AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Singareni Tension: పెద్దపల్లి జిల్లాలో ఓపెన్‌కాస్ట్‌ బొగ్గుగని వద్ద తీవ్ర ఉద్రిక్తత.. భూనిర్వాసితుల ఆందోళన..!

Singareni Tension: పెద్దపల్లి జిల్లా (Peddapalli distric) రామగిరి ఓపెన్‌కాస్ట్‌ బొగ్గుగని వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సింగరేణి యాజమాన్యానికి వ్యతిరేకంగా ధర్నాకు దిగారు భూనిర్వాసితులు..

Singareni Tension: పెద్దపల్లి జిల్లాలో ఓపెన్‌కాస్ట్‌ బొగ్గుగని వద్ద తీవ్ర ఉద్రిక్తత.. భూనిర్వాసితుల ఆందోళన..!
Subhash Goud
|

Updated on: May 28, 2022 | 8:33 AM

Share

Singareni Tension: పెద్దపల్లి జిల్లా (Peddapalli distric) రామగిరి ఓపెన్‌కాస్ట్‌ బొగ్గుగని వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సింగరేణి యాజమాన్యానికి వ్యతిరేకంగా ధర్నాకు దిగారు భూనిర్వాసితులు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో భూనిర్వాసితులు ఆందోళనకు దిగడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఇళ్లను కూల్చివేయడంపై ఆగ్రహించారు. సింగరేణి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బొగ్గుగనిలోకి బలవంతంగా దూసుకెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, భూనిర్వాసితులకు మధ్య వాగ్వాదం పెరిగి ఉద్రిక్తతలకు దారితీసింది. అయినా పోలీసులు గనిలోకి ప్రవేశాన్ని నిరాకరించడంతో గేటు ఎదుటే బైఠాయించి ధర్నాకు దిగారు. OCP-II ప్రాజెక్ట్ విస్తరణలో భాగంగా, సింగరేణి యాజమాన్యం నష్టపరిహారం చెల్లించి లద్నాపూర్ గ్రామాన్ని స్వాధీనం చేసుకుంది.

అధికారులు ప్రకటించిన మేరకు పునరావాస ప్యాకేజీ అందకపోవడంతో 283 మంది భూనిర్వాసితులు ఆందోళనకు దిగారు. పరిహారం ఇవ్వకుండానే ఇళ్లను కూల్చివేయడంపై ఆవేదన చెందారు. విషయం తెలుసుకున్న పెద్దపల్లి ఆర్డీవో నరసింహమూర్తి.. సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి పరిహారం ఇప్పిస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు. కాగా, బాధితుల ఇళ్లకూల్చివేతను ఖండించారు జిల్లాపరిషత్‌ చైర్మన్‌ పుట్టమధుకర్‌.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి
Follow Us
IPL 2027: వచ్చే ఏడాది వేలంలో రూ. 30 కోట్లు పక్కా.. ఎవరంటే?
IPL 2027: వచ్చే ఏడాది వేలంలో రూ. 30 కోట్లు పక్కా.. ఎవరంటే?
బాబోయ్ వీరికి చాలా డేంజర్ కాలం రాబోతోంది.. మీరున్నారా?
బాబోయ్ వీరికి చాలా డేంజర్ కాలం రాబోతోంది.. మీరున్నారా?
ఏమి టాలెంట్ బ్రో.. చెత్తబుట్టతో కూలర్..సామాన్యుడి సూపర్ ఐడియా
ఏమి టాలెంట్ బ్రో.. చెత్తబుట్టతో కూలర్..సామాన్యుడి సూపర్ ఐడియా
రేషన్‌కార్డు ఉన్న వారికి కేంద్రం గుడ్‌న్యూస్‌.. త్వరలో కొత్త స్కీ
రేషన్‌కార్డు ఉన్న వారికి కేంద్రం గుడ్‌న్యూస్‌.. త్వరలో కొత్త స్కీ
ఐపీఎల్ ఎఫెక్ట్.. రిటైర్మెంట్‌ చేయనున్న టీమిండియా ప్లేయర్లు..!
ఐపీఎల్ ఎఫెక్ట్.. రిటైర్మెంట్‌ చేయనున్న టీమిండియా ప్లేయర్లు..!
మల్బరీ పండ్లే కాదు..వాటి ఆకుల్లో దాగున్న ఆరోగ్య రహస్యాలు తెలిస్తే
మల్బరీ పండ్లే కాదు..వాటి ఆకుల్లో దాగున్న ఆరోగ్య రహస్యాలు తెలిస్తే
రుణం లేకుండా కారు లేదా ఇల్లు ఎలా కొనాలి? సూపర్ ఫార్ములా..!
రుణం లేకుండా కారు లేదా ఇల్లు ఎలా కొనాలి? సూపర్ ఫార్ములా..!
బాదం vs వేరుశెనగ.. గుండె ఆరోగ్యానికి ఏది బెస్ట్..?
బాదం vs వేరుశెనగ.. గుండె ఆరోగ్యానికి ఏది బెస్ట్..?
వేడితో యూరిన్ రాని వాళ్ళు.. కూల్ చేసే సల్సా డ్రింక్ తాగేయండి
వేడితో యూరిన్ రాని వాళ్ళు.. కూల్ చేసే సల్సా డ్రింక్ తాగేయండి
40టీస్‌లో కూడా 20టీస్ కనిపించాలా?.. డైలీ ఈ వర్కౌట్స్ చేయాల్సిందే
40టీస్‌లో కూడా 20టీస్ కనిపించాలా?.. డైలీ ఈ వర్కౌట్స్ చేయాల్సిందే