AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఈరోజు ఈ రాశివారు శ్రమకు తగిన ఫలితం అందుకుంటారు.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today (13-03-2022): రోజులో ఏ పని మొదలు పెట్టాలన్నా తమకు ఈరోజు ఎలా ఉంటుందని .. మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. వృత్తి , ఉద్యోగ, వ్యాపార ఇలా ఏ రంగంలో ఉన్నవారైనా సరే వెంటనే తమ దినఫలాల..

Horoscope Today: ఈరోజు ఈ రాశివారు శ్రమకు తగిన ఫలితం అందుకుంటారు.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
Surya Kala
|

Updated on: Mar 13, 2022 | 6:52 AM

Share

Horoscope Today (13-03-2022): రోజులో ఏ పని మొదలు పెట్టాలన్నా తమకు ఈరోజు ఎలా ఉంటుందని .. మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. వృత్తి , ఉద్యోగ, వ్యాపార ఇలా ఏ రంగంలో ఉన్నవారైనా సరే వెంటనే తమ దినఫలాల (Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (మార్చి 13వ తేదీ ) ఆదివారం రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

మేష రాశి: ఈరోజు ఈ రాశివారు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆశించిన ఫలితాలు సొంతమవుతాయి.  చేపట్టిన పనుల్లో విజయాన్ని సొంతం చేసుకుంటారు.

వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారికి అలసట పెరుగుతుంది. మనోధైర్యం చేపట్టిన పనులలో విజయం పెరుగుతుంది.

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు శుభవార్త వింటారు. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. మానసిక బలం తగ్గకుండా చూసుకోవాలి. కొన్ని ముఖ్యమైన పనులలో పురోగతి ఉంటుంది.

కర్కాటక రాశి: ఈ రాశివారు ఈరోజు శారీరక శ్రమ పడాల్సి ఉంటుంది. మానసిక బలంతో చేపట్టిన పనుల్లో ఫలితాలను అందుకోవాల్సి ఉంటుంది.  బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. విబేధాలు ఏర్పడే అవకాశం ఉంది. చేయని పొరపాటుకు నిందపడాల్సి వస్తుంది.

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు శుభకార్యాల్లో పాల్గొంటారు. శత్రువులపై విజయం సాధిస్తారు. భాధకలిగించే సంఘటన చోటు చేసుకుంటుంది.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు  విందు, వినోద,  కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి,  ఉద్యోగ, వ్యాపారాలలో అంచనాలను అందుకుంటారు. ఒక శుభవార్త వింటారు.

తుల రాశి: ఈ రోజు ఈ రాశివారు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. బంధుమిత్రులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

వృశ్చిక రాశి: ఈరోజు ఈరాశివారు కుటుంబంలో సానుకూల పరిస్థితులు ఉండకపోవచ్చు. మానసికంగా ఆందోళన కలిగించే విషయాలు చోటు చేసుకుంటాయి. బంధువులతో ఆచి తూచి వ్యవహరించాలి.

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్ధిక అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు.

మకర రాశి: ఈరోజు ఈ రాశివారు అభివృద్ధికి సంబంధించిన వార్తలు వింటారు. కీలక బాధ్యతలు నెరవేర్చాల్సి ఉంటుంది. బంధు, మిత్రులతో విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కుంభ రాశి: ఈరోజు ఈ రాశివారు మిశ్రమ ఫలితాలు అందుకుంటారు. ఆయా రంగాల్లో ఉన్నవారు  సమయానుకూలంగా ముందుకు సాగితే సత్పలితాలు అందుకుంటారు. బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. కుటుంబ విషయాల్లో ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది.

మీన రాశి: ఈరోజు ఈ రాశివారు శ్రమకు తగిన ఫలితం అందుకుంటారు. అలసట కొంచెం అధికంగా ఉంటుంది. ఇతరుల సహకారంతో పనులు పూర్తి చేస్తారు.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

Also Read:

Follow Us
తిరుమల శ్రీవారి భక్తులకు రైల్వేశాఖ మరో గుడ్ న్యూస్
తిరుమల శ్రీవారి భక్తులకు రైల్వేశాఖ మరో గుడ్ న్యూస్
తక్కువ ఖర్చుతో ఇంట్లోనే పచ్చి మిర్చి ఇలా పెంచితే బుట్టలు బుట్టలు
తక్కువ ఖర్చుతో ఇంట్లోనే పచ్చి మిర్చి ఇలా పెంచితే బుట్టలు బుట్టలు
చేతబడి వికటిస్తే.. మూడు ఓటీటీల్లోకి వచ్చేసిన సూపర్ హిట్ సినిమా
చేతబడి వికటిస్తే.. మూడు ఓటీటీల్లోకి వచ్చేసిన సూపర్ హిట్ సినిమా
ఒకే రైళ్లో ప్రయాణిస్తూ భారతదేశం మొత్తం చుట్టేయాలని ఉందా? మీ కోసమే
ఒకే రైళ్లో ప్రయాణిస్తూ భారతదేశం మొత్తం చుట్టేయాలని ఉందా? మీ కోసమే
పూల్వామా దాడి సూత్రధారి హతం..
పూల్వామా దాడి సూత్రధారి హతం..
వయస్సొచ్చిన అమ్మాయిలకు సూపర్ ఫుడ్.. ఇలా చేశారంటే అద్భుతమే..
వయస్సొచ్చిన అమ్మాయిలకు సూపర్ ఫుడ్.. ఇలా చేశారంటే అద్భుతమే..
స్టార్ కమెడియన్ కూతురు.. చిరంజీవితో బ్లాక్ బస్టర్ హిట్స్..
స్టార్ కమెడియన్ కూతురు.. చిరంజీవితో బ్లాక్ బస్టర్ హిట్స్..
గడ్డం పెంచుకుంటే ఇన్ని లాభాలా..? ఇది తెలిస్తే షేవింగ్‌కు గుడ్‌బై
గడ్డం పెంచుకుంటే ఇన్ని లాభాలా..? ఇది తెలిస్తే షేవింగ్‌కు గుడ్‌బై
మెగా 158 ప్రారంభం.. చిరంజీవి కూతురిగా ఆ క్రేజీ హీరోయిన్ ఫిక్స్
మెగా 158 ప్రారంభం.. చిరంజీవి కూతురిగా ఆ క్రేజీ హీరోయిన్ ఫిక్స్
రోహిత్ శర్మ 2027 వరల్డ్ కప్ డ్రీమ్‌కు బ్రేక్?
రోహిత్ శర్మ 2027 వరల్డ్ కప్ డ్రీమ్‌కు బ్రేక్?