PUNJ’AAP’: పంజాబ్‌లో ఆప్ ప్రభంజనం.. కేజ్రీవాల్ పార్టీకి కలిసొచ్చిన ఆరు కీలక అంశాలివే..

Punjab Election Result: పంజాబ్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభంజనం సృష్టించింది. ప్రత్యర్థి పార్టీలను చిత్తు చేస్తూ.. మొత్తంగా ఊడ్చేసింది చీపురు పార్టీ. 92 స్థానాల్లో విజయఢంకా మోగించింది.

PUNJ'AAP':  పంజాబ్‌లో ఆప్ ప్రభంజనం.. కేజ్రీవాల్ పార్టీకి కలిసొచ్చిన ఆరు కీలక అంశాలివే..
AAP
Follow us
Janardhan Veluru

|

Updated on: Mar 12, 2022 | 10:37 AM

Punjab Election Result 2022: పంజాబ్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభంజనం సృష్టించింది. ప్రత్యర్థి పార్టీలను చిత్తు చేస్తూ.. మొత్తంగా ఊడ్చేసింది చీపురు పార్టీ. 92 స్థానాల్లో విజయఢంకా మోగించింది. ఏళ్లుగా అధికారం పంచుకుంటున్న రెండు పార్టీలకు.. గట్టి షాక్‌ ఇచ్చింది. పంజాబ్‌ సీఎం పీఠంపై ఆమ్‌ ఆద్మీ భగవంత్‌ సింగ్‌ మాన్‌.. ఈ నెల 16న పంజాబ్ కొత్త సీఎంగా కొలువుదీరనున్నారు. కౌంటింగ్‌ మొదలైన క్షణం నుంచే దూకుడు కనబర్చింది ఆమ్‌ ఆద్మీ పార్టీ. మొత్తంగా 42శాతం ఓటింగ్‌ సాధించిన ఆ పార్టీ.. 92 స్థానాలు సాధించి చరిత్ర సృష్టించింది. అధికార కాంగ్రెస్ 22శాతం ఓటింగ్‌తో 18 స్థానాలకు పరిమితమైంది. రాష్ట్రంలో వేళ్లూనుకున్న అకాలీదళ్‌.. కేవలం 4 స్థానాల్లోనే విజయం సాధించింది. ఇక, పంజాబ్‌లో ఏదో చేసేద్దామనుకున్న బీజేపీకి నిరాశ తప్పలేదు. రెండంటే రెండు స్థానాలకే పరిమితమయ్యింది. కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ పార్టీతో పొత్తు పెట్టుకున్న కాషాయ పార్టీ.. ఆరుశాతం ఓటింగ్‌ మాత్రమే సంపాదించ గలిగింది.

పంజాబ్‌లో పాగా వేసిన ఆప్‌కు.. ఈ ఎన్నికల్లో చాలా అంశాలు కలిసొచ్చాయి. అందుకే, ఢిల్లీ రిజల్ట్స్‌ను ఇక్కడ కూడా రిపీట్‌ చేసింది కేజ్రీవాల్‌ పార్టీ. ఆప్‌కి పంజాబ్‌లో కలిసొచ్చిన అంశాలేంటో ఒకసారి చూద్దాం.. 

  1. ఆప్‌కు కలిసొచ్చిన అంశాల్లో ఒకటి.. కాంగ్రెస్‌లో కుమ్ములాటలు. సీఎంగా కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ను తొలగించడంతో మొదలైన ఇంటర్నల్‌ ఇష్యూస్‌.. కాంగ్రెస్‌ను బాగా దెబ్బకొట్టాయి. దళితుడు చన్నీని సీఎం చేసినా ఫలితం దక్కలేదు. నేతల మధ్య సయోధ్య కుదర్లేదు. ఇలాంటి పరిస్థితిని ఆమ్‌ ఆద్మీ పార్టీ చక్కగా క్యాష్‌ చేసుకుంది. తనపని తాను చేసుకుపోయింది.
  2. ఇక రెండోది.. బీజేపీ, అకాలీదళ్‌ విడివిడిగా పోటీ చేయడం.. గతంలో కలిసి పనిచేసిన బీజేపీ, అకాళీదళ్‌.. ఈ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేయడం.. ఆప్‌ విజయావకాశాల్ని మరింత ఈజీ చేసింది. ఓట్లను భారీగా చీల్చి.. ఆమ్ ఆద్మీ పార్టీకి మేలు చేసింది.
  3. ఇక మూడో అంశం.. ఢిల్లీ మోడల్‌ పాలన.. ఢిల్లీ మోడల్‌ పాలన అందిస్తామన్న ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌ హామీ.. ఈ ఎన్నికల్లో బాగానే పనిచేసింది. కేజ్రీవాల్‌ ప్రకటనపై… పంజాబ్‌ ప్రజలు విశ్వాసం వ్యక్తం చేసినట్టు ఈ ఫలితాలతో స్పష్టమవుతోంది.
  4. ఇక, ఆప్‌కు కలిసొచ్చిన మరో అంశం.. వ్యవసాయ చట్టాలపై రైతుల పోరాటం. బీజేపీ నేతృత్వంలోని కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు కూడా… ఆప్‌ గెలిచేందుకు కారణమయ్యాయి. వాటికి వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేసిన పోరాటానికి ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. వారికి ఇబ్బందులు తలెత్తకుండా.. తన పరిధిలో చర్యలు తీసుకుని.. రైతుల మనసు గెలుచుకోవడం కేజ్రీవాల్‌ సఫలీకృతమయ్యారు. ఆ ఎఫెక్ట్‌ కూడా ఈ ఎన్నికల్లో చూపినట్టు స్పష్టం కనిపిస్తోంది.
  5. గత ఎన్నికల్లో ఓడిపోయిన సింపతీ ఫ్యాక్టర్ కూడా ఆప్‌పై ఈసారి బాగా పనిచేసింది. 2017 ఎన్నికల్లో… 20 సీట్లు సాధించి.. కాంగ్రెస్‌కు గట్టి పోటీయే ఇచ్చింది ఆమ్‌ ఆద్మీ పార్టీ. ఈసారి ఏకంగా అధికారాన్ని చేజిక్కించుకుంది.
  6. అలాగే పంజాబ్‌ మాజీ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ కాంగ్రెస్‌ పార్టీని వీడి కొత్త పార్టీ పెట్టడం కూడా ఆప్‌ విజయానికి కలిసొచ్చిందని చెప్పొచ్చు. ఆయన బీజేపీతో కలవడం .. ఆప్‌కు మరింత ప్లస్‌ అయ్యింది. కాంగ్రెస్ ఓట్లు బాగా చీలిపోయాయి.

Also Read..

Tirupati: తల్లి కన్నుమూసిందని తెలియక.. 4 రోజులుగా పాఠశాలకు వెళుతూ.. తిరుపతిలో హృదయ విదారక ఘటన..

Nagendra Babu: తగ్గేదే లే అంటున్న మెగా హీరో.. కొడుక్కి గట్టిపోటీ అంటున్న మెగా ఫ్యాన్స్.. ట్రెండ్ అవుతున్న నాగబాబు ఫొటోస్..