Cat Viral: ఇది మామూలు పిల్లి కాదు.! 1000 మైళ్ల దూరంలోని ఇంటికి..

Cat Viral: ఇది మామూలు పిల్లి కాదు.! 1000 మైళ్ల దూరంలోని ఇంటికి..

Anil kumar poka

|

Updated on: Oct 01, 2024 | 9:51 AM

పెంపుడు జంతువులంటే ఎంతో విశ్వాసంగా ఉంటాయి. ఎంత దూరం వెళ్లినా తిరిగి తమ ఇళ్లకు చేరి ఆశ్చర్యపరుస్తుంటాయి. కానీ ఏకంగా ఎన్నో మైళ్ల దూరాన తప్పిపోయిన ఓ పెంపుడు పిల్లి ఒక రకంగా చరిత్రే సృష్టించింది. అక్షరాలా వెయ్యి మైళ్లు వెనక్కు ప్రయాణించి మరీ రెండు నెలల తరవాత ఇల్లు చేరింది! ప్రాణప్రదమైన పిల్లి తిరిగి రావడంతో యజమానుల ఆనందానికి హద్దుల్లేవు.

పెంపుడు జంతువులంటే ఎంతో విశ్వాసంగా ఉంటాయి. ఎంత దూరం వెళ్లినా తిరిగి తమ ఇళ్లకు చేరి ఆశ్చర్యపరుస్తుంటాయి. కానీ ఏకంగా ఎన్నో మైళ్ల దూరాన తప్పిపోయిన ఓ పెంపుడు పిల్లి ఒక రకంగా చరిత్రే సృష్టించింది. అక్షరాలా వెయ్యి మైళ్లు వెనక్కు ప్రయాణించి మరీ రెండు నెలల తరవాత ఇల్లు చేరింది! ప్రాణప్రదమైన పిల్లి తిరిగి రావడంతో యజమానుల ఆనందానికి హద్దుల్లేవు. కాలిఫోర్నియాలోని సాలినాస్‌కు చెందిన సుసానే, బెన్నీ దంపతులకు రెండున్నరేళ్ల పిల్లి ఉంది. ముద్దుగా రెయిన్‌బో అని పిలుచుకునేవారు. జూన్‌ 4న పిల్లితో పాటు ఎల్లో స్టోన్‌ పార్కుకు వెళ్లారు. ఏమైందో గానీ పిల్లి ఉన్నట్టుండి భయపడి పారిపోయింది. ఎంత పిలిచినా వెనక్కి తిరిగి కూడా చూడకుండా పరుగు తీసింది. రోజుల తరబడి వెదికినా లాభం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి తిరిగొచ్చారు. నెల తర్వాత మరో పిల్లిని దత్తత తీసుకున్నారు. 61 రోజుల తర్వాత 190 మైళ్ల దూరంలోని రోజ్‌విల్లేలో దాన్ని గుర్తించారు. దాంతో దంపతులిద్దరూ పరుగెత్తుకుని వెళ్లి దాన్ని ఇంటికి తెచ్చుకున్నారు. తాము వెళ్లేసరికి ఆరోగ్యం పాడై ఆస్పత్రిలో చికిత్స పొందుతోందనీ లేదంటే ఆ 190 మైళ్లు కూడా దాటేసి ఇంటికే వచ్చేసేదేమో అంటూ సుసానే మురిసిపోయింది. అయితే దాదాపు 1,000 మైళ్ల దూరంలోని వ్యోమింగ్‌ నుంచి రోజ్‌విల్లే దాకా అది ఎలా రాగలిగిందన్నది మాత్రం పజిల్‌గానే మిగిలిపోయింది!

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.