మేకల గండి డెత్‌స్పాట్‌లో మృత్యుఘోష.. కారు అదుపుతప్పి ఐదుగురు మృతి

డెత్ స్పాట్ గా ఉన్న మేకలగండి వద్ద గతంలో పలు ప్రమాదాలు చోటు చేసుకోగా గత ఏడాది ఆదిలాబాద్ కు చెందిన ఓ కుటుంబం కూడా ఇదే మూలమలుపు వద్ద బలైంది. తాజాగా డెత్ స్పాట్ వద్ద ఆదిలాబాద్ కు చెందిన జాహెద్ కుటుంబం సైతం ఐదుగురిని కోల్పోయింది.

మేకల గండి డెత్‌స్పాట్‌లో మృత్యుఘోష..  కారు అదుపుతప్పి ఐదుగురు మృతి
Accident
Follow us

| Edited By: Jyothi Gadda

Updated on: Oct 01, 2024 | 1:01 PM

మరో 15 నిమిషాల్లో‌ గమ్యస్థానం చేరుతారనుకునే సమయంలో మృత్యువు కబలించింది. శుభకార్యానికి వెళ్లి, ఇంటికి తిరిగి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం ఓ కుటుంబాన్ని మింగేసింది. డెత్ స్పాట్ గా పేరున్న మూల మలుపు వద్ద ఒక్కసారి వాహనం డివైడర్లను రాసుకుంటూ వెళ్లి ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రగాయాల పాలై చికిత్స పొందుతూ మరొకరు మృతిచెందారు. ఈ విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ జాతీయ రహదారి 44 పై చోటు చేసుకుంది. డెత్ స్పాట్ మేకల మండి.. ఈసారి 5 గురిని పొట్టన పెట్టుకుంది.

ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ ఎన్ హెచ్ 44 పై ఘోర రోడ్డు‌ప్రమాదం చోటు చేసుకుంది. మదర్సాలో మనువడి విద్యాబ్యాసం ముగిసిన శుభసమయంలో బైంసాలో కుటుంబ సభ్యులతో ఆనందంగా వేడుక చేసుకుని ఇంటికి బయలు దేరిన జాహేద్ కుటుంబం మరో 15 నిమిషాల్లో ఇంటికి చేరుకుంటాం అనేలోగా వేగం రూపంలో దూసుకొచ్చిన మృత్యువు.. కుటుంబానికి కుటుంబాన్నే మింగేసింది. ఆదిలాబాద్ జిల్లా టీచర్స్ కాలనీలో నివాసం ఉంటున్న ఇచ్చోడ మండల కేంద్రంలోని బార్కత్ పూర కాలనీకి చెందిన జహేద్ కుటుంబం ఈ రోడ్డు ప్రమాదంలో బలైంది. బైంసా నుండి తిరిగి ఆదిలాబాద్ కు‌ వస్తుండగా అర్థరాత్రి 11:30 సమయంలో గుడిహత్నూర్ మండలం సీత గొంది మేకలగండి వద్ద 44వ జాతీయ రహదారిపై వారు ప్రయాణిస్తున్న డీ మాక్స్ వాహనం అదుపుతప్పి సైడ్ పిల్లర్ ను ఢీకొట్టి అంతే వేగంతో పల్టీలో కొట్టి పక్కనే ఉన్న కొండను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న 8 మందిలో మోహిజుద్దిన్ ( 60 ) , మోహినుద్దిన్ ( 40 ) , అలీ ( 8 ) , హుస్మానుద్దిన్ ( 10 ) అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రగాయాల పాలైన ఫారీద్ ( 12) , అయేషా ( 37 ) , ఇక్వార్ ( 6 ) షాద్ ( 8 ) లను రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఇందులో ఒకరు చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి‌చెందారు.

ప్రమాదంలో తండ్రి, ఇద్దరు కుమారులు మృతి చెందిన దృశ్యాలు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించాయి. జహేద్ గతంలో హైదరాబాద్ లో ఉంటూ, రిలయన్స్ కంపెనీ లో ఇంజనీరుగా విధులు నిర్వహించారు. కరోనా లాక్ డౌన్ అనంతరం బతుకుదెరువు కోసం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చి ఎలక్ట్రిక్ షాప్ నిర్వహిస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. ఊహించని ప్రమాదంతో కుటుంబాలని ఐదుగురు ప్రాణాలు విడవడంతో విషాదంలో మునిగిపోయారు బందువులు‌. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై చికిత్స పొందుతున్న ముగ్గురిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు రిమ్స్ వైద్యులు తెలిపారు. డెత్ స్పాట్ గా ఉన్న మేకలగండి వద్ద గతంలో పలు ప్రమాదాలు చోటు చేసుకోగా గత ఏడాది ఆదిలాబాద్ కు చెందిన ఓ కుటుంబం కూడా ఇదే మూలమలుపు వద్ద బలైంది. తాజాగా డెత్ స్పాట్ వద్ద ఆదిలాబాద్ కు చెందిన జాహెద్ కుటుంబం సైతం ఐదుగురిని కోల్పోయింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

భారత్ బ్రాండ్ రెండవ దశ విక్రయాలు ప్రారంభం
భారత్ బ్రాండ్ రెండవ దశ విక్రయాలు ప్రారంభం
విమానం బ్రేక్‌లు ఎలా పని చేస్తాయి? అంతవేగం ఎలా కంట్రోల్‌ అవుతుంది
విమానం బ్రేక్‌లు ఎలా పని చేస్తాయి? అంతవేగం ఎలా కంట్రోల్‌ అవుతుంది
ఇదేం లొల్లి పంచాయతీరా సామీ.!నడిరోడ్డుపై రెచ్చిపోయి కొట్టుకున్నారు
ఇదేం లొల్లి పంచాయతీరా సామీ.!నడిరోడ్డుపై రెచ్చిపోయి కొట్టుకున్నారు
కలలో ఇవి కనిపిస్తున్నాయా.? అదృష్టం తలుపు కొట్టబోతున్నట్లే..
కలలో ఇవి కనిపిస్తున్నాయా.? అదృష్టం తలుపు కొట్టబోతున్నట్లే..
కమలా హారిస్‌ గెలుపు కోసం ప్రత్యేక పూజలు..11 రోజులుగా యజ్ఞం..
కమలా హారిస్‌ గెలుపు కోసం ప్రత్యేక పూజలు..11 రోజులుగా యజ్ఞం..
పీరియడ్స్ నొప్పిని చిటికెలో తగ్గించాలంటే ఈ చిట్కాలు బెస్ట్..
పీరియడ్స్ నొప్పిని చిటికెలో తగ్గించాలంటే ఈ చిట్కాలు బెస్ట్..
ప్రజా సంఘాలు, బీసీ నేతలతో రాహుల్‌ గాంధీ భేటీ.. లైవ్ వీడియో
ప్రజా సంఘాలు, బీసీ నేతలతో రాహుల్‌ గాంధీ భేటీ.. లైవ్ వీడియో
వార్నీ.. ఈ గుర్రమేంటీ ఇలా ఈడ్చితన్నేసింది..! పాపం అమ్మాయిలు
వార్నీ.. ఈ గుర్రమేంటీ ఇలా ఈడ్చితన్నేసింది..! పాపం అమ్మాయిలు
8 రోజుల్లో 6 వన్డేలు.. 12 వికెట్లతో 16 ఏళ్ల బౌలర్ ఊచకోత
8 రోజుల్లో 6 వన్డేలు.. 12 వికెట్లతో 16 ఏళ్ల బౌలర్ ఊచకోత
ఈ ఐడియా నిజంగానే మీ జీవితాన్ని మార్చేస్తుంది.. సూపర్ బిజినెస్
ఈ ఐడియా నిజంగానే మీ జీవితాన్ని మార్చేస్తుంది.. సూపర్ బిజినెస్
ప్రజా సంఘాలు, బీసీ నేతలతో రాహుల్‌ గాంధీ భేటీ.. లైవ్ వీడియో
ప్రజా సంఘాలు, బీసీ నేతలతో రాహుల్‌ గాంధీ భేటీ.. లైవ్ వీడియో
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!