Jyotish Tips: భగవంతుడికి నైవేద్యం పెట్టే సమయంలో ఈ తప్పులు చేయవద్దు.. పాటించాల్సిన నియమాలు ఏమిటంటే..

Jyotish Tips in telugu: హిందూ మతంలో.. దేవతలను పూజించే విషయంలో అనేక నియమనిబంధనలున్నాయి. దేవీదేవతల ప్రత్యేక ఆరాధన సమయంలో.. భగవంతుడికి ప్రసాదాన్ని (Prasad related tips) నైవేద్యంగా..

Jyotish Tips: భగవంతుడికి నైవేద్యం పెట్టే సమయంలో ఈ తప్పులు చేయవద్దు.. పాటించాల్సిన నియమాలు ఏమిటంటే..
While Offering Prasad To Go
Follow us
Surya Kala

|

Updated on: Mar 12, 2022 | 9:24 AM

Jyotish Tips in telugu: హిందూ మతంలో.. దేవతలను పూజించే విషయంలో అనేక నియమనిబంధనలున్నాయి. దేవీదేవతల ప్రత్యేక  ఆరాధన సమయంలో.. భగవంతుడికి ప్రసాదాన్ని (Prasad related tips) నైవేద్యంగా సమర్పించడం చాలా పవిత్రంగా పరిగణించబడుతుంది. భగవంతుడు ప్రసాదాన్ని స్వీకరిస్తాడని భావిస్తారు. అందుకనే భగవంతుని ఆరాధనలో నైవేద్యాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. భారతదేశంలో భగవంతుడికి వివిధ రూపాల్లో(Lord worship) నైవేద్యాలు సమర్పిస్తారు.  దేవుడిని ప్రసన్నం చేసుకోవడం కోసం కోరిన కోర్కెలు నెరవేరడం కోసం.. జీవితంలో ఆనందం( Happiness in life) కోసం ఇలా తమకు నచ్చిన దేవుడిని పూజిస్తూ.. దేవతలకు తమకు నచ్చిన నైవేద్యాన్ని సమర్పిస్తారు. అయితే ఇలా దేవుడికి ప్రసాదం సమర్పించేటప్పుడు చాలా ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి. నైవేద్యం సమర్పించే విషయంలో కొన్ని నియమాలను కూడా ఏర్పరిచారు. అయినప్పటికీ చాలామంది ప్రజలు ఆహారాన్ని అందించే సమయంలో చాలా తప్పులు చేస్తారు. ఈ తప్పిదాల వలన దేవుడి నిరాదరణకు గురికావాల్సి వస్తుందని అంటున్నారు. నైవేద్యం పెట్టె విషయంలో భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. నియమాల గురించి ఈరోజు తెలుసుకుందాం..

  1. ప్రసాదం తయారీలో నూనె: ఈ రోజుల్లో చాలా మంది దేవుడికి సమర్పించే నైవేద్యాలను నూనెతో ఎక్కువగా తయారు చేయడం మొదలుపెట్టారు. జ్యోతిష్య శాస్త్రం, దేవుడికి నెయ్యితో చేసిన వస్తువులను నైవేద్యంగా సమర్పించాలని పేర్కొంది. అలాగే మిరపకాయలతో కూడిన వస్తువులను దేవుడికి ప్రసాదంగా సమర్పించకూడదు. ఈ పొరపాటు ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. కనుక ప్రసాదం తయారీకి ఎల్లప్పుడూ నెయ్యిని ఉపయోగించండి.
  2. ఈ తప్పు చేయవద్దు: దేవుడికి భక్తితో నైవేధ్యాన్ని సమర్పిస్తారు. అయితే కొన్ని సార్లు దేవుడికి ఆహారపదార్ధాలను నైవేద్యంగా సమర్పించి.. వెంటనే వాటిని అక్కడ నుంచి తీసివేస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, భగవంతుని ముందు ఉన్న నైవేద్యాన్ని అలా వెంటనే తొలగించడం అశుభం. ఆహారపదార్ధాలను, పండ్లను, ఇలా ఏ పదార్ధాలను నైవేద్యంగా  సమర్పించినా.. వెంటనే అక్కడ నుంచి కొంతసేపు అక్కడ నుంచి వెళ్లాలని..  కొంత సమయం తర్వాత, దేవునికి నమస్కరిస్తూ, భగవంతుని ముందు నుండి నైవేద్యంగా సమర్పించిన  వస్తువులను తీసుకోవాలని సూచించారు.
  3. తులసిని సమర్పించవద్దు: శివుడికి పూజ చేసేటప్పుడు తులసి ఆకులను సమర్పిస్తుంటారు. తులసి ఆకులను శివునికి, గణేశుడికి సమర్పించకూడదని చెబుతారు. శివుడిని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే.. ఎల్లప్పుడూ బిల్వ పత్రాలను సమర్పించండి.. అదే సమయంలో.. గణేశుడికి దర్భలను సమర్పించండి.
  4. ఆవుకు ఆహారం: వండిన ఆహారాన్ని మాత్రమే దేవునికి సమర్పించాలి. అయితే అలా దేవుడికి నైవేద్యం సమర్పించిన తర్వాత, మీరు ఈ ప్రసాదాన్ని స్వీకరించకండి, అయితే ముందుగా ఈ ప్రసాదాన్ని ఆవుకి పెట్టడం మేలు చేస్తుంది. ఆవుకి నైవేద్యం పెట్టిన అనంతరం ఆ ఆహారాన్ని ప్రసాదంగా తీసుకోండి. ఆవుకు ఆహారం అందించడం ద్వారా సమస్త దేవతలు చాలా సంతోషిస్తారని.. ఆ దేవతల అనుగ్రహం భక్తులపై ఉంటుందని చెబుతారు.

విజయానికి చేరువలో ఉన్నాం.. ఉక్రెయిన్ సంచలన ప్రకటన..(వీడియో)