AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: మన భారతీయులు సగటున ఏడాదికి ఎంత చక్కెరను తీసుకుంటారో తెలుసా? మరి ఈ వైట్‌ పాయిజన్‌కు ప్రత్యామ్నాయాలేంటంటే..

Sugar Control Tips: చక్కెరను ప్రతి ఇంటిలో ఉపయోగిస్తారు. టీ, పాలు, కాఫీ, షర్బత్ ఏదైనా కానీ తియ్యదనం కోసం చక్కెరను వాడుతారు.

Health Tips: మన భారతీయులు సగటున ఏడాదికి ఎంత చక్కెరను తీసుకుంటారో తెలుసా? మరి ఈ వైట్‌ పాయిజన్‌కు ప్రత్యామ్నాయాలేంటంటే..
Basha Shek
|

Updated on: Mar 13, 2022 | 6:46 AM

Share

Sugar Control Tips: చక్కెరను ప్రతి ఇంటిలో ఉపయోగిస్తారు. టీ, పాలు, కాఫీ, షర్బత్ ఏదైనా కానీ తియ్యదనం కోసం చక్కెరను వాడుతారు. ఇక చాలామంది వివిధ రకాల స్వీట్స్ను ఇష్టపడి మరీ తీసుకుంటారు. అయితే నాలుకకు తీపిని అందించే చక్కెర శరీరానికి మాత్రం చేదే. ఇది మీ శరీర బరువును వేగంగా పెంచుతుంది. అదే సమయంలో మీ ఎముకలను బలహీనపరుస్తుంది. ఇక మధుమేహ వ్యాధిగ్రస్తులకు చక్కెర కానీ చక్కెర పదార్థాలు ఎంత ప్రమాదకరమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వైట్‌ పాయిజన్‌గా చెప్పుకునే చక్కెర గ్లైసెమిక్‌ ఇండెక్స్ సుమారు 70. ఇది రక్తంలో వేగంగా కలిసిపోతుంది. ఇన్సులిన్‌ హర్మోన్‌ ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అలాగనీ డయాబెటిక్‌ ఉందన్న కారణంతో చక్కెరను పూర్తిగా దూరం పెట్టలేం. ఇందుకోసం మార్కెట్‌లో కొన్ని ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఇందులో గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ దాదాపు శూన్యం. ఫలితంగా ఇన్సులిన్‌ ఉత్పత్తిపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపవు. మరి మార్కెట్‌లో చక్కెరకు ప్రత్యామ్నాయంగా దొరికే కొన్ని స్వీట్‌నర్ల గురించి తెలుసుకుందాం రండి.

స్టెవియా ఒక అధ్యయనం ప్రకారం.. ఒక అమెరికన్ సగటున ఏడాదికి 22 కిలోల శుద్ధి చేసిన చక్కెరను తీసుకుంటాడు. అదేవిధంగా, సగటు భారతీయుడు ఏటా 14 కిలోల చక్కెరను వినియోగిస్తాడు. ఇది చక్కెరకు మంచి ప్రత్యామ్నాయం. ఇది స్టెవియా రెబాడియానా అనే చెట్టు నుంచి తయారుచేస్తారు. రుచిలో ఇది చాలా తీపిగా ఉంటుంది. ఈ చెట్టు ఎక్కువగా బ్రెజిల్, పరాగ్వేల్లో కనిపిస్తుంది. స్టెవియాలో గ్లైసెమిక్ ఇండెక్స్‌లో సున్నా. అంటే దీనిని వినియోగించడం వల్ల రక్తంలో చక్కెర, ఇన్సులిన్ స్థాయులు పెరగవు. అందుకే ఇది చక్కెరకు మంచి ప్రత్యామ్నాయమంటున్నారు వైద్యులు.

ఎరిథ్రిటాల్ ఇది చక్కెర లాగే చాలా తీపిగా ఉంటుంది. కానీ దీనిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులను పెంచదు. ఎందుకంటే దీని గ్లైసెమిక్ సూచిక సున్నా. మొక్కజొన్నను పులియబెట్టి దానికి కొన్ని ఎంజైమ్‌లను జోడించడం ద్వారా ఎరిథ్రిటాల్ తయారవుతుంది. ఇది డయాబెటిక్ పేషెంట్లకు మంచి ప్రత్యామ్నాయం కూడా. కీటో కుకీస్‌, కీటో చాక్లెట్లలో దీనిని ఎక్కువగా వినియోగిస్తుంటారు.

తక్కువ మోతాదులోనే.. స్టెవియా, ఎరిథ్రిటాల్ చక్కెరకు ప్రత్యామ్నాయమే కావచ్చు. అయితే వీటి తయారీలో కూడా కొన్ని రసాయన పదార్థాలు ఉపయోగిస్తారు. అందుకే వీటిని కూడా సరైన మోతాదులో తీసుకోవాలి. వీటిని ఉపయోగించే ముందు వైద్యుల సలహాలు తీసుకోవాలి. మోతాదుకు మించి తీసుకుంటే కడుపు ఉబ్బరం, గ్యాస్‌, ఎసిడిటీ మొదలైన ఉదర సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. Also Read:Gold Price Today: బంగారం ప్రియులకు షాకింగ్‌ న్యూస్‌.. భారీగా పెరిగిన ధరలు.. ఎంత పెరిగిందంటే..

Password Alert: పాస్ వర్డ్ విషయంలో మీరు ఈ తప్పులు చేస్తే అంతే సంగతులు

Viral Photo: మాములుగా ఉండదు మరి.! మొసలిని కనిపెడితే మీరే జీనియస్.. అంత ఈజీ కాదండోయ్!