China Ballistic: అమ్మో.. అన్ని అణు బాంబులే.! చైనా ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగం.!

చైనా సైన్యం ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు తొలిసారి బహిరంగ ప్రకటన చేసింది. బుధవారం ఉదయం పసిఫిక్‌ మహాసముద్రంలోని అంతర్జాతీయ జలాల్లోని లక్ష్యం పైకి దానిని ప్రయోగించినట్లు తెలిపింది. ఇటీవల కాలంలో బీజింగ్‌ అణ్వాయుధాల సంఖ్యను గణనీయంగా పెంచుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి. దాంతో తాజా పరీక్ష ఆందోళనకరంగా మారింది.

China Ballistic: అమ్మో.. అన్ని అణు బాంబులే.! చైనా ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగం.!

|

Updated on: Oct 01, 2024 | 12:06 PM

చైనా సైన్యం ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు తొలిసారి బహిరంగ ప్రకటన చేసింది. బుధవారం ఉదయం పసిఫిక్‌ మహాసముద్రంలోని అంతర్జాతీయ జలాల్లోని లక్ష్యం పైకి దానిని ప్రయోగించినట్లు తెలిపింది. ఇటీవల కాలంలో బీజింగ్‌ అణ్వాయుధాల సంఖ్యను గణనీయంగా పెంచుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి. దాంతో తాజా పరీక్ష ఆందోళనకరంగా మారింది.

పీఎల్‌ఏ రాకెట్‌ ఫోర్స్‌ ఈ ఖండాంతర క్షిపణి డమ్మీ వార్‌హెడ్‌ను అమర్చి స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8.44కు ప్రయోగించింది. ముందుగా నిర్ణయించిన లక్ష్యానికి ఇది చేరుకుంది. ఈ విషయాన్ని చైనా రక్షణ మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. తమ వార్షిక శిక్షణ ప్రణాళికల్లో ఇది సాధారణంగా జరిగే విషయమేనని చెప్పింది. తమ ఖండాంతర క్షిపణి ప్రయోగ వివరాలను కొన్ని దేశాలు ఆందోళన చెందకుండా ముందే సమాచారం అందించినట్లు షినూవా న్యూస్‌ ఏజెన్సీ రిపోర్టు చేసింది. అదే సమయంలో పసిఫిక్‌ సముద్రంలో ఆ మిసైల్‌ ప్రయాణించిన మార్గాన్ని మాత్రం బీజింగ్‌ బయటపెట్టలేదు. తమ దళాల శిక్షణ, ఆయుధశక్తి, నిర్ణీత లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం వంటి అంశాలను విశ్లేషించేందుకు ఇది ఉపయోగపడిందన్నారు.

ప్రస్తుతం పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ రాకెట్‌ ఫోర్స్‌ అధీనంలో సంప్రదాయ అణు క్షిపణులు ఉన్నాయి. తాజాగా దీనిని ఆధునికీకరించేందుకు చర్యలు తీసుకుంది. ముఖ్యంగా అమెరికాలోని మిసైల్‌ డిఫెన్స్‌ వ్యవస్థలు, నిఘా సామర్థ్యాలు వంటివి సంతరించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం చైనా అణుసామర్థ్యాలను ‘క్రెడిబుల్‌ మినిమమ్‌ డిటరెన్స్‌’ స్థాయిని మించిపోయాయని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు డ్రాగన్‌ మాత్రం అంతకుముందు అణ్వస్త్రాల వినియోగానికి తాను వ్యతిరేకమని తెలిపింది. ప్రస్తుతం చైనా మిలటరీ కమిషన్‌ అధ్యక్షుడి హోదాలో జిన్‌పింగ్‌కు మాత్రమే అణుదాడిని ఆమోదించే శక్తి ఉంది. బీజింగ్‌ అమ్ములపొదిలో దాదాపు 500 అణు వార్‌హెడ్‌లు ఉన్నాయి. దీంతోపాటు 350 ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణులు ఐసీబీఎంలు ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. 2030 నాటికి అణు వార్‌హెడ్‌ల సంఖ్య 1,000 దాటి పోవచ్చని అమెరికాలోని పెంటగాన్‌ అంచనా వేసింది. భూఉపరితలం పైకి ప్రయోగించే ఐసీబీఎంల కోసం ఇప్పటికే వందల సంఖ్యలో క్షిపణి ప్రయోగ బొరియలను చైనా నిర్మించడం మొదలుపెట్టింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
లాక్‌డౌన్ ఎఫెక్ట్.. చంద్రుడిపై గణనీయంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.!
లాక్‌డౌన్ ఎఫెక్ట్.. చంద్రుడిపై గణనీయంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.!
గ్యాస్‌ వినియోగదారులకు మరోసారి షాక్‌.! ధర పెంచుతూ ప్రకటన..
గ్యాస్‌ వినియోగదారులకు మరోసారి షాక్‌.! ధర పెంచుతూ ప్రకటన..
యూట్యూబర్‌ హర్షసాయి కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు.! అరెస్ట్‌.?
యూట్యూబర్‌ హర్షసాయి కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు.! అరెస్ట్‌.?
హిట్టా.? ఫట్టా.? ఈ సినిమాతో శ్రీవిష్ణు నిలిచి గెలిచాడా.!
హిట్టా.? ఫట్టా.? ఈ సినిమాతో శ్రీవిష్ణు నిలిచి గెలిచాడా.!
ఆ రూ.500 నోట్లపై బాలీవుడ్‌ నటుడు అనుప‌మ్ ఖేర్ ఫోటో.! వైరల్..
ఆ రూ.500 నోట్లపై బాలీవుడ్‌ నటుడు అనుప‌మ్ ఖేర్ ఫోటో.! వైరల్..
ఇది మామూలు ఆవు కాదు.. ఒకే ఈతలో ఎన్ని దూడలకు జన్మనిచ్చిందో తెలుసా!
ఇది మామూలు ఆవు కాదు.. ఒకే ఈతలో ఎన్ని దూడలకు జన్మనిచ్చిందో తెలుసా!
అమెరికా వెళ్లానుకునే వారికి గుడ్‌ న్యూస్‌.! 2.5 లక్షల వీసాలు.
అమెరికా వెళ్లానుకునే వారికి గుడ్‌ న్యూస్‌.! 2.5 లక్షల వీసాలు.
అన్ని సేవలకు ఇక ఒకే కార్డు.. ఫ్యామిలీ డిజిటల్‌ కార్డు.!
అన్ని సేవలకు ఇక ఒకే కార్డు.. ఫ్యామిలీ డిజిటల్‌ కార్డు.!
నీలి చిత్రాల్లో నటించే భామ రెజ్యూమ్.. అయినా 29 ఇంటర్వ్యూ కాల్స్‌.
నీలి చిత్రాల్లో నటించే భామ రెజ్యూమ్.. అయినా 29 ఇంటర్వ్యూ కాల్స్‌.
జనం కోసం 125 మొసళ్లను ఏం చేశాడంటే.? పాపం మూగజీవాలు..
జనం కోసం 125 మొసళ్లను ఏం చేశాడంటే.? పాపం మూగజీవాలు..