Crypto Fraud: హైదరాబాదీకి సైబర్ నేరగాళ్లు కుచ్చు టోపీ.. క్రిప్టో పెట్టుబడుల పేరుతో దోచేశారు..
Crypto Fraud: కంటికి అంతా వర్చువల్..! బ్యాంకుల నియంత్రణ లేదు. అయినా అత్యాశతో క్రిప్టో కరెన్సీలో(Crypto Currencies) పెట్టుబడులు పెట్టి దివాళా తీస్తున్నారు. ఒకటి కాదు..రెండు కాదు..వందల సంఖ్యలో ఇన్వెస్టర్లు మోసపోతున్నారు.
Crypto Fraud: కంటికి అంతా వర్చువల్..! బ్యాంకుల నియంత్రణ లేదు. అయినా అత్యాశతో క్రిప్టో కరెన్సీలో(Crypto Currencies) పెట్టుబడులు పెట్టి దివాళా తీస్తున్నారు. ఒకటి కాదు..రెండు కాదు..వందల సంఖ్యలో ఇన్వెస్టర్లు మోసపోతున్నారు. లెటేస్ట్‌గా ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో(Online Trading) కోటిరూపాయలు పోగొట్టుకున్న హైదరాబాద్ వాసి లబోదిబోమంటున్నారు. సైబర్ నేరగాళ్లకు క్రిప్టోకరెన్సీ వరంగా మారింది. క్రిప్టోలో పెట్టుబడి పెడితే కోట్ల రూపాయలు సంపాదించవచ్చని ఆన్‌లైన్‌లో ఇన్వెస్టర్లకు వల వేస్తున్నారు. హైదరాబాద్ కవాడీగూడకు చెందిన శ్రీనివాస్‌ను ఇటీవల ఓ వ్యక్తి టెలిగ్రామ్ గ్రూప్‌లో యాడ్ చేశారు. అయితే ఆ గ్రూప్‌లో ప్రతిరోజు క్రిప్టో కరెన్సీపైనే చర్చ జరుగుతుండేది. కొద్దిరోజుల తర్వాత శ్రీనివాస్‌తో మాటలు కలిపారు సైబర్ నేరస్థులు. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే కోట్ల రూపాయలు వస్తాయని నమ్మించారు.
శ్రీనివాస్‌ను వెంటనే కేకాయిన్ అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సైబర్ నేరగాళ్లు సూచించారు. తన మొబైల్‌లో కేకాయిన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న శ్రీనివాస్..లక్షల్లో పెట్టుబడులు పెడుతూ వచ్చాడు. అత్యాశతో పలు దఫాలుగా మొత్తం 73 లక్షలు పెట్టుబడి పెట్టారు. కొద్దిరోజుల తర్వాత 73 లక్షలకుగానూ శ్రీనివాస్ సైట్‌లో 4 కోట్ల రూపాయలు ఉన్నట్లు చూపించింది. శ్రీనివాస్ ఈ మొత్తం అమౌంట్‌ను డ్రా చేసుకునేందుకు శతవిధాల ప్రయత్నించాడు. ఎంతకూ డబ్బు ట్రాన్స్‌ఫర్ కాకపోవడంతో శ్రీనివాస్ సైబర్ నేరగాళ్లను నిలదీశాడు. అయితే మరింత పెట్టుబడి పెడితే ఒకేసారి కోట్లు తీసుకోవచ్చని చెప్పారు. దీంతో తాను మోసోయినట్లు గుర్తించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇక అంబర్‌పేటకు చెందిన రాజు, అతని స్నేహితులు, మరో ముగ్గురు కలిసి క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపించారు. రాజుకు తెలిసిన వ్యక్తి సహకారంతో కేకాయిన్ యాప్‌లో 28 లక్షలు పెట్టుబడి పెట్టారు. లాభాలు రాకపోవడంతోపాటు పెట్టిన సొమ్ము వెనక్కి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
క్రిప్టో కరెన్సీ గురించి కొంత సమాచారం..
కంటికి కనిపించని ఈ క్రిప్టోకరెన్సీ అంటే ఏమిటి..? భారత్‌లో ఈ కరెన్సీకి చట్టబద్ధత ఉందా..? వీటిపై బ్యాంకులకు నియంత్రణ ఉంటుందా..? అంటే లేదనే చెబుతున్నారు ఆర్థిక నిపుణులు. దేశంలో క్రిప్టోకరెన్సీకి చట్టబద్ధత లేకున్నా.. ఆన్‌లైన్ ట్రేడింగ్‌పై 30 శాతం ట్యాక్స్ విధిస్తోంది కేంద్ర సర్కార్. ఈ కరెన్సీపై బ్యాంకులకు ఎలాంటి నియంత్రణ ఉండదు. కేవలం డీసెంట్రలైజ్డ్ సిస్టమ్ ద్వారా పనిచేస్తాయి. క్రిప్టోకరెన్సీల విలువ డిమాండ్, సరఫరా ఆధారంగా మారుతుంటాయి. క్రిప్టోకరెన్సీల్లో అనేక రకాలు ఉన్నాయి. ఏ కరెన్సీ మంచిదో ముందే తెలుసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా బిట్‌కాయిన్, ఇథీరియమ్, డాష్, మొనెరో, రిపుల్, లైట్‌కాయిన్ అనేవి ప్రముఖ క్రిప్టో కరెన్సీలుగా చలామణి అవుతున్నాయి.
ఇవీ చదవండి..
Viral Photo: ఫోటోలోని ప్రముఖ వ్యాపారవేత్తను గుర్తుపట్టారా..? మీ మెదడుకు మేత..