Viral Photo: మాములుగా ఉండదు మరి.! మొసలిని కనిపెడితే మీరే జీనియస్.. అంత ఈజీ కాదండోయ్!
సోషల్ మీడియాలో ఫోటో పజిల్స్ లెక్కలేనన్ని ఉంటాయి. అవి ఎప్పుడూ కూడా మన కళ్ళను మోసం చేస్తుంటాయి. ఏదైతేనే..
సోషల్ మీడియాలో ఫోటో పజిల్స్ లెక్కలేనన్ని ఉంటాయి. అవి ఎప్పుడూ కూడా మన కళ్ళను మోసం చేస్తుంటాయి. ఏదైతేనే.. అలాంటి ఫోటో పజిల్స్ మన మెదడును చురుకుగా ఉంచడమే కాదు.. కళ్ళను కూడా పదును పెడతాయి. కొంతమంది అయితే ఇలాంటి పజిల్స్‌ను ఓ పట్టు పడితేనే గానీ నిద్రపోరు. సవాళ్లను ఎదుర్కుని.. వాటిల్లో విజయం సాధిస్తేనే మనకు కూడా కిక్కు ఉంటుంది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వినియోగం ఎక్కువైపోవడం.. పజిల్స్ కంటెంట్ బాగా ట్రెండింగ్ అవుతుండటంతో నెట్టింట ఏదొక ఫోటో పజిల్ తరచూ చక్కర్లు కొడుతుంటుంది. మీ కళ్లలో పవర్ ఉంటే.. చిటికెలో సాల్వ్ చేసేయగలరు. ఆ కోవకు చెందిన ఓ ఫోటో గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం..
పైన పేర్కొన్న ఫోటోలో ఓ మొసలి దాగుంది. అదెక్కడుందో మీరు కనిపెట్టాలి. చూడటానికి ఇది ఈజీ పజిల్‌లానే ఉంటుంది. కానీ కొంచెం కష్టమే. మీ కళ్లకు పదును పెడితే.. క్షణాల్లో సాల్వ్ చేసేయగలరు. ఫోటోలో ఉన్న ప్రాంతం చూడటానికి ఓ సరస్సు దగ్గరున్న ప్రదేశంలా ఉంది కదా.! అవును.. ఇలాంటి ప్రాంతాల్లోనే మొసళ్లు ఉంటాయి. మరి మీరు ఆ ప్రాంతం మొసలి ఎక్కడుందో కనిపెట్టండి.. లేట్ ఎందుకు మీ కళ్లకు పదును పెట్టి సాల్వ్ చేయండి.. కనిపెట్టేస్తే ఓకే గానీ.. సమాధానం దొరక్కపోతే క్రింద ఫోటో చూడండి..
Here is the answer.. pic.twitter.com/lH5PTfi4TQ
— telugufunworld (@telugufunworld) March 12, 2022