Health Tips: ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే, ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..!

Health Tips: పూర్వ కాలంలో వివాహాలు త్వరగా జరిగేవి. అదే సమయంలో వారి జీవితం ప్రశాంతంగా సాగిపోయేది. మెరుగైన జీవన శైలి, బలవర్ధకమైన ఆహారం..

Health Tips: ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే, ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..!
Pregnancy Tips
Follow us

|

Updated on: Mar 12, 2022 | 9:37 PM

Health Tips: పూర్వ కాలంలో వివాహాలు త్వరగా జరిగేవి. అదే సమయంలో వారి జీవితం ప్రశాంతంగా సాగిపోయేది. మెరుగైన జీవన శైలి, బలవర్ధకమైన ఆహారం, స్వచ్ఛమైన గాలి, నీరు ఉండేవి. ఫలితంగా వంధ్యత్వం వంటి సమస్యలు చాలా అరుదుగా వినిపించేవి. కానీ, నేటి కాలంలో అమ్మాయిలు గానీ, అబ్బాయిలు గానీ కెరీర్ ఓరియెంటెడ్ కాబట్టి తొందరగా పెళ్లి చేసుకోవడానికి ఏమాత్రం ఇష్టడపడటం లేదు. ఒకవేళ పెళ్లి చేసుకున్నా.. ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే, ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం, అస్తవ్యస్తమైన జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు మొదలైన కారణాల వల్ల గర్భధారణ ప్రణాళికలో సమస్యలు తలెత్తుతున్నాయి. అందుకే.. నేటి యువతీ, యువకులు పెళ్లైన తరువాత ప్రెగ్నెన్సీకి సంబంధించి కొన్ని విషయాలపై తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు.

ఈ విషయాలను గుర్తుంచుకోండి.. వయస్సు.. వయస్సు సంతానోత్పత్తిని ప్రభావితం చేయదని భావిస్తే.. అది తప్పుడు భావనే అని వైద్యులు చెబుతున్నారు. 30 సంవత్సరాల వరకు గర్భం దాల్చడానికి ఉత్తమ వయస్సు అని నిపుణులు పేర్కొంటున్నారు. 30 తర్వాత సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గడం ప్రారంభమవుతుంది. 35 సంవత్సరాల తర్వాత ఈ క్షీణత మరింత వేగంగా ఉంటుంది. ఇది అన్ని సందర్భాల్లో జరుగకపోయినా.. చాలా సందర్భాలలో ఆలస్యంగా వివాహం చేసుకోవడం కూడా వంధ్యత్వానికి కారణాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. IVF మొదలైన అనేక రకాల పద్ధతులు తెరపైకి వచ్చినప్పటికీ, సహజంగా తల్లి కావడానికి కొన్ని అంశాలపై అవగాహన పెంచుకోవడం ఉత్తమం.

బరువు.. బరువును నియంత్రించడం కూడా చాలా ముఖ్యం. వంధ్వత్వానికి ప్రధాన కారణాలలో ఊబకాయం కూడా ఒకటి. ప్రస్తుత కాలంలో హార్మోన్ల సమస్యలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇది సంతానోత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ హార్మోన్ల సమస్యలకు స్థూలకాయం కూడా ప్రధాన కారణం. మీ బరువు BMIకి అనుగుణంగా ఉండేలా చూసుకోవాలి.

జంక్ ఫుడ్స్.. చెడు ఆహారపు అలవాట్లు కూడా సంతానోత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతాయి. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ వంటి ఆయిల్ ఫుడ్స్.. ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతాయి. దీని కారణంగా స్త్రీల సంతానోత్పత్తి దెబ్బ తింటుంది. అలాగే పురుషుల స్పెర్మ్ కౌంట్ కూడా తగ్గుతుంది.

ధూమపానం.. సిగరెట్, మద్యం నేటి కాలంలో స్టేటస్ సింబల్స్‌గా మారాయి. ఇది స్త్రీలు, పురుషులు ఇద్దరికీ హానికరం. ధూమపానం చేయడం వల్ల పురుషుల స్పెర్మ్ నాణ్యత తగ్గుతుంది. అలాగే స్త్రీలలోనూ గర్భాశయ సమస్యలు వస్తాయి. ఇక మద్యం అలవాటు కూడా ప్రెగ్నెన్సీపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మద్యం సేవించే స్త్రీలు ఇతరులకన్నా గర్భం దాల్చడంలో చాలా ఇబ్బంది పడతారు.

Also read:

Telangana: అసెంబ్లీలో నవ్వులే నవ్వులు.. భట్టి విక్రమార్క కామెడీకి పడి పడి నవ్విన మంత్రి కేటీఆర్..

Andhra Pradesh: ఏపీలో షాకింగ్ ఘటన.. అందరూ చూస్తుండగా ట్రైన్ కింద పడ్డ యువకుడు.. హడలెత్తిస్తున్న దృశ్యాలు..!

Sabja Seeds Benefits: సబ్జా గింజలతో అద్భుత ప్రయోజనాలు.. అవేంటో తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..!