AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kidneys Health Tips: కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు సులభమైన మార్గాలు

Kidneys Health Tips: ప్రస్తుతం జీవనశైలి మార్పుల కారణంగా ఎన్నో రోగాలు దరి చేరుతున్నాయి. జీవనశైలిలో మార్పులు చేస్తూ ఆహార నియమాలు పాటిస్తే మన ఆరోగ్యాన్ని అదుపులో..

Kidneys Health Tips: కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు సులభమైన మార్గాలు
Subhash Goud
|

Updated on: Mar 11, 2022 | 8:12 PM

Share

Kidneys Health Tips: ప్రస్తుతం జీవనశైలి మార్పుల కారణంగా ఎన్నో రోగాలు దరి చేరుతున్నాయి. జీవనశైలిలో మార్పులు చేస్తూ ఆహార నియమాలు పాటిస్తే మన ఆరోగ్యాన్ని అదుపులో పెట్టుకోవచ్చంటున్నారు నిపుణులు. కిడ్నీలు (Kidneys) వెన్నుముకకు రెండు వైపులా ఒక పిడికిలి పరిమాణంలో చిక్కడు గింజ ఆకాంలో ఉన్న అవయం. ఈ కిడ్నీలు అనేక రకాల విధులు నిర్వహిస్తాయి. ముఖ్యంగా రక్తం నుంచి వ్యర్థ పదార్థాలు, అదనపు నీరు, ఇతర మలినాలను ఫిల్టర్‌ చేయడంతో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఈ వ్యర్థ పదార్థాలు మూత్రాశయంలో నిల్వ చేయబడతాయి. అనంతరం మూత్రం ద్వారా బయటకు పంపుబడతాయి. కిడ్నీలు రక్తపోటును నియంత్రించే రెనిన్‌ హార్మోన్లను ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడానికి ఎరిథ్రోపోయిటిన్‌ను కూడా ఉత్పత్తి చేస్తాయి. ఎముకలను నిర్మించడానికి, కండరాల పనితీరును మెరుగు పర్చడానికి, శరీరం క్యాల్షియంను గ్రహించడంలో సహాయపడే విటమిన్‌ డి రూపాన్ని సక్రియం చేయడానికి మూత్రపిండాలు కూడా ప్రముఖ పాత్ర పోషిస్తాయి.

మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు సులభమైన మార్గాలు:

  1. వ్యాయామం: క్రమం తప్పకుండా వ్యాయమం చేయడం ద్వారా క్రానిక్‌ కిడ్నీ సమస్యను నివారిస్తుంది. వ్యాయమం రక్తపోటును తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది.
  2. మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలి: మధుమేహం ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రక్తంలో చక్కెర స్థాయి పెరిగినట్లయితే కిడ్నీలు దెబ్బతింటాయి. శరీరంలోని కణాలు రక్తంలోని గ్లూకోజ్‌ను నియంత్రించలేకపోతే మూత్ర పిండాలు రక్తాన్ని ఫిల్టర్‌ చేయడానికి ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. అందుకే నిర్లక్ష్యం చేయకుండా మధుమేహం ఉన్నవారు షుగర్‌ లెవల్స్‌ పెరగకుండా చూసుకోవడం మంచిది.
  3. నీరు ఎక్కవుగా తీసుకోవాలి: రోజుకు ఎనిమిది గ్లాసుల నీరు తీసుకోవడం మంచిది. ఎందుకంటే శరీరం హైడ్రేడ్‌గా ఉండడానికి ఎంతగానో సహాయపడుతుంది. శరీరానికి నీరు ఎంతో అవసరం. తగినంత నీరు తీసుకోవడం వల్ల కీడ్నిలు ఆరోగ్యంగా ఉంటాయి. ఒక రోజులో కనీసం 1.5 లీటర్ల నుంచి 2 లీటర్ల వరకు నీరు తీసుకోవడం ఉత్తమం. అలాగే కిడ్నీల్లో రాళ్లు ఉన్నవాళ్లు నీళ్లు ఎక్కువగా తాగడం మంచిది.
  4. అధిక రక్తపోటు: అధిక రక్తపోటు అనేది కిడ్నీలకు హాని కలిగించే అవకాశం ఉంది. మధుమేహం, గుండె జబ్బులు, అధిక కలెస్ట్రాల్‌ వంటి ఇతర సమస్యలు తలెత్తినట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
  5. బరువును నియంత్రించాలి: అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గే విధంగా చూసుకోవాలి. అధిక బరువు, ఊబకాయం ఉన్నవారి కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉంది. వీటిలో మధుమేహం, గుండె జబ్బులు, కిడ్నీ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. సోడియం తక్కువగా ఉన్న ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. కాలీఫ్లవర్‌, బ్లూబెర్రీస్‌, చేపలు, తృణధాన్యాలు వంటివి తీసుకోవడం మంచిది.
  6.  పెయిన్‌ కిల్లర్స్‌ ఔషధాల కారణంగా..: కొందరికి చిటికి మాటికి పెయిన్‌ కిల్లర్స్‌ మందులను వేసుకోవడం అలవాటు ఉంటుంది. దీని కారణంగా కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్‌ని తలనొప్పి లేదా ఆర్థరైటిస్‌ కోసం క్రమం తప్పకుండా తీసుకుంటే మూత్ర పిండాలు దెబ్బతింటాయని నిపుణులు సూచిస్తున్నారు.
  7. ధుమపానానికి దూరంగా..: ధూమపానం అలవాటు ఉన్నవారు దూరంగా ఉండటం మంచిది. ధూమపానం శరీరంలో రక్తనాళాలను దెబ్బతీస్తుంది. ధూమపానం అలవాటు ఉన్నవారి శరీరంలో మూత్ర పిండాల అంతటా రక్తప్రవాహా వేగాన్ని నెమ్మదిస్తుంది. ధూమపానం కారణంగా కిడ్నీల సమస్యతో పాటు క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఎక్కువే.

(గమనిక: ఇందులోని అంశాలన్ని కేవలం అవగాహన కోసం మాత్రమే. వైద్య నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే వైద్యులను సంప్రదించాలి.)

ఇవి కూడా చదవండి:

High Blood Pressure: అధిక రక్తపోటుతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ 5 పదార్థాలతో చెక్ పెట్టండిలా..

Pulses: అతిగా పప్పులు తీసుకుంటున్నారా.. అయితే ఈ సమస్యలు రావొచ్చు..!