AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM KCR: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు స్వల్ప అస్వస్థత.. యశోదా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు

CM KCR Hospitalized: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. జనరల్ చెకప్‌లో భాగంగా అన్ని పరీక్షలు నిర్వహిస్తామని యశోదా ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

CM KCR: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు స్వల్ప అస్వస్థత.. యశోదా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు
Cm Kcr
Balaraju Goud
|

Updated on: Mar 11, 2022 | 12:41 PM

Share

Telangana CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను కుటుంబసభ్యులతో కలిసి ఆసుపత్రికి వెళ్లారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు వైద్య పరీక్షల నిమిత్తం యశోద హాస్పిటల్ కు వెళ్లారు. వైద్యులు హార్ట్ యాంజియో పరీక్షలు నిర్వహిస్తున్నారు. కెసీఆర్‌కు సిటీ స్కాన్ , యాంజియోగ్రామ్ పరీక్షలు చేస్తున్నట్లు వైద్యులు తెలిపారు. అస్వస్థత కారణంగానే యాదాద్రి పర్యటనను సీఎం కేసీఆర్ రద్దు చేసుకున్నట్లు సమాచారం.

అయితే, గత రెండు రోజులుగా సీఎం కేసీఆర్ నీరసం గా ఉన్నారు. ఎడమ చేయి లాగుతున్నట్లు చెప్పారు. ప్రాథమిక పరీక్షల తర్వాత యాంజియోగ్రామ్ చేస్తామని యశోదా ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ప్రస్తుతానికి జనరల్ చెకప్‌లో భాగంగా అన్ని పరీక్షలు నిర్వహిస్తామని, సీఎం కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారని యశోదా ఆసుపత్రి వైద్యులు డా.ఎం.వి.రావు తెలిపారు. నివేదికలు వచ్చాక ఆరోగ్య పరిస్థితిపై పూర్తి సమాచారం వెల్లడిస్తామన్నారు. కాగా, ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న రాష్ట్ర మంత్రులు కేటీ రామారావు, హరీష్ రావు, ఎంసీ సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ కవిత.. హుటాహుటీన యశోదా ఆసుపత్రికి చేరుకున్నారు.

కాగా, సీఎం కేసీఆర్‌కు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సీఎం వైద్య పరీక్షలపై.. వ్యక్తిగత డాక్టర్ ఎం.వి.రావు వివరణ ఇచ్చారు. సీఎంకు సీటీ స్కాన్, కార్డియాక్ యాంజియోగ్రామ్ పరీక్షలు చేశామని తెలిపారు. యాంజియోగ్రామ్‌లో ఎలాంటి బ్లాక్స్ లేవని వైద్యులు స్పష్టం చేశారు. సీఎం ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

సీఎం కేసీఆర్ ఇటీవల వరుస పర్యటనలతో బిజీగా మారిన సంగతి తెలిసిందే. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా కొద్దిరోజుల క్రితం ముంబై, ఢిల్లీ, జార్ఖండ్‌ లో పర్యటించారు. గాల్వాన్ లోయలో మరణించిన ఇద్దరు సైనికుల కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. ఢిల్లీకి వెళ్లిన సమయంలోనే ఆయన కంటి పరీక్షలు చేయించుకున్నారు. అయితే వరుస పర్యటనలు, అధికారులతో సమీక్షల కారణంగా ఒత్తిడికి గురికావడం వల్లే కేసీఆర్ అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.