Viral Video: పెళ్లి మండపానికి వెరైటీగా ఎంట్రీ ఇచ్చిన పెళ్లి కూతురు.. షాక్ అయిన బంధువులు..

Viral Video: సోషల్‌ మీడియా (Socila Media) విస్తృతి పెరిగిన ఈ రోజుల్లో ప్రతీ ఒక్కరూ ఎదుటి వారి దృష్టిని ఆకర్షించాలని చూస్తున్నారు. ఏదో రకంగా నలుగురిలో పేరు తెచ్చుకోవాలని తాపత్రయ పడుతున్నారు. అయితే ఇలా...

Viral Video: పెళ్లి మండపానికి వెరైటీగా ఎంట్రీ ఇచ్చిన పెళ్లి కూతురు.. షాక్ అయిన బంధువులు..
Follow us
Narender Vaitla

|

Updated on: May 28, 2022 | 6:10 AM

Viral Video: సోషల్‌ మీడియా (Socila Media) విస్తృతి పెరిగిన ఈ రోజుల్లో ప్రతీ ఒక్కరూ ఎదుటి వారి దృష్టిని ఆకర్షించాలని చూస్తున్నారు. ఏదో రకంగా నలుగురిలో పేరు తెచ్చుకోవాలని తాపత్రయ పడుతున్నారు. అయితే ఇలా అందరి దృష్టిని ఆకర్షించాలంటే ఏదో ఒక ప్రత్యేకత ఉండి తీరాలి. అందుకే ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటూ సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే రకరకాల వీడియోలు చేస్తూ పోస్ట్‌ చేస్తున్నారు. తాజాగా ఇలాగే ఓ పెళ్లి కూతురు అందరి దృష్టిని తనవైపు మళ్లించుకోవడానికి ఒక వెరైటీ పని చేసింది.

సాధారణంగా వివాహం జరిగే ఫంక్షన్‌ హాల్‌కి పెళ్లి కూతురును కారులో తీసుకెళుతుంటారు. కానీ ఓ నవ వధువు మాత్రం ఏకంగా ట్రాక్టర్‌పై వచ్చేసింది. బెతుల్‌ జిల్లా జావ్రా గ్రామానికి చెందిన భారతి తద్గే అనే యువతి వివాహం గత గురువారం జరిగింది. ఈ క్రమంలోనే మండపానికి ట్రాక్టర్‌పై వచ్చింది. అందులోనూ పెళ్లికూతురే స్వయంగా ట్రాక్టర్‌ నడపడం మరీ విశేషం. ఇక వధువుకు రెండు వైపులా తన సోదరులు ఇద్దరు కూర్చున్నారు.

ఇవి కూడా చదవండి

పెళ్లికూతురుగా ముస్తాబై, కళ్లకు బ్లాక్‌ గాగుల్స్‌ ధరించి, ట్రాక్టర్‌ నడుపుతూ రావడంతో పెళ్లికి విచ్చేసిన బంధువులంతా ఒక్కసారి షాక్‌కి గురయ్యారు. వెంటనే తమ స్మార్ట్‌ ఫోన్‌లను తీసి దానంతటినీ కెమెరాల్లో బంధించారు. ఈ వీడియో కాస్త సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇదెక్కడి వెరైటీ బాబు అంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. మరి నెట్టింట వైరల్ అవుతోన్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..

మరిన్ని వైరల్ వీడియోల కోసం క్లిక్ చేయండి..

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..