Watch: మెట్రోలో మరో వివాదం..! ఓ వ్యక్తిపై ఇద్దరు యువకుల దాడి.. కారణం ఏంటంటే..

మెట్రోలో ఇద్దరు యువకులు ఓ వ్యక్తిపై దాడి చేసిన షాకింగ్‌ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో ప్రకారం ఇద్దరు యువకులతో ఓ వ్యక్తికి వాగ్వాదం జరిగింది. దీంతో సదరు ప్రయాణికుడు ఆ కుర్రాళ్లను..

Follow us

|

Updated on: Oct 01, 2024 | 11:56 AM

ఇటీవల ఢిల్లీ మెట్రో తరచూ ఏదో ఒక ఘటనతో వార్తల్లో నిలుస్తోంది. ఢిల్లీ మెట్రోలో తరచూ తగాదాలు, గొడవలు జరుగుతూనే ఉన్నాయి. చాలా సార్లు దాని వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. తాజాగా మరోసారి ఢిల్లీ మెట్రోలో జరిగిన రచ్చకు సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ మెట్రోలో ఇద్దరు యువకులు ఓ వ్యక్తిపై దాడి చేసిన షాకింగ్‌ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో ప్రకారం ఇద్దరు యువకులతో ఓ వ్యక్తికి వాగ్వాదం జరిగింది. దీంతో సదరు ప్రయాణికుడు ఆ కుర్రాళ్లను దుర్భాషలాడారు. దీంతో సహనం కోల్పోయిన ఆ కుర్రాళ్ళు ఆ వ్యక్తిని పలుమార్లు చెంప దెబ్బ కొట్టారు. వెంటనే తోటి ప్రయాణికులు వారికి సర్ది చెప్పడంతో గొడవ సద్దుమనిగింది. ఈ ఘటన ఎప్పుడు జరిగిందో తెలియరాలేదు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..