Telangana: ఐబొమ్మ వార్నింగ్ పోలీసులకు కాదు.. తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ
సినిమా పైరసీ వెబ్‌సైట్ ‘ఐబొమ్మ’ తెలంగాణ పోలీసులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసిందంటూ జరుగుతున్న ప్రచారాన్ని తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఖండించింది. ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని.. ఇది అవాస్తవమని, ప్రజలు ఎవరూ ఇలాంటి తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని పేర్కొంది. ఇందుకు సంబంధించి ఎక్స్‌లో తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఒక పోస్ట్ చేసింది.

ఇటీవల తెలంగాణ పోలీసులు కొందరు సినిమా పైరసీ ముఠాను పట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో సినిమా పైరసీ వెబ్‌సైట్ ‘ఐబొమ్మ నుంచి తెలంగాణ పోలీసులకు హెచ్చరికలు వచ్చాయని.. తమను పట్టుకోవాలని చూస్తే.. తమ దగ్గర ఉన్న రహస్య ఫోన్ నంబర్లను బహిర్గతం చేస్తామని బెదిరించినట్లు కొన్ని స్క్రీన్‌షాట్‌లు సోషల్ మీడియాలో, మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. దీంతో ఈ ప్రచారంపై ఫోకస్ పెట్టిన తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ విభాగం.. ఇది తప్పుడు ప్రచారం అని.. ఈ ప్రచారంతో వాస్తవం లేదని తేల్చి చెప్పింది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే పోస్ట్‌లను జనాలు గుడ్డిగా నమ్మవద్దని పేర్కొంది
ఇందుకు సంబంధించి తెలంగాణ ఫ్యాక్ట్‌చెక్ విభాగం శుక్రవారం ‘ఎక్స్’ వేదికగా ఒక పోస్ట్ చేసింది. కొన్ని మీడియా కథనాలు, సోషల్ మీడియా పోస్టుల ప్రకారం, సినిమా పైరసీ సైట్ iBomma తెలంగాణ పోలీసులకు హెచ్చరిక జారీ చేసి, గోప్యమైన ఫోన్ నంబర్లను లీక్ చేస్తామని బెదిరించిందని చెబుతున్నారని.. కానీ ప్రస్తుతం ప్రసారం అవుతున్న స్క్రీన్‌షాట్‌లు ఇప్పటివి కాదని.. 2023 నాటివని పేర్కొంది.
అలాగే ఆ హెచ్చరికలు పోలీసులను ఉద్దేశించినవి కావని.. అవి తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించినవని స్పష్టం చేశారు. తెలంగాణ పోలీసులకు ఐబొమ్మ నుంచి ఎలాంటి హెచ్చరికలు రాలేదు చెప్పుకొచ్చారు. కాబట్టి సోషల్ మీడియాల్లో ప్రచారమయ్యే సమాచారాన్ని షేర్ చేసేముందు ప్రజలు వాస్తవాలను నిర్దారించుకోవాలని తెలిపారు. ఇలాంటి పోస్ట్‌లు షేర్ చేసే విషయాల్లో జాగ్రత్త వహించాలని సూచించారు.
#అలర్ట్: కొన్ని మీడియా కథనాలు మరియు సోషల్ మీడియా పోస్టుల ప్రకారం, సినిమా పైరసీ సైట్ iBomma తెలంగాణ పోలీసులకు హెచ్చరిక జారీ చేసి, గోప్యమైన ఫోన్ నంబర్లను లీక్ చేస్తామని బెదిరించిందని చెబుతున్నారు.
అయితే, ప్రసారం అవుతున్న స్క్రీన్‌షాట్‌లు 2023 నాటివి మరియు అవి పోలీసులకు కాకుండా… pic.twitter.com/gkcoqYtIqg
— FactCheck_Telangana (@FactCheck_TG) October 3, 2025
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




