AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Elections: తెలంగాణలో తొలిసారిగా ఆన్‌లైన్ నామినేషన్.. ఎక్కడి నుంచి దాఖలైందంటే..?

అంది వచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో భారత ఎన్నికల సంఘం అనేక సంస్కరణలను తీసుకువచ్చింది. ఫలితంగానే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల చరిత్రలో తొలిసారిగా ఒకరు ఆన్‌లైన్‌లో నామినేషన్ దాఖలు చేశారు. అమెరికాలో వర్క్ పర్మిట్‌పై పనిచేస్తున్న సుధీర్ అన్‌లైన్‌లో తన నామినేషన్ దాఖలు చేశారు.

Telangana Elections: తెలంగాణలో తొలిసారిగా ఆన్‌లైన్ నామినేషన్.. ఎక్కడి నుంచి దాఖలైందంటే..?
Jalagam Sudhir
M Revan Reddy
| Edited By: |

Updated on: Nov 03, 2023 | 5:17 PM

Share

ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ అంటే మన అందరికి తెలుసు..! ఎన్నికల విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు కల్పిస్తారు. కానీ మనం ఎప్పుడు ఆన్‌లైన్‌లో నామినేషన్ వేసిన దాఖలాలు లేవు. అంది వచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో భారత ఎన్నికల సంఘం అనేక సంస్కరణలను తీసుకువచ్చింది. ఫలితంగానే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల చరిత్రలో తొలిసారిగా ఒకరు ఆన్‌లైన్‌లో నామినేషన్ దాఖలు చేశారు.

తెలంగాణలో నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. మొదటి రోజే పెద్దఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్‌ నేతలు నామినేషన్ల పర్వంలో బోణీ చేశారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఆన్‌లైన్‌లో నామినేషన్ దాఖలు చేసుకునే అవకాశాన్ని తొలిసారిగా భారత ఎన్నికల సంఘం కల్పించింది. కోదాడ నియోజక వర్గానికి చెందిన జలగం సుధీర్ అమెరికాలో వర్క్ పర్మిట్‌పై పనిచేస్తున్నారు. గత కొంత కాలంగా కోదాడ పరిసర ప్రాంతాల్లో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న జలగం సుధీర్, ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు. ఇంతలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రానే వచ్చింది. నామినేషన్ల ప్రక్రియ నవంబర్ 3 నుంచి మొదలైంది. దీంతో అన్‌లైన్‌లో తన నామినేషన్ దాఖలు చేశారు సుధీర్.

అన్‌‌లైన్‌‌లో నామినేషన్ దాఖలు చేసేందుకు అవసరమైన ఎలక్షన్ కమీషన్ నిబంధనల ప్రకారం అన్ని డాక్యుమెంట్లు అందచేయటానికి సిద్దంగా ఉన్నానని, ఈ ఆన్‌లైన్ ప్రాసె‌స్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు అందించాలని జలగం సుధీర్ కోదాడ ఎన్నికల అధికారులు లేఖ రాశారు. సువిధ పోర్టల్ ద్వారా ఎన్నికల్లో ఆన్‌లైన్ నామినేషన్ దాఖలు చేసుకోవచ్చని ఎన్నికల అధికారులు తెలిపారు. దీంతో సువిధ పోర్టల్ ద్వారా కోదాడ అసెంబ్లి నియోజకవర్గం నుండి ఆన్‌లైన్ ద్వారా స్వతంత్ర అభ్యర్దిగా జలగం సుధీర్ తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ ఎన్నికల అధికారులు ఆమోదిస్తే.. తెలంగాణలో మొట్ట మొదటి ఆన్‌లైన్ నామినేషన్ కోదాడ నుండే దాఖలు అయినట్లుగా భావించవచ్చు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

బాడీ షేమింగ్‌ చేశారు.. పెళ్లి చేసుకోవాలంటే ఆ కండిషన్ పెట్టారు
బాడీ షేమింగ్‌ చేశారు.. పెళ్లి చేసుకోవాలంటే ఆ కండిషన్ పెట్టారు
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..