AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన చిన్నారి.. ఈ నాన్న నాకొద్దు అంటూ ఫిర్యాదు.. ఏం జరిగిందంటే?

తండ్రి పెట్టే చిత్రహింసలు తాళలేక ఓ చిన్నారి ఠాణా మెట్లెక్కింది..తన తండ్రి రోజు కొట్టే దెబ్బలకి తాళలేక పోలీసు‌స్టేషన్‌కి వెళ్ళి తన దెబ్బలని పోలీసులకి చూపిస్తూ తన గోడు వెళ్ళబోసుకుంది. ఆ చిన్నారి..

పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన చిన్నారి.. ఈ నాన్న నాకొద్దు అంటూ ఫిర్యాదు.. ఏం జరిగిందంటే?
Daughter Complained On Fath
G Sampath Kumar
| Edited By: Janardhan Veluru|

Updated on: Oct 01, 2024 | 1:15 PM

Share

చిన్నపిల్లలు నాన్న కావాలని మారం చేస్తుండడం మనం చూసుంటాం .. నాన్న వచ్చేదాకా అన్నం తిన్నా అని పిల్లలు ఏడవడం చూసుంటాం.. కానీ ఓ చిన్నారి మాత్రం తనకు ఈ నాన్న నాకొద్దు…ఎప్పుడూ కొడుతున్నాడని కన్నీళ్లు పెట్టుకుంది. తండ్రి పెట్టే చిత్రహింసలు తాళలేక ఓ చిన్నారి ఠాణా మెట్లెక్కింది.. తన తల్లి కరోనా‌ సమయంలో చనిపోగా..తండ్రి మరోక వివాహం చేసుకోన్నాడని, తన తండ్రి రోజు కొట్టే దెబ్బలకి తాళలేక పోలీసు‌స్టేషన్‌కి వెళ్ళి తన దెబ్బలని పోలీసులకి చూపిస్తూ తన గోడు వెళ్ళబోసుకుంది. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది.

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం‌ శ్రీరాములపల్లి చెందిన బాలిక‌ తల్లి కరోనా‌ సమయంలో మృతి చెందింది. తండ్రి‌ పెద్దరాజం.. మరో మహిళను వివాహం చేసుకున్నాడు..ఏడో తరగతి చదువుతున్న గంగజల తండ్రి నిత్యం కొడుతున్న బాధను భరించలేకపోయింది.. రెండో భార్య పెద్ద రాజంకి జ్వరం రావడంతో జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ అసుపత్రిలో చేర్పించారు. ఆమెతో పాటుగా జగిత్యాలకి వచ్చిన గంగజల సోమవారం రాత్రి జగిత్యాల ‌పట్టణంలోని పోలిసు స్టేషనుకి వచ్చి తండ్రి కొట్టే దెబ్బలు భరించలేకపోతున్నానని ఏదైనా హస్టల్‌లో చేర్పించాలని పోలీసులని వేడుకుంది. బాలిక శరీరంపై ఉన్న దెబ్బలు చూసి చలించపోయిన పోలీసులు జిల్లా సంక్షేమ శాఖ‌ అధికారులకి అప్పజెప్పారు. తండ్రి వ్యవహారంపై పోలీసులు విచారణ చేపడుతున్నారు.

ప్రస్తుతం పోలీసులు ఆ చిన్నారి దగ్గర వివరాలు అడిగి తెలుసుకుంటున్న వీడియో వైరల్‌గా మారింది. వీడియోలో నాన్న దగ్గరికి వెళ్తావా? అని పోలీసులు అడగగా.. నాన్న దగ్గరకు వెళ్లనని చిన్నారి సమాధానం ఇచ్చింది. మరి ఇక్కడికి వచ్చినట్లు మీ నాన్నకు చెప్పమంటావా అని అడగగా.. వద్దు వద్దు మా నాన్నకు చెప్పకండి అని ఆమె పేర్కొంది. జగిత్యాల్ పోలీసులు ఈ విషయంపై విచారణ చేపట్టారు. చిన్నారి తండ్రి గురించి విచారిస్తున్నారు.