమీపిస్తోంది. ఏ క్షణమైనా కీవ్‌ను స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. కీవ్‌ నగరానికి కేవలం 15 కిలోమీట్లర్ల దూరంలో ఉంది పుతిన్‌ సేన. కీవ్‌ వైపు రష్యా సేనలు దూసుకొస్తున్నాయి. నలువైపుల నుంచి కీవ్‌ను చుట్టముట్టేసింది. కీవ్‌పై మూకుమ్మడి దాడి చేసి హస్తగతం చేసుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది రష్యా.

ఉక్రెయిన్‌లో ప్రస్తుత పరిస్థితిపై టాప్‌-9 న్యూస్ ఇప్పుడు చుద్దాం…

  1. ఉక్రెయిన్‌లో భీకర పోరు కొనసాగుతోంది. పుతిన్‌-జెలెన్‌స్కీ సేనల మధ్య హోరాహోరీ ఫైట్‌ 16వ రోజు సాగుతోంది. సామాన్య పౌరులే టార్గెట్‌గా విరుచుకుపడుతున్నాయి రష్యన్‌ బలగాలు. 16 రోజులుగా యుద్ధం సాగుతున్నా కీవ్‌ను హస్తగతం చేసుకోలేకపోయింది రష్యా. ప్రస్తుతం కీవ్‌కు 15కిలోమీటర్ల దూరంలో ఉన్న పుతిన్ సేన..కీవ్‌ వైపు దూసుకొస్తోంది.
  2. ఉక్రెయిన్‌-రష్యా మధ్య జరిగిన చర్చల్లో ఎలాంటి పురోగతి లేదు. విదేశాంగమంత్రులు టర్కీలో సమావేశమయ్యారు. ఆ చర్చలు కూడా అసంపూర్తిగానే ముగిశాయి. యుద్ధం విరమించడానికి రష్యా సిద్ధంగా లేదని.. తాము లొంగిపోవాలన్నదే పుతిన్‌ ఉద్దేశమన్నారు ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి దిమిత్రో. కానీ తాము తగ్గే ప్రసక్తే లేదంటున్నారు.
  3. మరోవైపు రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మరియుపోల్‌లో ఆస్పత్రులపైనా దాడులు చేశాయి రష్యన్‌ బలగాలు. మరియుపోల్‌లో ప్రజలు తిండి, నీరు లేక అలమటించిపోతున్నారు. రష్యా దాడుల్లో ఇప్పటివరకు 1300మంది పౌరులు చనిపోయారని ప్రకటించింది ఉక్రెయిన్‌.
  4. రష్యా పాల్పడుతున్న యుద్ధనేరాలపై అంతర్జాతీయంగా దర్యాప్తు జరగాలని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ పిలుపునిచ్చారు. పౌరులపై దాడులు, దురాక్రమణ వంటి అంశాలపై విచారణ జరపాలన్నారు. పోలండ్ పర్యటనలో ఉన్న కమల.. ప్రసూతి ఆస్పత్రిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు.
  5. ఉక్రెయిన్ దేశంపై తాము వాక్యూమ్ బాంబులు వేసింది వాస్తవమేనని రష్యా రక్షణ మంత్రిత్వశాఖ ధృవీకరించింది. ఉక్రెయిన్ దేశంపై సైనిక దాడిలో భాగంగా తాము TOS-1 ఏ థర్మో బారిక్ రాకెట్లను ఉపయోగించామని, ఈ బాంబ్ వల్ల మానవశరీరాలు ఆవిరి అయ్యే సామర్థ్యం ఉందని రష్యా రక్షణ మంత్రిత్వశాఖ వివరించింది.
  6. ఉక్రెయిన్‌లో భీకర పోరు కొనసాగుతోంది..సైనిక చర్య పేరిట గత 15 రోజులుగా రష్యా సాగిస్తున్న దాడుల కారణంగా తమకు 7.6 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని ఉక్రెయిన్‌ ప్రభుత్వ ఆర్థిక సలహాదారు ఒలేగ్‌ ఉస్‌తెంకో తెలిపారు. యుద్ధం కారణంగా దేశంలో 50 శాతం వాణిజ్య కార్యకలాపాలను మూసేసినట్టు వెల్లడించారు.
  7. రష్యా సైనిక చర్యలతో అల్లకల్లోలంగా మారిన ఉక్రెయిన్.. తమకు EU లో సభ్యత్వం ఇవ్వాలని చాలా రోజులుగా కోరుతోంది.ఉక్రెయిన్‌కు EU సభ్యత్వం ఇవ్వడానికి సమయం పడుతుందని యూరోపియన్ అఫైర్స్ మంత్రి క్లీమెట్ బ్యూన్ అన్నారు..అయితే ఈ విషయంలో తొందర పడకూడదని EU భావిస్తోంది.
  8. రష్యా దాడులతో దేశం విడిచి వెళ్తున్నారు లక్షలాదిమంది ఉక్రేనియన్లు. విదేశీయులతో పాటు ఉక్రేనియన్లు కూడా సరిహద్దులకు చేరుకుంటున్నారు. హంగేరీ జహేనీ రైల్వేస్టేషన్లలో వేలాదిమంది ఆశ్రయం పొందుతున్నారు. దేశం విడిచి శరణార్థులుగా బతుకుతున్నారు. యురేపియన్‌ యూనియన్‌ కంట్రీస్‌ వారికి హెల్ప్‌ చేస్తున్నాయి.
  9. ఉక్రెయిన్​పై భీకర దాడుల నేపథ్యంలో రష్యాపై వివాదస్పద పోస్టుల నియంత్రణపై ఆంక్షలను సడలించింది ఫేస్​బుక్​. రష్యాకు వ్యతిరేకంగా చేసే పోస్టుల్లో ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలిపింది. అయితే, పౌరులకు సామాన్య ప్రజలను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు అనుమతించబోమని వెల్లడించింది.

Also Read..

Chicken Nuggets: షాక్ కలిగిస్తున్న ఓ యువతి ఆహారపు అలవాటు.. 22 ఏళ్లుగా చికెన్‌నే ఆహారం.. కూరగాయలు, పండ్లు తిన్న గుర్తేలేదంట

YS Jagan: త్వరలోనే ఏపీ మంత్రివర్గ విస్తరణ.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu