RRC Railway Jobs 2025: ఎలాంటి రాత పరీక్షలేకుండానే.. రైల్వే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలకు నోటిఫికేషన్
RRC Railway Sports Quota Recruitment 2025: ఈస్ట్ సెంట్రల్ రైల్వే (ECR).. 2025-26 సంవత్సరానికి స్పోర్ట్స్ కోటా క్రింద పోస్టుల భర్తీకి ప్రతిభావంతులైన క్రీడాకారుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన కింద మొత్తం 56 స్పోర్ట్స్ కోటా పోస్టులను భర్తీ..

కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఈస్ట్ సెంట్రల్ రైల్వే (ECR).. 2025-26 సంవత్సరానికి స్పోర్ట్స్ కోటా క్రింద పోస్టుల భర్తీకి ప్రతిభావంతులైన క్రీడాకారుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన కింద మొత్తం 56 స్పోర్ట్స్ కోటా పోస్టులను భర్తీ చేయనున్నారు. రెజ్లింగ్ (పురుషులు), బాస్కెట్ బాల్ (పురుషులు & మహిళలు), కబడ్డీ (మహిళలు), ఫుట్‌బాల్ (మహిళలు), బ్యాడ్మింటన్ (పురుషులు & మహిళలు), హాకీ (మహిళలు), క్రికెట్ (పురుషులు), వాలీబాల్ (పురుషులు).. క్రీడా విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత క్రీడా విభాగాల్లో ప్రతిభావంతులైన పురుష, మహిళా అభ్యర్ధులు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. వివిధ పే లెవెల్స్, డివిజన్లలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు ఇలా..
- హెడ్‌క్వార్టర్స్/ఈసీఆర్ (హాజీపూర్) పోస్టుల సంఖ్య: 31
- దనాపూర్, డీడీయూ, సొన్పూర్, సమస్తిపూర్, ధన్బాద్ డివిజన్లలో డివిజన్లలో పోస్టుల సంఖ్య: 25
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదో తరగతి/ ఐటీఐ/ అప్రెంటీస్‌షిప్/ ఏదైనా విభాగంలో డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే సంబంధిత క్రీడా విభాగంలో జాతీయ/అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొనని ఉండాలి. లేదా టాప్ స్థానాలు/ పతకాలు సాధించి ఉండాలి. ఇక అభ్యర్ధుల వయోపరిమితి 2026 జనవరి 1 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్న వారు ఆఫ్‌లైన్ విధానంలో అక్టోబర్ 21, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న దరఖాస్తును పూరించి, సంబంధిత హెడ్ క్వటర్స్/డివిజన్ కార్యాలయానికి పంపించాలి.
అలాగే దరఖాస్తు ఫీజు కింద జనరల్ అభ్యర్థులు రూ.500 చెల్లించవల్సి ఉంటుంది. ట్రయల్‌కి హాజరైన వారికి రూ.400 రీఫండ్ చేస్తారు. ఇక ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ఈబీసీ అభ్యర్థులు రూ.250 చెల్లించాలి. వీరిలో ట్రయల్‌కి హాజరైన వారికి పూర్తి రీఫండ్ చెల్లిస్తారు. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ట్రయల్స్, క్రీడల్లో సాధించిన విజయాలు, విద్యార్హతల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు పే లెవెల్ 4/5 కింద రూ.25,500 నుంచి రూ.29,200 వరకు, పే లెవెల్ 2/3 కింద రూ.19,900 నుంచి రూ.21,700 వరకు, పే లెవెల్ 1 కింద రూ.18,000 జీతంతోపాటు ఇతర అలవెన్స్‌లు కల్పిస్తారు.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




