Ukraine Crisis Updates: రష్యా యుద్ధోన్మాదం.. దేశం వీడుతున్న లక్షలాది మంది ఉక్రెయిన్ పౌరులు.. యూరప్ దేశాల్లో అణుభయాలు..
Russia Ukraine War News Updates: ఉక్రెయిన్‌పై గత రెండు వారాలకు పైగా రష్యా సేనల భీకర దాడులు కొనసాగుతున్నాయి. మైనస్ డిగ్రీల చలిలో తినడానికి తిండిలేదు..కరెంట్ కూడా లేని బంకర్లలో బిక్కుబిక్కుమంటున్నారు.
Russia Ukraine War News: ఉక్రెయిన్‌పై గత రెండు వారాలకు పైగా రష్యా సేనల భీకర దాడులు కొనసాగుతున్నాయి. మైనస్ డిగ్రీల చలిలో తినడానికి తిండిలేదు..కరెంట్ కూడా లేని బంకర్లలో బిక్కుబిక్కుమంటున్నారు. యుద్ధోన్మాదంతో రెచ్చిపోతున్న రష్యా వెనక్కి తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. అటు పలు దేశాల విజ్ఞప్తి మేరకు ఉక్రెయిన్లో చిక్కుకున్న విదేశీ పౌరుల కోసం రష్యా కాల్పుల విరమణ ప్రకటించడంతో లక్షలాదిమంది ఉక్రేనియన్లు కూడా తమ దేశం విడిచి వెళ్తున్నారు. 5 రోజుల నుంచి ట్రావెల్ చేస్తూ సరిహద్దులకు చేరుకుంటున్నారు. వారిని రిసీవ్ చేసుకుంటున్నారు హంగేరీ ప్రజలు. ఉక్రెయిన్ బోర్డర్ దాటి వచ్చాక వారిని వేరే ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు. ఇమ్మిగ్రేషన్, వీసా ప్రాసెస్ పూర్తయ్యాక వారిని వేరే దేశాలకు పంపిస్తున్నారు.
అలా లక్షలాది మంది ప్రజలు బ్రతుకు జీవుడా అంటూ.. ఉక్రెయిన్ దేశ సరిహద్దులు దాటుతున్నారు. ప్రాణ భయంతో విదేశీ పౌరులతో పాటు ఉక్రేనియన్లు కూడా దేశ సరిహద్దులకు చేరుకుంటున్నారు. హంగేరీ జహేనీ రైల్వేస్టేషన్లలో వేలాదిమంది ఆశ్రయం పొందుతున్నారు. దేశం విడిచి శరణార్థులుగా బతుకుతున్నారు. యురేపియన్ యూనియన్ దేశాలు వారికి సాయం అందిస్తున్నాయి.
యూరప్ దేశాల్లోనూ అణుభయాలు..
అణ్వాయుధ భయం యూరప్ దేశాలను వణికిస్తోంది. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతుండగా.. ఇప్పుడు యుద్ధ భయం యూరప్ కంట్రీస్‌కూ పాకింది. రష్యా అణ్వాయుధ ప్రయోగం చేస్తే.. దాని ప్రభావం మొత్తం యూరప్ ఖండంపై ఉంటుంది. హంగేరీ, రొమేనియా, మాల్టోవాతో పాటు చుట్టుపక్కల దేశస్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ రష్యా అణు బాంబ్ ప్రయోగిస్తే.. దాన్నుంచి ఎలా బయటపడాలా అని టెన్షన్ పడుతున్నారు. ఇందుకోసం తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతో కొందరు యూరోపియన్లు..దేశాలను వీడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరికొందరు రేడియేషన్ ప్రభావం నుంచి బయటపడేందుకు మార్గాలు అన్వేషిస్తున్నారు.
ఉక్రెయిన్‌కి అమెరికా మరోసారి భారీ సాయం..
ఇదిలా ఉండగా ఉక్రెయిన్‌కు అగ్రరాజ్యం అమెరికా మరోసారి భారీ సాయం ప్రకటించింది. 13.6బిలియన్ డాలర్ల ప్యాకేజీకి అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. తన బలగాలను ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు తరిలించేందుకు ఈ నిధులను ఉపయోగించనుంది. ఇక ఐక్యరాజ్యసమితి ఆహార కార్యక్రమం ద్వారా మరో 50మిలియన్ డాలర్లను మానవతాసాయం కింద అందించనుంది.
Also Read..
Crypto Fraud: హైదరాబాదీకి సైబర్ నేరగాళ్లు కుచ్చు టోపీ.. క్రిప్టో పెట్టుబడుల పేరుతో దోచేశారు..
CM KCR: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అస్వస్థత.. యశోదాలో వైద్య పరీక్షలు