YS Sharmila: రాహుల్ గాంధీకి లేఖ రాసిన వైఎస్ షర్మిల
వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ ఆధినేత్రి వైఎస్ షర్మిల కాంగ్రెస్ ముఖ్య నేత రాహూల్ గాంధీకి లేఖ రాశారు. తాజాగా జరిగిన కాంగ్రెస్ నాయకులు భేటీలో ఆమె కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించారు. ఓట్లు చీలనీయకుండా ఉండేందుకు తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ నీచపాలనను అంతం కోసం ఈ కఠినమైన నిర్ణయానికి సిద్దమైనట్లు లేఖలో ప్రస్తావించారు. కేసీఆర్ రౌడీ రాజ్యాన్ని అంతమొందించే కాంగ్రెస్ ఓటును చీలనీవకుండా ఈ త్యాగానికి పూనుకున్నానన్నారు.

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తెలంగాణ బాగుకోసం, ఈ రాష్ట్ర ప్రజల భవిత కోసం అసెంబ్లీ ఎన్నికల బరిలో నుంచి వైదొలుగుతోందని పేర్కొన్నారు. నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ నిరంకుశపాలనను గద్దెదింపేందుకు ప్రజలు సిద్దమయ్యారన్నారు. ఒక కుటుంబం దురాశతో.. సంపదగలిగిన తెలంగాణ రాష్ట్రానికి నేడు అధికంగా అప్పుల భారం పడుతోందనన్నారు. తొమ్మిదేళ్ల పాలనలో తమ కుటుంబ సభ్యులు, సన్నిహితులు అవినీతికి పాల్పడినట్లు ఆరోపించారు. కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని తేలిపోయింది. వారి అవినీతి రోజురోజుకు వెలుగు చూస్తున్న నేపథ్యంలో, తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసం సమాలోచనలు జరిపే పార్టీలందరూ ఉమ్మడిగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దీనికి మద్దతుగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కీలక నిర్ణయం తీసుకుందని తెలియజేశారు.
బీఆర్‌ఎస్ ఓటమి ఖాయమని.. కాంగ్రెస్ పార్టీకే గెలిచే అవకాశం ఎక్కువగా ఉందని, ఈ దశలో అధికార వ్యతిరేక ఓట్లను చీల్చడం కేసీఆర్‌ను గద్దె దించేందుకు అడ్డంకిగా మారుతుందని భావిస్తున్నాను. అనేక సర్వేలు, గ్రౌండ్ రిపోర్ట్‌ల ప్రకారం, అసెంబ్లీ ఎన్నికలలో మేము పాల్గొనడం చాలా నియోజకవర్గాలలో కాంగ్రెస్ ఓట్ల శాతాన్ని నేరుగా ప్రభావితం చేస్తుందని నిర్ధారించబడింది. అందుకే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిర్ణయించుకుంది. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, ప్రజల శ్రేయస్సు కోసం నేను ఈ ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాను. వైయస్ఆర్ తెలంగాణా పార్టీ.. కాంగ్రెస్ పార్టీకి బేషరతు మద్దతునిస్తుంది. మెరుగైన తెలంగాణ కోసం ఈ కీలక సమయంలో వైయస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైయస్ఆర్ అభిమానులందరూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మేలు జరగాలని కోరుకుంటున్నాను అని రాహూల్ గాంధీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి