Health Tips: ఈ ఐదు మార్గాలను అనుసరిస్తే ఇన్ఫెక్షన్లతో పోరాడవచ్చు..!
Health Tips: మన శరీరంలో ఇమ్మూనిటి (Immunity) లేకపోతే సమస్యలు వచ్చిపడతాయి. మంచి పోషకాలున్న ఆహారం తీసుకోవడమే కాకుండా మానసిక ఆందోళన నుంచి బయటపడటం..
Health Tips: మన శరీరంలో ఇమ్మూనిటి (Immunity) లేకపోతే సమస్యలు వచ్చిపడతాయి. మంచి పోషకాలున్న ఆహారం తీసుకోవడమే కాకుండా మానసిక ఆందోళన నుంచి బయటపడటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మన శరీరంలో జీర్ణ వ్యవస్థ వంటి పలు వ్యవస్థలతో పాటు ఇన్ఫెక్షన్‌లతో పోరాడే వ్యాధి నిరోధక శక్తి కూడా ఉంటుంది. బయట నుంచి దాడి చేసే బ్యాక్టీరియా, వైరస్ (Virus)ల నుంచి రోగనిరోధక వ్యవస్థ మన శరీరాన్ని కాపాడుతుంది. పలు అనారోగ్యాలు, సాధారణ జలుబు నుంచి కోవిడ్ వరకు వివిధ ఇన్ఫెక్షన్లు, అస్వస్ధతలను ఇమ్యూనిటీ ధీటుగా ఎదుర్కొంటుంది. అయితే టీకాలతోనే కాకుండా సహజంగా కూడా ఇమ్యూనిటిని పెంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
- తగినంత నీరు తీసుకోవాలి: శరీరంలో ఇమ్యూనిటీ పెరగాలంటే నీరు ఎక్కువగా తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. కనీసం రోజుకు కనీసం ఏడు గ్లాసుల నీరు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పండ్లు, కూరగాయలు, జ్యూస్, కొబ్బరి నీళ్లు వంటివి తీసుకోవడం వల్ల శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవచ్చు.
- విటమిన్-సి: విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం మంచిదంటున్నారు. స్ట్రాబెర్రీస్, బ్లాక్‌బెర్రీస్, నిమ్మ, బ్రొకోలి, సిట్రస్ పండ్లు, పెప్పర్ వంటి సీ విటమిన్ అధికంగా ఉండే ఆహారంతో ఇమ్యూనిటీ మెరుగవుతుంది.
- ఒత్తిడికి దూరం: ఒత్తిడిని తగ్గించుకోవడం ఇమ్యూనిటీ మెరుగుదలకు అత్యంత కీలకం. ఒత్తిడి అనేది ఇమ్యూనిటీని తీవ్రంగా దెబ్బతిస్తుంది. మానసికంగా బలహీనపరుస్తుంది. యోగ, వ్యాయామం, మంచి ఆహారంతో ఒత్తిడి నుంచి బయటపడవచ్చు.
- నిద్రలేమి: ఇక ప్రతి ఒక్కరికి సరైన నిద్ర అవసరం. సరైన నిద్రలేకపోతే ఇమ్యూనిటీ దెబ్బతింటుంటుంది. కండినిండా నిద్రపోవడం వల్ల ఇమ్యూనిటీ మెరుగ్గా ఉంటుంది.
- చేతుల పరిశుభ్రత: కరోనా మహమ్మారి వ్యాప్తి నేపధ్యంలో చేతులను శుభ్రపర్చుకోవడం ఎంతో ముఖ్యం. ఇన్ఫెక్షన్ల బారినపడకుండా ఉండటంతో పాటు ఇమ్యూనిటీని మెరుగుపరిచేందుకు చేతులను తరచూ శుభ్రం చేసుకోవాలి. అలాగే మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండటం మంచిది. బయటి ఆహారాలు కాకుండా ఇంట్లో వండిన ఆహారాలు తీసుకోవడం మంచిది.
(గమనిక: ఇందులోని అంశాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే వైద్యులను సంప్రదించండి.)
ఇవి కూడా చదవండి: