Six Ride On Activa:ఇదేం జర్నీరా బాబు..! ఒక్క యాక్టీవాపై అంత మందా..? ఒక్కరూ జారితే అయితది..

ఒక టూవీలర్‌పై ఎంతమంది ప్రయాణిస్తారు..? మహా అయితే, ఇద్దరు ఈజీగా వెళ్లొచ్చు. ఇద్దరికీ మించి ప్రయాణించకూడదు అన్నది ప్రస్తుత రూల్‌. ఇకపోతే, పిల్లలు ఉన్నవారు తప్పని సరి పరిస్థితుల్లో ఇద్దరు పిల్లలతో పాటు వెళ్తుంటారు. కానీ,

Six Ride On Activa:ఇదేం జర్నీరా బాబు..! ఒక్క యాక్టీవాపై అంత మందా..? ఒక్కరూ జారితే అయితది..
Six People
Follow us

|

Updated on: May 27, 2022 | 9:36 PM

ఒక టూవీలర్‌పై ఎంతమంది ప్రయాణిస్తారు..? మహా అయితే, ఇద్దరు ఈజీగా వెళ్లొచ్చు. ఇద్దరికీ మించి ప్రయాణించకూడదు అన్నది ప్రస్తుత రూల్‌. ఇకపోతే, పిల్లలు ఉన్నవారు తప్పని సరి పరిస్థితుల్లో ఇద్దరు పిల్లలతో పాటు వెళ్తుంటారు. కానీ, సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కొన్ని ఫన్నీ సీన్స్‌ కనిపిస్తుంటాయి. ఒకే ఒక్క బైక్‌పై ముగ్గురు, నలుగురికి మించి కూడా వెళ్తుంటారు. అలాంటి వారు ఆఖరుకు పోలీసులకు చిక్కి తగిన పాఠం నేర్చుకుంటారు..అయితే, తాజాగా ఇక్కడ కూడా అలాంటి వీడియోనే ఒకటి నెట్టింట్‌ తెగ చక్కర్లు కొడుతుంది. ముగ్గురు కాదు.. ఐదుగురు కాదు.. ఒకే బైకుపై ఏకంగా ఆరుగురు ప్రయాణించారు.

ఇంటర్‌నెట్‌లో దూసుకుపోతున్న ఈ వీడియోలో…. హోండా యాక్టీవాపై ఒకేసారి ఆరుగురు ప్రయాణించడం చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఒకే సీటు మీద ఐదుగురు కూర్చోగలిగారు. మరొకరు కూర్చోడానికి అక్కడ అస్సలు ప్లేస్ లేదు. దీంతో స్కూటీ వెనుక చివర్లో కూర్చోన్న వ్యక్తి ఓ బాలుడిని ఏకంగా తన భుజాలపై కూర్చోబెట్టుకున్నాడు. దీంతో అటుగా వెళ్తున్న ప్రయాణికులు వారిని చూసి షాకయ్యారు. నడిరోడ్డుపై ఇదేం సర్కస్ ఫీట్లురా బాబు, కాస్త అటు ఇటైతే..ఏంటి సంగతి అంటున్నారు. కాగా, రోడ్డుపై ఓ వ్యక్తి దీన్ని రికార్డు చేసి ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ఆ ట్వీట్‌కు ముంబయి పోలీస్ కమిషనర్, ముంబయి ట్రాఫిక్ పోలీసులను ట్యాగ్ చేశాడు. వీడియో చూసి షాక్‌ తిన్నంత పనైది ముంబయి పోలీసులకు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకుని, తగిన విచారణ జరిపించాలని స్థానిక పోలీసులను అలర్ట్‌ చేశారు.

అయితే, ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతోంది. వీడియో చూసిన నెటిజన్లు భిన్నమైన కామెంట్లు పెడుతున్నారు.