Boy Kidnapped: ఆరేళ్లప్పుడు కిడ్నాపయ్యాడు.. 70 ఏళ్ల తర్వాత ఊహించని క్షణాలు.!

Boy Kidnapped: ఆరేళ్లప్పుడు కిడ్నాపయ్యాడు.. 70 ఏళ్ల తర్వాత ఊహించని క్షణాలు.!

Anil kumar poka

|

Updated on: Oct 01, 2024 | 11:06 AM

కొన్నిసార్లు వస్తువులను లేదా వ్యక్తులను పోగొట్టుకుంటాం. వాటి ఆచూకీ కోసం ఏళ్ల తరబడి ఆశగా ఎదురుచూస్తాం. చివరికి ఆశలన్నీ ఆవిరై ఇక దొరకదు అనే నైరాశ్యంలో ఉండగా ఏదో అద్భుతం జరిగినట్టుగా ఆ వ్యక్తి లేదా ఆ వస్తువు మనకు లభిస్తే ఆ ఆనందం మాటలకందనిది. అలాంటి కథే అల్బినో ‍కథ.! కాలిఫోర్నియాకి చెందిన అల్బినో ఫిబ్రవరి 21, 1951న తన పదేళ్ల సోదరుడు రోజర్‌తో కలిసి ఆడుకుంటుండగా తప్పిపోయాడు.

కొన్నిసార్లు వస్తువులను లేదా వ్యక్తులను పోగొట్టుకుంటాం. వాటి ఆచూకీ కోసం ఏళ్ల తరబడి ఆశగా ఎదురుచూస్తాం. చివరికి ఆశలన్నీ ఆవిరై ఇక దొరకదు అనే నైరాశ్యంలో ఉండగా ఏదో అద్భుతం జరిగినట్టుగా ఆ వ్యక్తి లేదా ఆ వస్తువు మనకు లభిస్తే ఆ ఆనందం మాటలకందనిది. అలాంటి కథే అల్బినో ‍కథ.! కాలిఫోర్నియాకి చెందిన అల్బినో ఫిబ్రవరి 21, 1951న తన పదేళ్ల సోదరుడు రోజర్‌తో కలిసి ఆడుకుంటుండగా తప్పిపోయాడు. ఓ అపరిచిత మహిళ స్వీట్లు ఇస్తానని ఆశచూపి ఎత్తుకుపోయింది. అలా కిడ్నాప్‌కి గురైన అల్బినో ఆచూకీ అంతు చిక్కని మిస్టరీలా ఉండిపోయింది. ఏళ్లకు ఏళ్లు గడిచిపోతున్నాయే తప్ప.. అల్బినో ఆచూకీ గురించి మచ్చుకైనా కేసు ముందుకు సాగలేదు

అతడి కోసం ఎదురుచూసి అతడి తల్లి 92 ఏళ్ల వయసులో కన్నుమూసింది. అయితే అల్బినో మేనకోడలు అలిడా మాత్రం తన మామ అల్బినో ఆచూకీని ఎలాగైన కనిపెట్టాలని ఎంతోగానో తపనపడింది. అందుకోసం నాడు కిడ్నాప్‌ అయ్యినట్లు ఇచ్చిన పేపర్‌ యాడ్‌లు, ఫోటోలను సేకరించి మరీ అన్వేషణ సాగించింది. డీఎన్‌ఏ పరీక్షలు వంటి ప్రత్యామ్నాయాలతో తీవ్రంగా వెతకడం ప్రారంభించింది. ఎట్టకేలకు మామ అల్బినో ఆచూకిని కనుక్కొంది. అతడు రిటైర్డ్‌ అగ్నిమాపక సిబ్బంది, మెరైన్‌ కార్ప్స్‌ నిపుణుడని తెలుసుకుంది.

అతని డీఎన్‌తో తన కుటుంబ సభ్యుల డీఎన్‌ఏ 22% సరిపోలడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా చేసింది. వెంటనే అలిడా తన మామ అల్బినోను కుటుంబ సభ్యులతో కలిపింది. అల్బినో సరిగ్గా తన సోదరుడు రోజర్‌ ను 82వ ఏట కలుసుకున్నాడు. అతడు కేన్సర్‌తో బాధపడుతున్నట్లు తెలిసి ఆవేదన చెందాడు. అయితే మరణానికి ముందు ఇలా తప్పిపోయిన తన తమ్ముడిని కలుసుకోవడం తనకెంతో సంతోషాన్నిచ్చిందంటూ రోజర్‌ భావోద్వేగానికి గురయ్యాడు. ఇద్దరూ తమ చిన్నప్పటి జ్ఞాపకాలను పంచుకున్నారు. ఈ మధుర క్షణం కోసం అలిడా ఎంతగా తపించిందంటే..స్థానిక లైబ్రరీలలో వార్తాపత్రికల ఆర్కైవ్‌లు, అణువణువు జల్లెడ పట్టింది. చివరికి ఆల్బినో చిత్రాలను కనిపెట్టి.. దశాబ్దాల నాటి మిస్టరీని చేధించింది. తన మామ అల్బినోని అలా తన కుటుంబంతో కలిపింది ఆయన మేనకోడలు అలిడా.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.