VH Comments: అందుకే ఇలాంటి ఫలితాలు.. 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యంపై వీహెచ్ సంచలన కామెంట్స్

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కాంగ్రెస్(Congress) పార్టీని అత్యవసరంగా ప్రక్షాళన చేయకుంటే కష్టమని ఆ పార్టీ సీనియర్ లీడర్ వి.హనుమంతరావ్(V.Hanumanta Rao) అన్నారు. పంజాబ్ లో కాంగ్రెస్ తిరిగి అధికారం నిలబెట్టుకోలేకపోయిందని..

VH Comments: అందుకే ఇలాంటి ఫలితాలు.. 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యంపై వీహెచ్ సంచలన కామెంట్స్
V.hanumanta Rao
Follow us
Ganesh Mudavath

| Edited By: Janardhan Veluru

Updated on: Mar 11, 2022 | 2:33 PM

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కాంగ్రెస్(Congress) పార్టీని అత్యవసరంగా ప్రక్షాళన చేయకుంటే కష్టమని ఆ పార్టీ సీనియర్ లీడర్ వి.హనుమంతరావ్(V.Hanumanta Rao) అన్నారు. పంజాబ్ లో కాంగ్రెస్ తిరిగి అధికారం నిలబెట్టుకోలేకపోయిందని అన్నారు. ఈ అంశంపై పార్టీ అధిష్టానానికి ఆయన పలు సూచలు చేశారు. అందరికీ అపాయింట్మెంట్లు ఇచ్చి.. అభిప్రాయాలు సేకరించాలని కోరారు. అందుకు తగిన విధమైన వాతావరణం కల్పించాలని, మేథో మథనం జరగాలనీ అన్నారు. గతంలో పన్నెండు మంది లీడర్లు కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయారు. కాంగ్రెస్ కు ఓటేస్తే టీఆర్ఎస్(TRS) కు వేసినట్లేనని జనం మాట్లాడుకుంటున్నారు. ప్రజలే కాకుండా కార్యకర్తలు కూడా తీవ్ర నిరాశలో ఉన్నారు. జనంలోకి పార్టీ పరంగా కచ్చితమైన నమ్మకాన్ని కలిగించాలి. అంతే కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని కూడా పార్టీలోకి తీసుకోకూడదు. ఒకవేళ తీసుకున్నా వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వకూడదని వీహెచ్ వ్యాఖ్యానించారు. దుబ్బాక- హుజూరాబాద్- ఓటమి పాఠాలు నేర్చుకోలేదనీ, జిల్లా జిల్లాకో తగాదా ఉంది. ఇక్కడికి వచ్చే అబ్జర్వర్లు వాటిని పట్టించుకోవాలని అన్నారు. కొన్నిసార్లు అసలైన కాంగ్రెస్ కార్యకర్తలను కూడా తీసేస్తున్నారనీ, అందువల్ల నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు నష్టం జరుగుతోందన్నారు. దీని వల్ల కాంగ్రెస్ పార్టీ అంటే జనానికి నమ్మకం లేకుండా పోయిందని చెప్పారు.

ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో పురాతన పార్టీ కాంగ్రెస్‌ గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నట్లు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి. గెలిచే అవకాశం ఉన్న ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, గోవా, మణిపుర్‌లలో ఏమాత్రం పోటీ ఇవ్వకుండా చేతులెత్తేయడం ఆ పార్టీ దైన్య స్థితికి అద్దంపడుతోంది. వయోభారంతో ఉన్న అధ్యక్షురాలు, స్పష్టమైన వ్యూహం లేని యువనేతలు, అసంతృప్తిగా ఉన్న సీనియర్లు.. ఇలా ఎన్నో కారణాలు కాంగ్రెస్‌ను ఈ స్థితికి తీసుకొచ్చాయి. పార్టీ అధినాయకత్వంలో నిర్ణయాలు తీసుకొనే సత్తా లోపించడం, ప్రత్యర్థుల ఎత్తుగడలను అంచనావేసి, వాటిని ఎదుర్కొనే వ్యూహాలను రచించే సామర్థ్యాలు లేకపోవడం ఆ పార్టీకి శరాఘాతమయ్యాయి. ప్రస్తుతం కాంగ్రెస్‌ చేతిలో రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ మాత్రమే మిగిలాయి. నేటితరం యువతకు గాంధీ కుటుంబ నేపథ్యం గురించి తెలియదని, అందువల్ల ఇదే తరహాలోనే రాజకీయాలు చేస్తూ పోతే కాంగ్రెస్‌ ఓటర్లు పెరిగే అవకాశం లేదని పేర్కొంటున్నారు.

Also Read

CM KCR: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు స్వల్ప అస్వస్థత.. యశోదా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు

Rose Farming: తీవ్రమైన నీటి కొరత ఆ గ్రామంలో రైతులు గులాబీ సాగుబాట పట్టారు.. లక్షల కొద్దీ సంపాదిస్తున్నారు

SSC Exam dates 2022: ఎస్సెస్సీ 2022 CGL, CHSL టైర్ 1 పరీక్షల తేదీలు విడుదల.. హాల్ టికెట్ల జారీ ఈ తేదీల్లోనే..