ఇదో వింత ఆచారం.. వరుణుడి కటాక్షం కోసం వరద పాశం.. నాలాబండపైనే..!
వేసవిలోనే ఊరించిన వర్షాలు జాడ లేకుండాపోయాయి. తొలకరి మొదలైన చినుకు తడి కరువైంది. దీంతో వరుణుడి కరుణ కోసం అన్నదాతలు నిరీక్షిస్తున్నారు. ఖరీఫ్ సీజన్ ఆరంభమై నెల రోజులు కావొస్తున్నా ఒక్క వాన కూడా సరిగా కురవకపోడంతో.. ఆకాశంవైపు ఆశగా ఎదురు చూస్తున్నారు. వరుణుడి కటాక్షం కోసం రైతులు మొక్కులు మొక్కుతున్నారు.

వేసవిలోనే ఊరించిన వర్షాలు జాడ లేకుండాపోయాయి. తొలకరి మొదలైన చినుకు తడి కరువైంది. దీంతో వరుణుడి కరుణ కోసం అన్నదాతలు నిరీక్షిస్తున్నారు. ఖరీఫ్ సీజన్ ఆరంభమై నెల రోజులు కావొస్తున్నా ఒక్క వాన కూడా సరిగా కురవకపోడంతో.. ఆకాశంవైపు ఆశగా ఎదురు చూస్తున్నారు. వరుణుడి కటాక్షం కోసం రైతులు మొక్కులు మొక్కుతున్నారు. వర్షాలు కురవాలని కోరుతూ ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
వానాకాలంలో ఈసారి నైరుతి రుతుపవనాలు నిర్ణీత సమయం కంటే ముందుగానే కేరళను తాకాయి. రోహిణి కార్తెలోనే చిరుజల్లులతో కూడిన వర్షాలు కురిశాయి. జూన్ రెండో వారంలోగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ కూడా ప్రకటించింది. అయితే వర్షాలు విస్తారంగా కురవకపోవడంతో పంటల సాగుపై రైతులు సందిగ్ధంలో పడ్డారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తారు వర్షాలు కురిసి ఆశలు చిగురింపజేసినా, పూర్తిస్థాయిలో కురవక పోవడంతో సందిగ్ధం నెలకొంది. తొలుత కురిసిన వర్షాలకు కొందరు రైతులు విత్తనాలు విత్తారు. మృగశిర కార్తె ముగియవస్తున్నా వర్షాలు లేక విత్తిన విత్తనాలు మొలకెత్తడం లేదని, మొలకెత్తిన మొలకలు ఎండలకు వాడిపోతున్నాయి.
యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం ఆరెగూడెంలో వర్షాలు కురవాలని మహిళలు వరుణ దేవునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కప్పకాముడు ఆడారు. గ్రామ ప్రజలంతా ప్రతి ఇంటి నుండి కొన్ని బియ్యం తీసుకొని ప్రసాదాన్ని వండారు. కొండపై ఉన్న శివాలయంలో వరద పాశం వండి, వరుణ దేవునికి నైవేద్యం సమర్పించి, ప్రసాదాన్ని నాలాబండపై పోసి మహిళలు భక్తితో ఆరగించారు. ఇలా చేయడం వల్ల సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని ప్రజల నమ్మకం. ఈ ఆచారం తరతరాలుగా వస్తోందని, వరద పాశంతో వరుణుడు శాంతించి వర్షాలు కురుస్తాయని మహిళలు చెబుతున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




