మణికొండ పుప్పాలగూడలో థార్ కారు బీభత్సం..మద్యం మత్తులో కారు నడిపిన యువకులు! వీడియో వైరల్‌

నలుగురు యువకులు మద్యం మత్తులో ఉన్నట్టుగా స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదానికి కారణమైన నలుగురిని స్థానికులు చితకబాదారు. అనంతరం కారు అద్దాలను ధ్వంసం చేశారు. కారులో ఉన్న యువకులు అక్కడున్న ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేశారు..

మణికొండ పుప్పాలగూడలో థార్ కారు బీభత్సం..మద్యం మత్తులో కారు నడిపిన యువకులు!  వీడియో వైరల్‌
Thar Car Accident
Follow us

|

Updated on: Oct 01, 2024 | 12:32 PM

మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పుప్పాలగూడలో థార్ కారు బీభత్సం సృష్టించింది. పుప్పాలగూడలోని రంగనాథ స్వామి దేవాలయం దగ్గర కొందరు యువకులు ఉదయం 6 గంటల నుండే మద్యం సేవిస్తుండగా, అక్కడి స్థానికులు వారిని ప్రశ్నించారు. దాంతో మద్యం సేవిస్తున్న యువకులు స్థానికులతో వాగ్వాదానికి దిగినట్టుగా తెలిసింది. స్థానికులు పెద్ద సంఖ్యలో గుమిగూడడంతో యువకులు కారులో పారిపోయేందుకు ప్రయత్నించారు.

ఈ క్రమంలోనే కారు వేగంగా వెళ్లి పార్క్ చేసి ఉన్న రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది. ఈ వాహనంలో ఉన్న నలుగురు యువకులు మద్యం మత్తులో ఉన్నట్టుగా స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదానికి కారణమైన నలుగురిని స్థానికులు చితకబాదారు. అనంతరం కారు అద్దాలను ధ్వంసం చేశారు. కారులో ఉన్న యువకులు అక్కడున్న ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేశారు..

ఈ వీడియో చూడండి..

ఇవి కూడా చదవండి

ఇరువర్గాల మధ్య తీవ్ర గొడవ జరిగింది. అయితే సమాచారం అందుకున్న పోలీసులు అప్పుడే అక్కడికి చేరుకుని పోకిరి యువకులను పట్టుకుని పోలిస్ స్టేషన్ కు తరలించారు..అన్నతరం కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..