Telangana Jobs: తెలంగాణలో కొలువుల జాతర.. రాష్ట్రవ్యాప్తంగా కోచింగ్‌ సెంటర్లు బిజీ బిజీ

ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీ సాక్షిగా బంపరాఫర్‌తో నిరుద్యోగుల్లో కొత్త ఆశలు చిగురించడమే కాదు, కరోనా ఎఫెక్ట్‌తో మూతపడిన కోచింగ్‌ సెంటర్లకు జీవం పోసింది.

Telangana Jobs: తెలంగాణలో కొలువుల జాతర.. రాష్ట్రవ్యాప్తంగా కోచింగ్‌ సెంటర్లు బిజీ బిజీ
Telangana Jobs
Follow us
Balaraju Goud

| Edited By: Sanjay Kasula

Updated on: Mar 11, 2022 | 9:33 PM

Telangana Job Coaching Centres: తెలంగాణలో కొలువుల జాతరతో కోచింగ్‌ సెంటర్లు బిజీ బిజీ అయిపోతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌(CM KCR) అసెంబ్లీ సాక్షిగా బంపరాఫర్‌తో నిరుద్యోగుల్లో కొత్త ఆశలు చిగురించడమే కాదు, కరోనా ఎఫెక్ట్‌తో మూతపడిన కోచింగ్‌ సెంటర్లకు జీవం పోసింది. ఉద్యోగార్థులు(Unemployees) పెద్ద సంఖ్యలో వచ్చి చేరుతుండటంతో కొత్త బ్యాచ్‌లు మొదలవుతున్నాయి. నో బ్రేక్‌ అన్నట్టు పగలూ సాయంత్రం జరుగుతున్న క్లాసులతో కోచింగ్‌ సెంటర్లలో ఒకటే సందడి కనిపిస్తోంది. అభ్యర్థుల రష్‌తో కొత్త కోచింగ్‌ సెంటర్లూ వెలుస్తున్నాయి.

90 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో చేసిన ప్రకటన నిరుద్యోగులకు ఉగాదిని ముందే తెచ్చింది. వేచి చూస్తున్న తరుణం రానే రావడం వారిలో కొత్త జోష్‌ను నింపింది. ఏజ్‌ లిమిట్‌ పెంచడంతో ఉద్యోగాల కోసం పోటీ ఎక్కువగానే ఉంది. హైదరాబాద్‌తో పాటు తమ సమీప పట్టణాల్లో ఉన్న కోచింగ్‌ సెంటర్లలో ఉద్యోగార్థులు చేరుతున్నారు. వీరి సంఖ్య పెరుగుతుండటంతో కొత్త బ్యాచ్‌లు, కొత్త సెంటర్లు మొదలవుతున్నాయి.

టైమ్‌ చెప్పి మరీ ఉద్యోగాల భర్తీ ప్రకటన చేశారు సీఎం కేసీఆర్‌. 91 వేల 142 పోస్టులు భర్తీ చేస్తామని నిరుద్యోగులకు తీపి కబురు చెప్పారు. వాటిలో 80,039 కొత్త నియామకాలు. 95 శాతం స్థానిక రిజర్వేషన్లు. ఉద్యోగార్థుల గరిష్ఠ వయో పరిమితి పదేళ్లు పెంచుతున్నట్టు ప్రకటించారు. ఇక నోటిఫికేషన్‌ రావడమే ఆలస్యం. కేసీఆర్‌ ప్రకటనతో నిరుద్యోగుల్లో హుషార్‌ వచ్చింది. కోచింగ్‌ సెంటర్లలో కోలాహలం మొదలైంది. 80 వేల పైచిలుకు ఉద్యోగాల భర్తీ తమకు చాలా మంచి ఆపర్చునిటీ అని పట్టభద్రులు చెబుతున్నారు. ఉద్యోగాలకు ఏజ్‌ లిమిట్‌ పెంచడంతో పోటీ పడే అభ్యర్థుల సంఖ్య పెరిగింది. దీంతో ఉన్నవాటికి తోడు కొత్త కోచింగ్‌ సెంటర్లు వెలుస్తున్నాయి.

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో కోచింగ్‌ సెంటర్లలో సందడి మొదలైంది. డిపార్ట్‌మెంట్ల వారీగా భర్తీ చేసే ఉద్యోగాల వివరాలను కూడా ప్రభుత్వం ప్రకటించింది. వెంటనే నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉండటంతో ఉద్యోగార్థులు కోచింగ్‌ సెంటర్లకు పరుగు తీస్తున్నారు. ఎక్కువగా జనరల్‌ స్టడీస్‌పై కాన్సన్‌ట్రేట్‌ చేస్తున్నారు. ఈసారి అభ్యర్థుల సంఖ్య పెరిగిపోతుండటంతో దానికి అనుగుణంగా కోచింగ్‌ సెంటర్ల నిర్వాహకులు క్లాస్‌ రూమ్‌లను సిద్ధం చేస్తున్నారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో టీచర్లుగా పనిచేస్తూ పరీక్షకు ప్రిపేర్‌ అవుతున్న వాళ్లు ఎక్కువ మంది ఉన్నారు. వారి కోసం సాయంత్రం పూట క్లాసులు నిర్వహిస్తున్నారు. అలాగే డిగ్రీ, పీజీ, బీటెక్‌ పూర్తిచేసిన అభ్యర్థులు కూడా సర్కారీ కొలువు టార్గెట్‌గా ప్రిపేర్‌ అవుతున్నారు.

కేసీఆర్‌ జరుపుతున్న కొలువుల జాతర నిరుద్యోగుల్లో ఆశలు నింపగా కరోనా ప్రభావంతో కుదేలైన కోచింగ్‌ సెంటర్లకు మంచిరోజులు తెచ్చింది. ఇక వీలైనంగ త్వరగా నోటిఫికేషన్‌ ఇవ్వాలని, ప్రతి ఏడాదీ ఉద్యోగ భర్తీ క్యాలెండర్‌ విడుదల చేయాలని యువత కోరుతోంది.

Read Also…

CM KCR: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు స్వల్ప అస్వస్థత.. యశోదా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు