AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FTII Admissions 2025: సినిమాల్లో ఛాన్స్‌ కావాలా? ఐతే ఈ కోర్సులు చేయండి.. వయసు ఎంతైనా ఓకే!

టాలీవుడ్, బాలీవుడ్‌తోపాటు దక్షిణాదిన పలు సినీ ఇండస్ట్రీల నుంచి వస్తున్న సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అవుతున్నాయి. ఇక వాటిల్లో నటించే నటీనటులకు దక్కే క్రేజ్ అంతా ఇంతాకాదు. కోట్లలో రెమ్యునరేషన్‌, విశేష గుర్తింపు.. సెలబ్రెటీల హోదా చూస్తే ఎవరికైనా కాస్త అసూయగానే ఉంటుంది. అయితే మీకూ సినిమాల్లో నటించాలనే ఆసక్తి ఉందా? అయితే ఈ కోర్సుల్లో ప్రవేశాలు పొందండి..

FTII Admissions 2025: సినిమాల్లో ఛాన్స్‌ కావాలా? ఐతే ఈ కోర్సులు చేయండి.. వయసు ఎంతైనా ఓకే!
MFA-Cinema Courses
Srilakshmi C
|

Updated on: Jun 23, 2025 | 5:30 AM

Share

సినిమాలు, షార్ట్‌ ఫిల్మ్‌లు పుణెలోని ఫిల్మ్ అండ్‌ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (FTII)లో ప్రవేశాలు పొందండి. 2025-26 విద్యాసంవత్సరానికి సినిమా, టెలివిజన్ రంగాల్లో ఆసక్తి, అర్హత గల అభ్యర్థుల నుంచి మాస్టర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ (MFA), ఏడాది పోస్టు గ్రాడ్యుయేట్‌ సర్టిఫికేట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతూ FTII నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నటన మాత్రమే కాదు దర్శకత్వం, స్క్రీన్‌ప్లే, సినిమాటోగ్రఫీ, స్క్రీన్‌ రైటింగ్, ఎడిటింగ్, సౌండ్‌ రికార్టింగ్ ఇలా తదితర రంగాల్లో అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే రాత పరీక్ష ద్వారా మాత్రమే ప్రవేశాలు ఉంటాయి. అందుకు ఎఫ్‌టీఐఐ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తుంది.

ఫిల్మ్‌ వింగ్‌ (ఎంఎఫ్‌ఏ – మాస్టర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌)లో కోర్సులు, సీట్ల వివరాలు..

  • డైరెక్షన్ & స్క్రీన్‌ప్లే రైటింగ్ కోర్సు: 11
  • సినిమాటోగ్రఫీ కోర్సు: 11
  • ఎడిటింగ్ కోర్సు: 11
  • సౌండ్ రికార్డింగ్ అండ్‌ డిజైన్ కోర్సు: 11
  • ఆర్ట్ డైరెక్షన్ అండ్‌ ప్రొడక్షన్ డిజైన్ కోర్సు: 11
  • స్క్రీన్ యాక్టింగ్ కోర్సు: 16
  • స్క్రీన్‌రైటింగ్ (ఫిల్మ్, టీవీ & వెబ్‌ సిరీస్) కోర్సు: 16

టెలివిజన్‌ వింగ్‌ (ఏడాది పీజీ సర్టిఫికేట్‌ కోర్స్‌)లో కోర్సులు, సీట్ల వివరాలు..

  • టీవీ డైరెక్షన్ కోర్సు: 11
  • ఎలక్ట్రానిక్ సినిమాటోగ్రఫీ కోర్సు: 11
  • వీడియో ఎడిటింగ్ కోర్సు: 11
  • సౌండ్ & టీవీ ఇంజినీరింగ్ కోర్సు: 11

ఎంఎఫ్‌ఏ కోర్సులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు.. ఏదైనా డిగ్రీ పూర్తిచేసిన ఉండాలి. ఆర్ట్‌ డిజైన్‌ కోర్సుకు ఫైన్స్‌ ఆర్ట్స్‌ సంబంధిత బ్యాక్‌గ్రౌండ్ తప్పనిసరిగా ఉండాలి. ఇక ఏడాది పీజీ కోర్సుకు దరఖాస్తు చేసుకునే వారు ఏదైనా డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి అంటూ ఏమీ ఉండదు. అయితే ప్రవేశ సమయం నాటికి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ ద్వారా జూలై 17, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు కింద ఒక్కో కోర్సుకు జనరల్‌/ఓబీసీ అభ్యర్ధులు రూ.1500, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/మహిళా అభ్యర్థులైతే రూ.500 ఫీజు ఉంటుంది. రెండు కోర్సులకైతే వరుసగా రూ.2500, రూ.800 చెల్లించాలి. స్టేజ్‌-1 రాత పరీక్ష, స్టేజ్‌-2 అభినయం/ ప్రాక్టికల్/ ఇంటరాక్షన్ టెస్టుల ద్వారా ఎంపిక చేస్తారు.

ముఖ్యమైన తేదీలు

  • దరఖాస్తులకు ప్రారంభ తేదీ: జూన్‌ 15, 2025.
  • దరఖాస్తులకు చివరి తేదీ: జూలై 11, 2025.
  • స్టేజ్‌-1 ప్రవేశ పరీక్ష: జులై 27, 2025.
  • అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్: జులై 20 నుంచి జులై 26వ వరకు
  • తరగతులు ప్రారంభం: 2025 నవంబర్ మూడో వారం నుంచి..

నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్