AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: న్యూడ్ కాల్ మాఫియా బారిన పడ్డ ఐపీఎస్.. లక్షల్లో డబ్బులు డిమాండ్

ఆయన కనిపిస్తున్న వీడియోను మార్పు చేసి సోషల్ మీడియాతో పాటు అన్నింటిలోనూ వైరల్ చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. అలా జరగకుండా ఉండాలంటే తాము చెప్పిన విధంగా లక్షల రూపాయలను తమ బ్యాంకు ఖాతాలో చెల్లించాలని వారు హెచ్చరించారు. దీంతో అవాక్కైన సదరు ఐపీఎస్ అధికారి సైబరాబాద్‌లో ఉన్న సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు..

Hyderabad: న్యూడ్ కాల్ మాఫియా బారిన పడ్డ ఐపీఎస్..  లక్షల్లో డబ్బులు డిమాండ్
Cyber Crime
Follow us
Lakshmi Praneetha Perugu

| Edited By: Ram Naramaneni

Updated on: Nov 03, 2023 | 6:16 PM

నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్న ట్రైనీ ఐపీఎస్ సైబర్ క్రైమ్ వలలో చిక్కుకునాడు. సైబర్ నేరగాళ్ల కొత్త ఎత్తుగడలో భాగంగా అనేక వ్యూహాలు రచించి బాధితుల నుండి లక్షల్లో కాజేస్తున్నారు. ఇటీవల కాలంలో అతివల న్యూడ్ వీడియోను ఆధారంగా చేసుకుని వాటి ద్వారా నేరాలకు పాల్పడుతూ బాధితుల నుండి ఎక్కువ మొత్తంలో డబ్బులు కాజేస్తున్నారు కేటుగాడు. ఇలాంటి సైబర్ మాఫియా బారిన పడ్డాడు ఓ ట్రైని ఐపీఎస్ అధికారి.. హైదరాబాదులో ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ ఐపిఎస్‌గా శిక్షణ తీసుకుంటున్న బాధితుడికి సడన్‌గా వాట్సప్‌లో వీడియో కాల్ వచ్చింది. తనకి తెలియని నంబర్ నుండి వీడియో కాల్ రావడంతో అతను అనుమానంగానే లిఫ్ట్ చేశాడు. ట్రైనింగ్ ఐపీఎస్ కాల్ లిఫ్ట్ చేయగానే ఒక యువతి న్యూడ్‌గా కనిపిస్తూ ఉన్న వీడియో ప్రత్యక్షమైంది. దీంతో కొన్ని సెకన్ల వ్యవధిలోనే ఆయన కాల్ కట్ చేశాడు.

అయితే ఈలోపే బాధితుడు కాల్ లిఫ్ట్ చేసిన కొన్ని సెకండ్లలోనే బాధితుడి వాట్సాప్‌కు సందేశం వచ్చింది. ఆయన కనిపిస్తున్న వీడియోను మార్పు చేసి సోషల్ మీడియాతో పాటు అన్నింటిలోనూ వైరల్ చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. అలా జరగకుండా ఉండాలంటే తాము చెప్పిన విధంగా లక్షల రూపాయలను తమ బ్యాంకు ఖాతాలో చెల్లించాలని వారు హెచ్చరించారు. దీంతో అవాక్కైన సదరు ఐపీఎస్ అధికారి సైబరాబాద్‌లో ఉన్న సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. గతంలోనూ ఇలాంటి న్యూడ్ కాల్స్ కేసులు ఎన్నో  వెలుగు చూసాయి. అయితే ఇలాంటి తెలియని నంబర్ల నుండి కాల్స్ వచ్చినా, వీడియో కాల్స్ వచ్చినా ఎట్టి పరిస్థితుల్లో వాటికి దూరంగా ఉండాలని పోలీసులు పదేపదే హెచ్చరిస్తున్నారు.

ముఖ్యంగా ఇండియన్ టైమింగ్స్ ప్రకారం రాత్రి వేళలో ఇలాంటి కాల్స్ అధికంగా వస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు. యువతి న్యూడ్ కాల్స్ కూడా ఇప్పటివి కాదు. ఎప్పటివో రికార్డ్ చేసి అవతల వైపు వ్యక్తి వీడియో కాల్‌కు రియాక్ట్ అవగానే ఈ న్యూడ్ వీడియోలను ప్లే చేస్తున్నారు.. అయితే ఇలాంటి నేరాలకు పాల్పడే ముఠాలు వెస్ట్ బెంగాల్ తో పాటు హర్యానాలోనే ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉండి తమ రాష్ట్రానికి సంబంధం లేని ఫోన్ నెంబర్లను సేకరించి ఇలాంటి న్యూడ్ వీడియో మాఫియాను సృష్టించారు. వీటిని తిరిగి వైరల్ చేస్తామని బాధితులను బెదిరించడంతో.. బాధితులు చెల్లిస్తున్న డబ్బును తీసుకొని విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు.

ఒకవేళ అనుమానాస్పద నెంబర్ నుండి వీడియో కాల్ వచ్చిన పక్షంలో వెంటనే కాల్ లిఫ్ట్ చేయకుండా.. వాటిని కట్ చేయడం ద్వారా సైబర్ నేరాల బారిన పడకుండా ఉంటారని పోలీసులు సూచిస్తున్నారు. ఒకవేళ అనుకోని రీతిలో అలాంటి కాల్స్ లిఫ్ట్ చేయాల్సి వచ్చినా వెంటనే సదరు నెంబర్‌ను బ్లాక్ లో పెట్టి రిపోర్ట్ చేయాల్సిందిగా సూచిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…  

నాగ చైతన్యతో అంత క్లోజ్‌గా కనిపిస్తోన్న ఈ వ్యక్తి ఎవరో తెలుసా?
నాగ చైతన్యతో అంత క్లోజ్‌గా కనిపిస్తోన్న ఈ వ్యక్తి ఎవరో తెలుసా?
పోలా అదిరిపోలా.. మల్లారెడ్డి మాస్ స్టెప్పులు..
పోలా అదిరిపోలా.. మల్లారెడ్డి మాస్ స్టెప్పులు..
నలుగురు ఐపీఎల్ డేంజరస్ ఓపెనర్లతో ఇంగ్లాండ్ పర్యటనకు భారత్
నలుగురు ఐపీఎల్ డేంజరస్ ఓపెనర్లతో ఇంగ్లాండ్ పర్యటనకు భారత్
16 ఏళ్లల్లో ఒకే ఒక్క హిట్టు అందుకున్న హీరోయిన్.. చేసిన సినిమాలన్న
16 ఏళ్లల్లో ఒకే ఒక్క హిట్టు అందుకున్న హీరోయిన్.. చేసిన సినిమాలన్న
వంట గదే బ్యూటీ పార్లర్.. ఈ 8 ఐటెమ్స్ ఇచ్చే షాకింగ్ బెనిఫిట్స్ ఇవి
వంట గదే బ్యూటీ పార్లర్.. ఈ 8 ఐటెమ్స్ ఇచ్చే షాకింగ్ బెనిఫిట్స్ ఇవి
రామ్ చరణ్ విగ్రహావిష్కరణకు ముహూర్తం ఫిక్స్.. ఎక్కడో తెలుసా?
రామ్ చరణ్ విగ్రహావిష్కరణకు ముహూర్తం ఫిక్స్.. ఎక్కడో తెలుసా?
ఇండియాలో 107 మంది పాకిస్తాన్‌ పౌరులు మిస్సింగ్‌!
ఇండియాలో 107 మంది పాకిస్తాన్‌ పౌరులు మిస్సింగ్‌!
తెల్ల నేరేడు తినడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా!
తెల్ల నేరేడు తినడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా!
ఫ్రిజ్‌లో రోజుల తరగడి బాటిల్‌ నీళ్లు నిల్వ చేసే అలవాటు మీకూ ఉందా?
ఫ్రిజ్‌లో రోజుల తరగడి బాటిల్‌ నీళ్లు నిల్వ చేసే అలవాటు మీకూ ఉందా?
అందరూ ఇష్టంగా లాగించేస్తారు..? కానీ.. ఇవి విషంతో బరాబర్‌ అంట..
అందరూ ఇష్టంగా లాగించేస్తారు..? కానీ.. ఇవి విషంతో బరాబర్‌ అంట..