NTR Jayanthi: మహానాయకుడికి నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్..

ఈ రోజు ఉదయం జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, లక్ష్మీపార్వతి తదితరులు సందర్శించి, నివాళులు అర్పించారు.

NTR Jayanthi: మహానాయకుడికి నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్..
Jr Ntr Visits Ntr Ghat
Follow us
Venkata Chari

|

Updated on: May 28, 2022 | 7:10 AM

నేడు దివంగత మాజీ ముఖ్యమంత్రి, నటుడు నందమూరి తారక రామారావు శత జయంతి. ఈ సందర్భంగా నందమూరి కుటుంబ సభ్యులు, అభిమానులు ట్యాంక్‌ బండ్‌ వద్దగల ఎన్టీఆర్‌ ఘాట్‌కి వెళ్లి నివాళ్లు అర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈమేరకు ఈ రోజు ఉదయం జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, లక్ష్మీపార్వతి తదితరులు సందర్శించి, నివాళులు అర్పించారు.

ఇక నందమూరి తారక రామారావు ( NTR ) శత జయంతి ఉత్సవాలు హైదరాబాద్ లో ఘనంగా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద మొదలైన హడావుడి. ఈమేరకు నివాళులు అర్పించిన అనంతరం లక్ష్మీపార్వతి మాట్లాడుతూ, తెలుగు జాతి గర్వించదగ్గ అసమాన ప్రతిభ కలిగిన నటుడు ఎన్‌టీ‌ఆర్ అని, మాట తప్పని మడమ తిప్పని రాజకీయ నాయకులుగా పేరుగాంచారని తెలిపారు. అలాగే తెలుగు సినిమా ఉన్నంత కాలం ఎన్ టీ ఆర్ పేరు ఉంటుందని ఆమె అన్నారు.

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈమేరకు నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ, శత జయంతి ఉత్సవాలను మే 28 నుంచి ఏడాదిపాటు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో తమ కుటుంబం నుంచి నెలకు ఒకరుచొప్పున పలు కార్యక్రమాల్లో పాల్గొంటారన్నారు. శత జయంతి ఉత్సవాల సందర్భంగా వారానికి 5 సినిమాలు, రెండు సదస్సులు ఉంటాయన్నారు. అలాగే నెలకు 2 ఎన్టీఆర్‌ పురస్కారాలు ప్రదానం చేస్తామన్నారు. తెనాలిలోని పెమ్మసాని థియేటర్లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు మొదలవుతాయని బాలకృష్ణ తెలిపారు.